జీమ్యాట్‌లో కొత్త మార్పులకు శ్రీకారం...
Sakshi Education
గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా జీమ్యాట్! అంతర్జాతీయంగా మూడువేలకు పైగా ఇన్‌స్టిట్యూట్‌లలో ఏడు వేలకుపైగా మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! తాజాగా జీమ్యాట్ నిర్వాహక సంస్థ జీమ్యాక్.. జీమ్యాట్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది! వీటిలో ప్రధానమైంది.. టెస్ట్ సమయం కుదింపు! వీటితోపాటు మరికొన్ని మార్పులు కూడా..! ఈ నేపథ్యంలో జీమ్యాట్ నూతన విధానంపై విశ్లేషణ...
విదేశాల్లో ఎంబీఏ చదవాలంటే జీమ్యాట్‌లో స్కోర్ తప్పనిసరి. అదే సమయంలో ఈ పరీక్షలో విభాగాలు, ప్రశ్నల కోణంలో క్లిష్టత స్థాయి కూడా ఎక్కువే. దీనికితోడు ప్రస్తుతం నాలుగు గంటలుగా ఉన్న టెస్ట్ సమయం కూడా విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశంగా మారింది. కారణం.. టెస్ట్ వ్యవధిలో విద్యార్థులు సెక్షన్ వారీగా అడిగిన ప్రశ్నలు, వాటికి తామిచ్చిన సమాధానాలు చూసుకోవడం.. తప్పు సమాధానాలు ఇస్తే మానసికంగా ఆందోళన చెందడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న జీమ్యాక్.. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి జీమ్యాట్‌లో మార్పులు చేసింది.
మూడున్నర గంటలకే టెస్ట్ :
జీమ్యాట్ నూతన విధానంలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. టెస్ట్ వ్యవధిని కుదించడం. ప్రస్తుతం విరామ సమయంతో కలిపి నాలుగు గంటలుగా ఉన్న జీమ్యాట్ వ్యవధిని మూడున్నర గంటలకు కుదిస్తూ జీమ్యాక్ నిర్ణయం తీసుకుంది. పరీక్షలో అడిగే నాలుగు విభాగాల్లో (క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్) రెండు విభాగాలకు సంబంధించి ప్రశ్నలు, సమయం సంఖ్యను తగ్గించింది.
క్యూఆర్, వీఆర్ విభాగాల్లో తగ్గింపు :
సగటు సమయం గతంలో మాదిరిగానే...
తాజా మార్పులో భాగంగా క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్‌లో ప్రశ్నల సంఖ్య, సెక్షన్ వారీ సమయాన్ని తగ్గించినప్పటికీ.. ప్రశ్నలకు సమాధానాలిచ్చే క్రమంలో సగటు సమయం దాదాపుగా పాత విధానంలోనే ఉందని నిపుణుల అభిప్రాయం. క్వాంటిటేటివ్ రీజనింగ్‌లో ఒక్కో ప్రశ్నకు రెండు నిమిషాలు లభిస్తుందని, అదే విధంగా వెర్బల్ రీజనింగ్‌లో సైతం 108 సెకన్లు ఉందని నిపుణుల అభిప్రాయం.
ప్రశ్నల తగ్గింపు.. అత్యంత ఉపశమనం
క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్ విభాగాల్లో ఎక్స్‌పరిమెంటల్ ప్రశ్నలను తగ్గించడాన్ని అభ్యర్థులకు అత్యంత ఉపశమనంగా పేర్కొనొచ్చు. కారణం.. వీటికి పొందిన మార్కులను జీమ్యాట్ అధికారిక స్కోర్‌లో కలపరు. పాత విధానంలో వీటిని ముందుగానే సమాధానం ఇవ్వాల్సి వచ్చేది. పర్యవసానంగా విద్యార్థులు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి నెలకొనేది. స్కోర్ కార్డ్‌లో కలపని ఈ ఎక్స్‌పరిమెంటల్ ప్రశ్నలను తగ్గించడం పై అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌పరిమెంటల్ ప్రశ్నల సంఖ్య క్వాంటిటేటివ్ రీజనింగ్‌లో తొమ్మిది నుంచి మూడుకు; వెర్బల్ రీజనింగ్‌లో 11 నుంచి ఆరుకు తగ్గడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
మిగతా సెక్షన్లు యథాతథం :
జీమ్యాట్‌లో క్యూఆర్, వీఆర్‌లో మార్పులు చేసినప్పటికీ.. మిగతా రెండు సెక్షన్లు అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్‌ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
ఆన్‌లైన్ ట్యుటోరియల్ :
జీమ్యాట్ కొత్త విధానంలో విద్యార్థులకు ప్రయోజనం కలిగించే మరో నిర్ణయం.. పరీక్ష తేదీ కంటే ముందుగానే విద్యార్థులు ఆన్‌లైన్ ట్యుటోరియల్ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించడం. ఇప్పటివరకు అభ్యర్థులకు టెస్ట్ తేదీన మాత్రమే ఆన్‌లైన్ ట్యుటోరియల్ సదుపాయం ఉండేది. తాజా నిర్ణయంతో అభ్యర్థులు టెస్ట్ తేదీకంటే ముందుగానే ఎంబీఏ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ట్యుటోరియల్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల టెస్ట్ స్వరూపం, సెక్షనల్ నేవిగేషన్ వంటి అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఫలితంగా టెస్ట్ తేదీన కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా టెస్ట్‌ను ముగించే అవకాశం లభిస్తుంది.
మార్పు లేని స్కోరింగ్ విధానం :
క్యూఆర్, వీఆర్ విభాగాల్లో ప్రశ్నలు, సమయం తగ్గించినప్పటికీ.. జీమ్యాట్ స్కోరింగ్ విధానం పరంగా ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరిగానే 800 పాయింట్ల స్కేల్‌తో స్కోర్స్ కేటాయిస్తారు. విద్యార్థులు బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకోవాలంటే 600 నుంచి 650 పాయింట్ల మధ్యలో స్కోర్ సాధించే విధంగా కృషి చేయాలి.
ఏటా అయిదుసార్లు :
జీమ్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ఈ టెస్ట్‌ను ఏడాదిలో గరిష్టంగా అయిదుసార్లు రాసే వీలుంది. ఒకసారి రాసిన టెస్ట్‌లో స్కోర్ తక్కువగా వచ్చిందని భావిస్తే మరోసారి రాసుకునే విధంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రతి టెస్ట్‌కు మధ్య కనీసం 16 రోజుల వ్యవధి తప్పనిసరి.

- Add your content... పాత విధానంలో క్వాంటిటేటివ్ రీజనింగ్‌లో 75 నిమిషాల్లో 37 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వచ్చేది. కొత్త విధానంలో ఈ ప్రశ్నల సంఖ్యను 31కు తగ్గించింది. అదే విధంగా సమయం కూడా 62 నిమిషాలకు కుదించింది.
- వెర్బల్ రీజనింగ్ విభాగంలో పాత విధానంలో 75 నిమిషాల్లో 41 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. కొత్త విధానంలో ఈ ప్రశ్నలను 36కు తగ్గించడంతోపాటు వ్యవధిని కూడా 65 నిమిషాలకు కుదించింది.
- మొత్తంగా చూస్తే ఈ రెండు విభాగాల నుంచి పాత విధానంతో పోల్చితే కొత్త విధానంలో 11 ప్రశ్నలు తగ్గాయి. అదే విధంగా సమయం కూడా 23 నిమిషాలు తగ్గింది.
సగటు సమయం గతంలో మాదిరిగానే...
తాజా మార్పులో భాగంగా క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్‌లో ప్రశ్నల సంఖ్య, సెక్షన్ వారీ సమయాన్ని తగ్గించినప్పటికీ.. ప్రశ్నలకు సమాధానాలిచ్చే క్రమంలో సగటు సమయం దాదాపుగా పాత విధానంలోనే ఉందని నిపుణుల అభిప్రాయం. క్వాంటిటేటివ్ రీజనింగ్‌లో ఒక్కో ప్రశ్నకు రెండు నిమిషాలు లభిస్తుందని, అదే విధంగా వెర్బల్ రీజనింగ్‌లో సైతం 108 సెకన్లు ఉందని నిపుణుల అభిప్రాయం.
ప్రశ్నల తగ్గింపు.. అత్యంత ఉపశమనం
క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్ విభాగాల్లో ఎక్స్‌పరిమెంటల్ ప్రశ్నలను తగ్గించడాన్ని అభ్యర్థులకు అత్యంత ఉపశమనంగా పేర్కొనొచ్చు. కారణం.. వీటికి పొందిన మార్కులను జీమ్యాట్ అధికారిక స్కోర్‌లో కలపరు. పాత విధానంలో వీటిని ముందుగానే సమాధానం ఇవ్వాల్సి వచ్చేది. పర్యవసానంగా విద్యార్థులు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి నెలకొనేది. స్కోర్ కార్డ్‌లో కలపని ఈ ఎక్స్‌పరిమెంటల్ ప్రశ్నలను తగ్గించడం పై అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌పరిమెంటల్ ప్రశ్నల సంఖ్య క్వాంటిటేటివ్ రీజనింగ్‌లో తొమ్మిది నుంచి మూడుకు; వెర్బల్ రీజనింగ్‌లో 11 నుంచి ఆరుకు తగ్గడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
మిగతా సెక్షన్లు యథాతథం :
జీమ్యాట్‌లో క్యూఆర్, వీఆర్‌లో మార్పులు చేసినప్పటికీ.. మిగతా రెండు సెక్షన్లు అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్‌ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
ఆన్‌లైన్ ట్యుటోరియల్ :
జీమ్యాట్ కొత్త విధానంలో విద్యార్థులకు ప్రయోజనం కలిగించే మరో నిర్ణయం.. పరీక్ష తేదీ కంటే ముందుగానే విద్యార్థులు ఆన్‌లైన్ ట్యుటోరియల్ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించడం. ఇప్పటివరకు అభ్యర్థులకు టెస్ట్ తేదీన మాత్రమే ఆన్‌లైన్ ట్యుటోరియల్ సదుపాయం ఉండేది. తాజా నిర్ణయంతో అభ్యర్థులు టెస్ట్ తేదీకంటే ముందుగానే ఎంబీఏ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ట్యుటోరియల్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల టెస్ట్ స్వరూపం, సెక్షనల్ నేవిగేషన్ వంటి అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఫలితంగా టెస్ట్ తేదీన కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా టెస్ట్‌ను ముగించే అవకాశం లభిస్తుంది.
మార్పు లేని స్కోరింగ్ విధానం :
క్యూఆర్, వీఆర్ విభాగాల్లో ప్రశ్నలు, సమయం తగ్గించినప్పటికీ.. జీమ్యాట్ స్కోరింగ్ విధానం పరంగా ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరిగానే 800 పాయింట్ల స్కేల్‌తో స్కోర్స్ కేటాయిస్తారు. విద్యార్థులు బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకోవాలంటే 600 నుంచి 650 పాయింట్ల మధ్యలో స్కోర్ సాధించే విధంగా కృషి చేయాలి.
ఏటా అయిదుసార్లు :
జీమ్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ఈ టెస్ట్‌ను ఏడాదిలో గరిష్టంగా అయిదుసార్లు రాసే వీలుంది. ఒకసారి రాసిన టెస్ట్‌లో స్కోర్ తక్కువగా వచ్చిందని భావిస్తే మరోసారి రాసుకునే విధంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రతి టెస్ట్‌కు మధ్య కనీసం 16 రోజుల వ్యవధి తప్పనిసరి.
Published date : 26 Jul 2018 02:40PM