Skip to main content

జనవరి 31న కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. అర్హత వివరాలకు ఇవిగో..

రాష్ట్ర స్థాయిలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి అర్హత పరీక్ష.. టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్). అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ బోధన అందించే కేంద్రీయ విద్యాయాలు, నవోదయ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక అర్హత పరీక్ష నిర్వహిస్తారు.
అదే సెంట్రల్ టీచర్ ఎలిబిలిటీ టెస్ట్(సీటీఈటీ). దీన్ని ‘సిటెట్’ అని కూడా పేర్కొంటారు. సిటెట్‌ను ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్ష 2021 జనవరి 31న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. సిటెట్ పరీక్ష తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం...

ఉపాధ్యాయులుగా అవకాశం..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ).. కేంద్రీయ విద్యాలయ సమితి(కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్) స్కూల్స్‌లో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ చేపడుతుంది. ‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ పరీక్ష పాసైన అభ్యర్థులకు కేవీఎస్, ఎన్‌వీఎస్ నియామక ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా సిటెట్ ఉత్తీర్ణులు సీబీఎస్‌ఈ సిలబస్ బోధించే ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ఉపాధ్యాయులుగా చేరే వీలుంటుంది.

అర్హతలు..
సిటెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1.. ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు; పేపర్-2 ఆరు నుంచి ఎనిమిది తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ఉద్దేశించింది. వీరికి వేర్వేరు విద్యార్హతలను నిర్దేశించారు.
  • ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించేందుకు వీలు కల్పించే సిటెట్ పేపర్-1కు అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన విద్యార్హతలో 50శాతం మార్కులతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
  • ఇంటర్మీడియెట్‌లో 50శాతం మార్కులతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ పూర్తి చేయాలి. (లేదా) ఇంటర్మీడియెట్‌లో 50శాతం మార్కులతోపాటు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవాలి.
  • ఆరు నుంచి ఎనిమిది తరగతులకు బోధించేందుకు వీలుకల్పించే సిటెట్ పేపర్-2కు అభ్యర్థులు డిగ్రీతోపాటు రెండేళ్ల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా పూర్తి చేయాలి. లేదా 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ప్రథమ శ్రేణిలో బీఈడీ ఉండాలి. లేదా ఇంటర్మీడియెట్ తత్సమాన అర్హతలో 50శాతం మార్కులతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్ 50 శాతం మార్కులతో పూర్తి చేయాలి.
  • ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/వికలాంగులకు విద్యార్హత మార్కుల్లో ఐదు శాతం సడలింపు లభిస్తుంది.
ఇంకా చదవండి: part 2: జనవరి 31న సీటెట్.. వయసు పరిమితి వివరాలకు ఇలా..

Published date : 18 Nov 2020 05:07PM

Photo Stories