క్యాట్-2019 తుది రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూకు సిద్ధంకండిలా...!
Sakshi Education
కామన్ ఎంట్రన్స్ టెస్ట్(క్యాట్).. మేనేజ్‌మెంట్ విద్యార్థుల హాట్ ఫేవరెట్ ఎగ్జామ్..! సంవత్సరం ఏదైనా క్యాట్‌పై జరిగే చర్చ అంతా ఇంతా కాదు..! ఏటా తనదైన శైలిలో విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేయడం క్యాట్ పరీక్ష ప్రత్యేకత! ఈ నెల (నవంబర్) 24న దేశవ్యాప్తంగా రెండు స్లాట్‌ల్లో క్యాట్-2019 జరిగింది. దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో... పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఉపయోగపడేలా క్యాట్ రివ్యూతోపాటు ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో తదుపరి దశలైన రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ), గ్రూప్ డిస్కషన్(జీడీ)లకు సంబంధించిన గెడైన్స్...
క్యాట్ ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా చూస్తే గతేడాదితో పోల్చితే సులభంగా ఉంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్(డీఐఎల్‌ఆర్), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(క్యూఏ) విభాగాలు సులభంగా ఉండగా.. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్(వీఏఆర్‌సీ) విభాగం క్లిష్టత పెరిగింది.
వీఏఆర్‌సీ :
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్‌సీ) నుంచి 34 ప్రశ్నలు వచ్చాయి. ఆర్‌సీలో నాలుగు ప్యాసేజ్‌ల నుంచి ఐదేసి ప్రశ్నల చొప్పున మొత్తం 20 ప్రశ్నలు.. ఒక ప్యాసేజ్ నుంచి నాలుగు ప్రశ్నలు అడిగారు. వెర్బల్ ఎబిలిటీ(వీఏ) నుంచి 10 ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో నాలుగు పారా జంబల్డ్, మూడు ఆడ్ మ్యాన్ ఔట్, మూడు పారా సమ్మరీ ప్రశ్నలు అడిగారు. ఈ విభాగం నుంచి 7 నాన్ ఎంసీక్యూ ప్రశ్నలు వచ్చాయి. ఉదయం సెషన్‌లో ఈ విభాగం అంచనాల మేరకే ఉంది. ప్యాట్రన్ పరంగా ఎలాంటి మార్పు లేదు. గత మూడేళ్లతో పోల్చితే క్లిష్టత స్థాయి పెరిగింది. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు లాంగ్వేజ్‌పై పట్టున్న వారిని సైతం ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. మధ్యాహ్నం సెషన్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్(ఆర్‌సీ)లు పెద్దగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే క్లిష్టంగా ఉన్నాయి. ఉదయం సెషన్‌లో వీఏ సులభంగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం సెషన్‌లో కఠినంగా ఉంది.
డీఐఎల్‌ఆర్ :
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్(డీఐఎల్‌ఆర్) నుంచి 32 ప్రశ్నలు వచ్చాయి. 8 సెట్‌లు.. ఒక్కో సెట్ నుంచి నాలుగు ప్రశ్నలు అడిగారు. ఈ విభాగంలో 8 నాన్ ఎంసీక్యూ ప్రశ్నలు అడిగారు. ఈ విభాగం అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. గత మూడేళ్లతో పోల్చితే సులభంగా ఉండటం విశేషం. కొన్ని సెట్లు నేరుగా ఉంటే.. మరికొన్ని అప్లికేషన్ ఆధారితంగా ఉన్నాయి. నేరుగా అడిగిన సెట్లు స్కోరింగ్ పరంగా విద్యార్థులకు ఉపయోగపడనున్నాయి. మధ్యాహ్నం సెషన్‌లోనూ ఈ విభాగం సులభంగా ఉంది. అన్ని సెట్లు అభ్యర్థులు అటెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి.
క్యూఏ :
క్వాంటిటేటివ్ ఎబిలిటీ (క్యూఏ) నుంచి 34 ప్రశ్నలు వచ్చాయి. ఈ విభాగంలో 11 నాన్ ఎంసీక్యూ ప్రశ్నలు అడిగారు. క్యూఏ విభాగంలో విద్యార్థులను విస్మయపరిచే అంశాలేమీ లేవు. గతేడాదితో పోల్చితే సులభంగా ఉంది. సులభమైన ప్రశ్నలను ముందుగా సాధనచేసి.. ఆన్‌స్క్రీన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి.. మిగిలిన ప్రశ్నల సాధనకు ప్రయత్నించిన వారికి స్కోరింగ్ పరంగా ప్రయోజనం ఉంటుంది. మధ్యాహ్నం సెషన్‌లో ప్రశ్నల సరళి, క్లిష్టత ఉదయం సెషన్ తరహాలోనే ఉంది. పదాలతో కూడిన ప్రశ్నలను తక్కువగా అడిగారు. ప్రశ్నలు ఫార్ములాలను ఉపయోగించి తక్కువ సమయంలో సాధించేలా ఉన్నాయి. మొత్తంగా ఈ విభాగం పర్వాలేదనే స్థాయిలో ఉంది.
సిద్ధంకండిలా...!
‘క్యాట్‌ను బాగా రాశాం.. ఇక రిలాక్స్ అవుదాం’ అని భావిస్తే.. భవిష్యత్ అంచనాలు తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది. అభ్యర్థులు మరికొన్ని రోజుల్లో మరో కీలక దశను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి క్యాట్‌లో మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. పూర్తిగా రిలాక్స్ అవడానికి వీల్లేదు. ఓ నాలుగైదు రోజులు పుస్తకాలను పక్కనబెట్టొచ్చు. ఆ తర్వాత ఐఐఎం మలిదశ ఎంపిక ప్రక్రియకు సన్నద్ధతను ప్రారంభించాలి.
క్యాట్ స్కోర్... షార్ట్‌లిస్ట్ :
ఐఐఎంలు క్యాట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. జాబితాలోని అభ్యర్థులకు రిటెన్ ఎబిలిటీ టెస్ట్ (డబ్ల్యూఏటీ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ), గ్రూప్ డిస్కషన్(జీడీ) నిర్వహిస్తాయి. గతేడాది కేవలం రెండు ఐఐఎంలు మాత్రమే గ్రూప్ డిస్కషన్ జరిపాయి. అత్యధిక ఐఐఎంలు క్యాట్ స్కోరు, రిటెన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేశాయి. కొత్త ఐఐఎంలు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు కామన్ అడ్మిషన్ ప్రాసెస్(క్యాప్) పేరుతో ఎంపిక ప్రక్రియను చేపడుతున్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను తెలుసుకొనేందుకు సదరు ఐఐఎం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్ :
ఇందులో అభ్యర్థులు సాధారణంగా ఒక అంశానికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాలతో సమాధానం రాయాల్సి ఉంటుంది. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో పేర్కొనే అంశాలు సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సమ్మిళితంగా ఉంటున్నాయి. అభ్యర్థి తన అభిప్రాయాలను రాతపూర్వకంగా వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇందులో వినియోగించిన పదాలు, పదజాలం, వాక్య నిర్మాణం, స్థూల వ్యక్తీకరణల ఆధారంగా మార్కులు లభిస్తాయి.
జీడీలో సమకాలీనం :
గ్రూప్ డిస్కషన్(జీడీ)లో అభ్యర్థులను బృందాలుగా విభజించి.. ఏదైనా అంశంపై చర్చించమంటారు. నిర్దిష్టంగా ఏ ఒక్క రంగానికీ పరిమితం కాకుండా.. అన్ని రంగాలకు సంబంధించిన అంశాలను అడిగే వీలుంది. బిజినెస్‌కు, మేనేజ్‌మెంట్‌కు ఏ మాత్రం సంబంధం లేని అంశాలను కూడా అడుగుతారు. సామాజిక, సమకాలీన అంశాలకు ఒకింత ప్రాధాన్యం దక్కుతుంది. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు అన్ని రంగాల్లోని చర్చనీ యాంశాలపై అవగాహన పెంచుకోవాలి. జీడీ సందర్భంగా ఒకే విషయంపై పది లేదా ఇరవై మంది ఉన్న బృందంలో చర్చించాల్సి ఉంటుంది. ఆ సమయంలో స్వీయ అభిప్రాయాలను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో చెప్పాలి. వెల్లడించిన అభిప్రాయాలు, వ్యక్తీకరించిన తీరుకు ప్రత్యేక మార్కులు ఉంటాయి.
పర్సనల్ ఇంటర్వ్యూ :
పర్సనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థికి మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న ఆసక్తి, భవిష్యత్ లక్ష్యాలు, వాటిని సాధించేందుకు ఎంచుకున్న మార్గాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. ఇంజనీరింగ్ నేపథ్యం కలిగిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐఐఎంలు ఆయా అభ్యర్థులకు బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న ఆసక్తిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అదేవిధంగా దినపత్రికల్లో వచ్చే వార్తలు, వివిధ ప్రభుత్వ పథకాలు-అమలు తీరుపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.
ఇవీ కీలకమే..
కోర్సులకు వెయిటీజీ :
పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో సాధించిన మార్కులకు ప్రత్యేక వెయిటేజీలు ఇస్తున్నారు. ఆయా కోర్సుల్లో పొందిన జీపీఏ/ఉత్తీర్ణత శాతం ఆధారంగా వెయిటేజీ గణిస్తారు.
వృత్తిపరమైన అర్హత :
క్యాట్‌కు అర్హత బ్యాచిలర్ డిగ్రీ. అయితే ఐఐఎంలు తుది దశలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వెయిటేజీ పేరుతో బ్యాచిలర్ డిగ్రీకి అదనంగా చేసిన కోర్సులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతంగా ఉంటోంది.
పని అనుభవం :
తుది దశలో వెయిటేజీ పరంగా అధిక ప్రాధాన్యం ఉన్న అంశం.. పని అనుభవం. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు తుది జాబితా రూపకల్పనలో ఐదు నుంచి పది శాతం వెయిటేజీ లభిస్తుంది. ఇది అభ్యర్థులు పని చేస్తున్న రంగం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది.
ప్రొఫైల్ వెయిటేజీ :
కొత్త ఐఐఎంలు రాంచీ, రాయ్‌పూర్, రోహ్‌తక్, త్రిచీ, ఉదయ్‌పూర్, కాశీపూర్ ఐఐఎంల ఎంపిక ప్రక్రియను ఐఐఎం-ఉదయ్‌పూర్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐఐఎం ఉదయ్‌పూర్ ఎంపికకు సంబంధించి ప్రొఫైల్ వెయిటేజీ పేరుతో ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తోంది. 24 శాతం వెయిటేజీ ఉన్న ప్రొఫైల్‌లో అకడమిక్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, డైవర్సిటీ అంశాలను పొందుపరిచారు.

- ప్రత్యేక ప్రామాణిక అంశాల్లో ‘వైవిధ్యం’ ముందు వరుసలో ఉంటుంది. ఐఐఎంలు, ఐఐటీలు కొందరికే పరిమితమవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో.. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు అభ్యర్థుల ఎంపికలో వైవిధ్యం చూపుతున్నాయి. ఈ వైవిధ్యత రెండు రకాలుగా ఉంటుంది. అవి.. జెండర్ డైవర్సిటీ, అకడెమిక్ డైవర్సిటీ.
- జెండర్ డైవర్సిటీ: మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు ఐఐఎంలు జెండర్ డైవర్సిటీని అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళలకు మూడు నుంచి ఐదు శాతం మేర ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి.
- అకడెమిక్ డైవర్సిటీ: భిన్న అకడమిక్ నేపథ్యాలు కలిగిన విద్యార్థులకు ఐఐఎంల్లో చోటు కల్పించే ఉద్దేశంతో అకడెమిక్ డైవర్సిటీని అమలుచేస్తున్నారు. దీనికి మూడు నుంచి ఐదు శాతం వెయిటేజీ ఉంటుంది.
కోర్సులకు వెయిటీజీ :
పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో సాధించిన మార్కులకు ప్రత్యేక వెయిటేజీలు ఇస్తున్నారు. ఆయా కోర్సుల్లో పొందిన జీపీఏ/ఉత్తీర్ణత శాతం ఆధారంగా వెయిటేజీ గణిస్తారు.
వృత్తిపరమైన అర్హత :
క్యాట్‌కు అర్హత బ్యాచిలర్ డిగ్రీ. అయితే ఐఐఎంలు తుది దశలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వెయిటేజీ పేరుతో బ్యాచిలర్ డిగ్రీకి అదనంగా చేసిన కోర్సులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతంగా ఉంటోంది.
పని అనుభవం :
తుది దశలో వెయిటేజీ పరంగా అధిక ప్రాధాన్యం ఉన్న అంశం.. పని అనుభవం. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు తుది జాబితా రూపకల్పనలో ఐదు నుంచి పది శాతం వెయిటేజీ లభిస్తుంది. ఇది అభ్యర్థులు పని చేస్తున్న రంగం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది.
ప్రొఫైల్ వెయిటేజీ :
కొత్త ఐఐఎంలు రాంచీ, రాయ్‌పూర్, రోహ్‌తక్, త్రిచీ, ఉదయ్‌పూర్, కాశీపూర్ ఐఐఎంల ఎంపిక ప్రక్రియను ఐఐఎం-ఉదయ్‌పూర్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐఐఎం ఉదయ్‌పూర్ ఎంపికకు సంబంధించి ప్రొఫైల్ వెయిటేజీ పేరుతో ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తోంది. 24 శాతం వెయిటేజీ ఉన్న ప్రొఫైల్‌లో అకడమిక్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, డైవర్సిటీ అంశాలను పొందుపరిచారు.
వొకాబ్యులరీ పెంచుకోవాలి.. ఐఐఎంల తుది దశ ప్రవేశ ప్రక్రియకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు లక్ష్యంపై స్పష్టతతో అడుగేయాలి. క్రేజ్ కారణంగా మేనేజ్‌మెంట్ కోర్సును ఎంపిక చేసుకున్నామనో లేదా ఐఐఎంలకున్న ప్రాధాన్యం మేరకు క్యాట్‌కు హాజరయ్యామనే రీతిలో సాదాసీదాగా వ్యవహరించకూడదు. ఐఐఎంలో చేరాలనుకునే అభ్యర్థులు భవిష్యత్తుకు సంబంధించి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ప్రిపరేషన్‌లో సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో మంచి భావవ్యక్తీకరణ ప్రదర్శించేందుకు వీలుగా వొకాబ్యులరీని పెంచుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవాలి. ఐఐఎంల తుది దశ ఎంపిక ప్రక్రియలో నైతిక విలువలు, సామాజిక దృక్పథాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. - రామ్‌నాథ్ కే, నేషనల్ క్యాట్ కోర్సు డెరైక్టర్, టి.ఐ.ఎం.ఇ |
Published date : 29 Nov 2019 01:02PM