Skip to main content

జెస్ట్-2019

జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్)లో ప్రతిభ చూపడం ద్వారా ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, కంప్యుటేషనల్ బయాలజీ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీల్లో ప్రవేశం పొందొచ్చు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు దేశంలో పేరొందిన దాదాపు 40 పరిశోధనా సంస్థల్లో పరిశోధనల దిశగా అడుగులు వేయొచ్చు. దేశంలోని రీసెర్చ్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్)-2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో జెస్ట్‌తో ప్రయోజనాలు... ప్రవేశాలు కల్పిస్తున్న కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రిపరేషన్ గెడైన్స్...
జెస్ట్‌తో ప్రయోజనాలు...
  • జెస్ట్‌లో అర్హత సాధించడం ద్వారా ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, కంప్యూటేషనల్ బయాలజీ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
  • సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్(ఎస్‌ఈఆర్‌బీ) జెస్ట్‌ను నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌గా గుర్తించింది.
  • ప్రముఖ సంస్థల్లో పీహెచ్‌డీలో అవకాశం లభిస్తే నెలకు రూ.28 వేలు వరకు ఫెలోషిప్‌గా అందుతుంది.
  • పీహెచ్‌డీ పూర్తయ్యాక ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అద్భుత అవకాశాలు అందుకోవచ్చు.
అర్హతలు..
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ పోగ్రామ్‌లకు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ పోగ్రామ్‌లకు ఎంఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ/నాలుగేళ్ల బీఎస్సీ అర్హతలుగా ఉన్నాయి.

ప్రవేశ విధానం :
ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా జెస్ట్‌లో అర్హత సాధించిన వారిని ఆయా కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు పరిశోధనా సంస్థలు సొంత ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇండోర్‌లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ.. ఫిజిక్స్ విభాగానికి సంబంధించి జెస్ట్ స్కోర్ ఆధారంగా జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితాలోని వారికి ఇంటర్వ్యూ నిర్వహించి పీహెచ్‌డీలోకి ప్రవేశాలను ఖరారు చేస్తుంది. మొత్తంమీద రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి సంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

రాత పరీక్ష :
  • ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఫిజిక్స్ లేదా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి జెస్ట్‌కు హాజరుకావొచ్చు.
  • జెస్ట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పార్ట్-ఎలోని 25 ప్రశ్నల్లో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. పార్ట్-బిలోని 25 ప్రశ్నల్లో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
  • థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ప్రశ్నపత్రంలో స్వల్ప సమాధాన ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమస్య సాధన రాయాల్సి ఉంటుంది.

ప్రిపరేషన్..
  • ఫిజిక్స్ సిలబస్‌లో మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ తదితర చాప్టర్లు ఉంటాయి.
  • మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ థియరీ చాప్టర్లు కీలకంగా నిలుస్తాయి.
  • అభ్యర్థులు ప్రాథమిక భావనలపై పట్టుసాధించాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. కొన్ని ప్రశ్నలు అభ్యర్థుల ఊహాశక్తిని పరీక్షించేలా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
  • థియరిటికల్ కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, గ్రాఫ్ థియరీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ పోగ్రామింగ్ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:
నవంబర్ 8, 2018.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2018.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 17, 2019.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళలకు దరఖాస్తు రుసుం లేదు.

కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు-ఆఫర్‌చేస్తున్న కోర్సులు...
  1. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్ (ఏఆర్‌ఐఈఎస్), నైనిటాల్.
    ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్‌లో పీహెచ్‌డీని ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
    www.aries.res.in
  2. బోస్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా.
    అట్మాస్ఫియరిక్ సెన్సైస్, కాంప్లెక్స్ సిస్టమ్స్ అండ్ నెట్‌వర్క్స్ తదితర అంశాల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులనుఆఫర్‌చేస్తోంది.
    వెబ్‌సైట్: www.jcbose.ac.in
  3. హోమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్(హెచ్‌బీఎన్‌ఐ), ముంబై
    పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ(నైసర్) కోర్సులను ఆఫర్‌చేస్తోంది.
    వెబ్‌సైట్: www.hbni.ac.in
  4. హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఆర్‌ఐ), అలహాబాద్.
    థియరిటికల్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్‌లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ పోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది.
    వెబ్‌సైట్: www.hri.res.in
  5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-(ఐఐఏ), బెంగళూరు.
    ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రనామికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆప్టిక్స్ అండ్ అటామిక్ ఫిజిక్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
    వెబ్‌సైట్: www.iiap.res.in
  6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), బెంగళూరు.
    కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ (ఎక్స్‌పెరిమెంట్స్ అండ్ థియరీ), ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (థియరిటికల్) తదితర స్పెషలైజేషన్లను ఆఫర్‌చేస్తోంది.
    వెబ్‌సైట్: www.iisc.ac.in
  • వీటితో పాటు ఐఐఎస్‌ఈఆర్ భోపాల్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం క్యాంపస్‌లు; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (తిరువనంతపురం), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్ (చెన్నై), ఇంధిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్), కల్పకం తదితర సంస్థల్లో ప్రవేశం పొందొచ్చు.
Published date : 06 Nov 2018 03:58PM

Photo Stories