కొలువుల సాధనలో ముందజ ఉన్న పర్యాటకం.. 2024 వరకు 30 లక్షల వరకు ఉద్యోగాలు..!
Sakshi Education
పర్యాటకం, విహార యాత్రలు.. ట్రావెల్ అండ్ టూరిజంగా సుపరిచితం! ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఆధునిక జీవన శైలి.. ఒత్తిడితో కూడిన పని వాతావరణం.
అందుకే కొందరు సంవత్సరంలో ఒక్కసారైనా ఏదో ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు! మరికొందరు కొత్త ప్రాంతాలను చూడాలని ఉత్సాహపడుతుంటారు!! ఇదే.. ఇప్పుడు ట్రావెల్, టూరిజం రంగంలో..యువతకు అవకాశాలకు మార్గంగా నిలుస్తోంది! పలు టూరిజం, ట్రావెల్ సంస్థలు, ఏజెన్సీలు సుశిక్షితులైన మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే అకడమిక్ నైపుణ్యాలు అందించేలా సంబంధిత కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో ఉద్యోగావకాశాలు, అకడమిక్ నైపుణ్యాలకు మార్గాల గురించి తెలుసుకుందాం..
పలు సంస్థల అంచనా ప్రకారం-2024 నాటికి టూరిజం రంగం మూడు మిలియన్ల ఉద్యోగాలకు వేదికగా నిలవనుంది. గతేడాది కరోనా పరిస్థితుల కారణంగా నియామకాలు కొంతమేర తగ్గాయి. మరికొద్ది నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. దాంతో టూరిజం అండ్ ట్రావెల్ రంగం రికవరీ బాట పట్టి.. నియామకాలు ఆశాజనకంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
విద్యార్థులకు చక్కటి వేదికగా..
ప్రస్తుతం కెరీర్స్, కోర్సులు అనగానే చాలా మందికి సైన్స్, మ్యాథమెటిక్స్ ఆధారంగా ఇంజనీరింగ్, మెడికల్ మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ సబ్జెక్ట్‌లపై ఆసక్తిలేని విద్యార్థులకు చక్కటి ఉపాధి వేదికగా నిలుస్తోంది.. ట్రావెల్ అండ్ టూరిజం. ఈ విభా గంలో ఉపాధికి మార్గం వేసే నైపుణ్యాలు అందించే కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
స్పెషలైజ్డ్ కోర్సులు..
దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు ట్రావెల్, టూరిజం సంబంధిత కోర్సులను.. డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అందిస్తున్నాయి. ముఖ్యంగా..

- డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్
- డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్
- డిప్లొమా ఇన్ టూరిస్ట్ గైడ్
- డిప్లొమా ఇన్ టూరిజం అండ్ టికెటింగ్
- బీఏ, బీఎస్సీ(ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్)
- బీఏ టూరిజం స్టడీస్
- బీబీఏ
- మాస్టర్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం వంటి కోర్సుల్లో చేరే వీలుంది.
కోర్సుల్లో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఇంటర్మీడియెట్ అర్హతతో అడుగు పెట్టొచ్చు. మాస్టర్ స్థాయి కోర్సులకు మాత్రం బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.
ఇంకా చదవండి: part 2: కొలువుల కల్పనలో ముందున్న పర్యాటకం.. రూ.40వేల వరకు ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు..
Published date : 24 Feb 2021 02:40PM