జీప్యాట్-2021లో ఈ స్కోరు సాధిస్తే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటుతో పాటు రూ.12 వేల స్కాలర్‌షిప్ పక్కా..
Sakshi Education
జీప్యాట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో చాలామంది బీఫార్మసీ మొత్తం సిలబస్‌ను బట్టీ పడుతుంటారు. అలా కాకుండా ఎన్‌టీఏ పేర్కొన్న సిలబస్‌ను మాత్రమే ప్రిపేరయితే మంచి ఫలితాలు సాధించొచ్చు.
జీప్యాట్‌లో 130-140 స్కోరుకు పైగా సాధిస్తే తెలుగు రాష్ట్రాల్లోని మంచి కాలేజీల్లో సీటు లభిస్తుంది. దీంతోపాటు నెలకు రూ.12,000 స్కాలర్‌షిప్ అందుకోవచ్చు.
ముఖ్యతేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 22, 2021
- ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: జనవరి 23, 2021
- పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22/27, 2021
- ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2000, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన జనరల్(ఈడబ్ల్యూఎస్), ఓబీసీ (నాన్ క్రీమిలేయర్), ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు రూ.1000.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://gpat.nta.nic.in
ఇంకా చదవండి: part 1: జాతీయ స్థాయిలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో ఫార్మసీలో పీజీ చేయాలనుకునే వారికి అవకాశం.. జీప్యాట్-2021 నోటిఫికేషన్ విడుదల..
Published date : 07 Jan 2021 02:59PM