‘క్యాట్’ తుది దశలో అనుసరించాల్సిన వ్యూహాలు...
Sakshi Education
ప్రతిష్టాత్మక బిస్కూల్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)ల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే క్యాట్.. 2018, నవంబర్ 25న జరిగింది. దాదాపు 2 లక్షల మందికిపైగా పరీక్షకు హాజరయ్యారు. తాజాగా కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్) ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రముఖ ఐఐఎంలు కటాఫ్ పర్సంటైల్స్‌తోపాటు తుది దశ ఎంపిక ప్రక్రియకు కసరత్తు ప్రారంభించాయి. విద్యార్థుల ముందున్న తక్షణ కర్తవ్యం క్యాట్ స్కోర్‌కు అనుగుణంగా ఆయా ఐఐఎంలకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు తుది దశలో సత్తా చాటడమే! ఈ నేపథ్యంలో ఐఐఎంల తుదిదశ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఇందులో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్...
జీడీ/పీఐ :
ఐఐఎంలు క్యాట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. జాబితాలోని అభ్యర్థులకు రిటెన్ ఎబిలిటీ టెస్ట్(డబ్ల్యూఏటీ), పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఎక్కువ శాతం ఐఐఎంలు క్యాట్ స్కోరు, గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)కు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నాయి. కాబట్టి క్యాట్ ఉత్తీర్ణులు జీడీ, పీఐలకు ప్రత్యేకంగా సన్నద్ధం కావాలి. మొత్తం వంద మార్కుల వెయిటేజీ ఫార్మాట్‌లో జీడీ, పీఐల వెయిటేజీ 35 నుంచి 50 శాతం మేర ఉంటుంది. ఈ రెండు దశల్లో ఎదురయ్యే ప్రశ్నలు/అంశాలు అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్, కాంటెంపరరీ అవేర్‌నెస్‌లను పరీక్షించేవిగా ఉంటున్నాయి. వీటితోపాటు చదువుల్లో అభ్యర్థి చూపిన ప్రతిభ, పని అనుభవం, జెండర్ డైవర్సిటీ తదితర ప్రామాణికాలను సైతం ఐఐఎంలు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.
సామాజికం-సమకాలీనంపై అవగాహన :
మలిదశ ఎంపిక ప్రక్రియలో ఐఐఎంలు ముందుగా గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తాయి. ఇందులో భాగంగా అభ్యర్థులను బృందాలుగా విభజించి.. ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి చర్చించమంటారు. ఐఐఎంలు గ్రూప్ డిస్కషన్‌లో నిర్దేశిస్తున్న అంశాల్లో అధిక శాతం సామాజిక అంశాలు, సమకాలీన పరిణామాలకు సంబంధించినవి ఉంటున్నాయి. నిర్దిష్టంగా ఒక రంగానికే పరిమితం కాకుండా.. అన్ని రంగాలకు చెందిన అంశాలను గ్రూప్ డిస్కషన్‌లో పేర్కొంటున్నారు. వీటిలో బిజినెస్, మేనేజ్‌మెంట్‌తో ఏ మాత్రం సంబంధం లేని అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అన్ని రంగాలకు సంబంధించిన తాజా పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆయా అంశాలను అన్ని కోణాల్లో చర్చించేలా సిద్ధమవ్వాలి.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్ :
రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో ఒక నిర్దిష్ట అంశాన్ని పేర్కొని దానిపై అభ్యర్థి తన అభిప్రాయాలు వ్యక్తంచేసేలా ప్రశ్నలు అడుగుతారు. ఒక అంశానికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాలతో అభ్యర్థులు సమాధానం రాయాల్సి ఉంటుంది. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో పేర్కొనే అంశాలు సైతం సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సమ్మిళితంగా ఉంటున్నాయి.
గుర్తించాల్సిన అంశాలు
వ్యక్తిగత ఆసక్తులు..
ఇటీవల కాలంలో ఐఐఎంల ఔత్సాహికుల్లో ఇంజనీరింగ్ నేపథ్యం కలిగిన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఐఐఎంలు ఆయా అభ్యర్థులకు బిజినెస్ మేనేజ్‌మెంట్‌పై ఉన్న ఆసక్తిని ఇంటర్వ్యూ ద్వారా లోతుగా తెలుసుకుంటున్నాయి. దీంతోపాటు పత్రికల్లో వచ్చే వార్తలు, ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై అభిప్రాయాలు అడుగుతున్నారు. కాబట్టి జీడీ/పీఐ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌ల్లో విజయం సాధించాలంటే.. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన తప్పనిసరి.
ఇవీ కీలకమే
ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో క్యాట్ స్కోర్, జీడీ/పీఐలకు అదనంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
వైవిధ్యం :
ఐఐఎంలు, ఐఐటీలు కొంత మందికే పరిమితమవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో అన్ని వర్గాలకు ఐఐఎంల్లో చదివే అవకాశం లభించేలా డైవర్సిటీ(వైవిధ్యం)కి పలు చర్యలు చేపట్టాయి.
జండర్ డైవర్సిటీ: మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు ఐఐఎంలు జెండర్ డైవర్సిటీని పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ మూడు నుంచి అయిదు శాతం మధ్య ఉంటుంది.
అకడమిక్ డైవర్సిటీ: ఐఐఎంలు అకడమిక్‌గా వివిధ నేపథ్యాల విద్యార్థులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో అకడమిక్ డైవర్సిటీని పరిగణలోకి తీసుకుంటున్నాయి. దీనికి కూడా మూడు నుంచి అయిదు శాతం వెయిటేజీ లభిస్తోంది. దాంతోపాటు పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో సాధించిన మార్కులకు ప్రత్యేక వెయిటేజీ లభిస్తుంది. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో పొందిన జీపీఏ/ఉత్తీర్ణత శాతం ఆధారంగా నిర్దిష్ట వెయిటేజీ మొత్తాలను గణిస్తారు.
ఆ కోర్సులకూ వెయిటేజీ :
క్యాట్ రాసేందుకు కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీ! ఐఐఎంలు తుది దశలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వెయిటేజీ పేరుతో బ్యాచిలర్ డిగ్రీకి అదనంగా చదివిన కోర్సులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతంగా ఉంటోంది. పని అనుభవానికి ఐదు నుంచి పది శాతం వెయిటేజీ లభిస్తుంది.
సక్సెస్ టిప్స్..
- ప్రస్తుతం దేశంలో 20 ఐఐఎంలు 4000లకు పైగా పీజీపీ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఐఐఎంలు క్యాట్ స్కోరుతోపాటు గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ), రిటెన్ ఎబిలిటీ టెస్ట్(ఆర్‌ఏటీ), పని అనుభవం, అకడెమిక్ ప్రతిభ వంటి భిన్న ప్రామాణికాల ఆధారంగా కోర్సులో ప్రవేశాలను ఖరారు చేస్తున్నాయి. ఆయా ప్రామాణికాలకు ఒక్కో ఐఐఎం ఒక్కోరకమైన వెయిటేజీ ఇస్తున్నాయి.
- 2019-21 బ్యాచ్‌కు సంబంధించి ఐఐఎం అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నోలు తుదిదశ ఎంపిక ప్రక్రియను ప్రకటించాయి. మిగిలిన ఐఐఎంలు సైతం త్వరలోనే ప్రకటించే అవకాశముంది. బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం పర్సంటైల్ ఉన్న అభ్యర్థులనే తుది దశ ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
జీడీ/పీఐ :
ఐఐఎంలు క్యాట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. జాబితాలోని అభ్యర్థులకు రిటెన్ ఎబిలిటీ టెస్ట్(డబ్ల్యూఏటీ), పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఎక్కువ శాతం ఐఐఎంలు క్యాట్ స్కోరు, గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)కు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నాయి. కాబట్టి క్యాట్ ఉత్తీర్ణులు జీడీ, పీఐలకు ప్రత్యేకంగా సన్నద్ధం కావాలి. మొత్తం వంద మార్కుల వెయిటేజీ ఫార్మాట్‌లో జీడీ, పీఐల వెయిటేజీ 35 నుంచి 50 శాతం మేర ఉంటుంది. ఈ రెండు దశల్లో ఎదురయ్యే ప్రశ్నలు/అంశాలు అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్, కాంటెంపరరీ అవేర్‌నెస్‌లను పరీక్షించేవిగా ఉంటున్నాయి. వీటితోపాటు చదువుల్లో అభ్యర్థి చూపిన ప్రతిభ, పని అనుభవం, జెండర్ డైవర్సిటీ తదితర ప్రామాణికాలను సైతం ఐఐఎంలు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.
సామాజికం-సమకాలీనంపై అవగాహన :
మలిదశ ఎంపిక ప్రక్రియలో ఐఐఎంలు ముందుగా గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తాయి. ఇందులో భాగంగా అభ్యర్థులను బృందాలుగా విభజించి.. ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి చర్చించమంటారు. ఐఐఎంలు గ్రూప్ డిస్కషన్‌లో నిర్దేశిస్తున్న అంశాల్లో అధిక శాతం సామాజిక అంశాలు, సమకాలీన పరిణామాలకు సంబంధించినవి ఉంటున్నాయి. నిర్దిష్టంగా ఒక రంగానికే పరిమితం కాకుండా.. అన్ని రంగాలకు చెందిన అంశాలను గ్రూప్ డిస్కషన్‌లో పేర్కొంటున్నారు. వీటిలో బిజినెస్, మేనేజ్‌మెంట్‌తో ఏ మాత్రం సంబంధం లేని అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అన్ని రంగాలకు సంబంధించిన తాజా పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆయా అంశాలను అన్ని కోణాల్లో చర్చించేలా సిద్ధమవ్వాలి.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్ :
రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో ఒక నిర్దిష్ట అంశాన్ని పేర్కొని దానిపై అభ్యర్థి తన అభిప్రాయాలు వ్యక్తంచేసేలా ప్రశ్నలు అడుగుతారు. ఒక అంశానికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాలతో అభ్యర్థులు సమాధానం రాయాల్సి ఉంటుంది. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో పేర్కొనే అంశాలు సైతం సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సమ్మిళితంగా ఉంటున్నాయి.
గుర్తించాల్సిన అంశాలు
- గ్రూప్ డిస్కషన్ సందర్భంగా ఒకే అంశంపై పది లేదా ఇరవై మంది బృందంలో చర్చించాల్సి ఉంటుంది. ఆ సమయంలో స్వీయ అభిప్రాయాలను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో చెప్పగలగాలి. అభిప్రాయాలను వ్యక్తం చేసిన విధానానికి ఐఐఎంలు ప్రత్యేక మార్కులు ఇస్తున్నాయి.
- రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో అభ్యర్థి తన అభిప్రాయాలను రాతపూర్వకంగా వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇందులో వాడిన పదాలు, పదజాలం, వాక్య నిర్మాణం, స్థూల వ్యక్తీకరణల ఆధారంగా మార్కులు లభిస్తాయి.
వ్యక్తిగత ఆసక్తులు..
ఇటీవల కాలంలో ఐఐఎంల ఔత్సాహికుల్లో ఇంజనీరింగ్ నేపథ్యం కలిగిన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఐఐఎంలు ఆయా అభ్యర్థులకు బిజినెస్ మేనేజ్‌మెంట్‌పై ఉన్న ఆసక్తిని ఇంటర్వ్యూ ద్వారా లోతుగా తెలుసుకుంటున్నాయి. దీంతోపాటు పత్రికల్లో వచ్చే వార్తలు, ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై అభిప్రాయాలు అడుగుతున్నారు. కాబట్టి జీడీ/పీఐ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌ల్లో విజయం సాధించాలంటే.. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన తప్పనిసరి.
ఇవీ కీలకమే
ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో క్యాట్ స్కోర్, జీడీ/పీఐలకు అదనంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
వైవిధ్యం :
ఐఐఎంలు, ఐఐటీలు కొంత మందికే పరిమితమవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో అన్ని వర్గాలకు ఐఐఎంల్లో చదివే అవకాశం లభించేలా డైవర్సిటీ(వైవిధ్యం)కి పలు చర్యలు చేపట్టాయి.
జండర్ డైవర్సిటీ: మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు ఐఐఎంలు జెండర్ డైవర్సిటీని పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ మూడు నుంచి అయిదు శాతం మధ్య ఉంటుంది.
అకడమిక్ డైవర్సిటీ: ఐఐఎంలు అకడమిక్‌గా వివిధ నేపథ్యాల విద్యార్థులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో అకడమిక్ డైవర్సిటీని పరిగణలోకి తీసుకుంటున్నాయి. దీనికి కూడా మూడు నుంచి అయిదు శాతం వెయిటేజీ లభిస్తోంది. దాంతోపాటు పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో సాధించిన మార్కులకు ప్రత్యేక వెయిటేజీ లభిస్తుంది. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో పొందిన జీపీఏ/ఉత్తీర్ణత శాతం ఆధారంగా నిర్దిష్ట వెయిటేజీ మొత్తాలను గణిస్తారు.
ఆ కోర్సులకూ వెయిటేజీ :
క్యాట్ రాసేందుకు కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీ! ఐఐఎంలు తుది దశలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వెయిటేజీ పేరుతో బ్యాచిలర్ డిగ్రీకి అదనంగా చదివిన కోర్సులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతంగా ఉంటోంది. పని అనుభవానికి ఐదు నుంచి పది శాతం వెయిటేజీ లభిస్తుంది.
సక్సెస్ టిప్స్..
- ఐఐఎంల తుది దశ ప్రవేశ ప్రక్రియకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు లక్ష్యంపై స్పష్టతతో అడుగులు వేయాలి. క్రేజ్ కారణంగా మేనేజ్‌మెంట్ కోర్సును ఎంపిక చేసుకున్నామనో లేదా ఐఐఎంలకున్న ప్రాధాన్యం మేరకు క్యాట్‌కు హాజరయ్యామనే రీతిలో వ్యవహరించకూడదు.
- ఐఐఎంల్లో చేరాలనుకునే అభ్యర్థులు భవిష్యత్తుకు సంబంధించి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
- ప్రిపరేషన్‌లో కరెంట్ ఈవెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో మంచి భావవ్యక్తీకరణ కోసం వొకాబ్యులరీని పెంచుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం లాభిస్తుంది.
- ఐఐఎంల తుది దశ ఎంపిక ప్రక్రియలో నైతిక విలువలు, సామాజిక దృక్పథాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ దిశగా ఉద్యోగం పరంగా వేతనానికి ప్రాధాన్యమివ్వాలా? లేదా ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలా? అనే అంశంపై అభిప్రాయాలు చెప్పమని అడగొచ్చు.
Published date : 11 Jan 2019 03:01PM