జేఈఈ(మెయిన్)-2021 మీ సందేహాలు- సమాధానాలు ఇవే...
నిట్‌ల్లో ప్రవేశాలతోపాటు ఐఐటీల్లో అడ్మిషన్లకు వీలు కల్పించే అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్ష ఇది. ఏటా నిర్వహించే ఈ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది విద్యార్థులు రాస్తుంటారు. జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలకు సమాధానాలు..
జేఈఈ మెయిన్ 2021 ఎన్నిసార్లు నిర్వహిస్తారు?
ఈ ఏడాది జేఈఈ మెయిన్ నాలుగుసార్లు నిర్వహించను న్నారు. ఫిబ్రవరి /మార్చి/ఏప్రిల్/మే నెలల్లో ఈ పరీక్ష ఉంటుంది.
జేఈఈ మెయిన్ ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించడం వల్ల కలిగే లాభాలేంటి?
- ఎక్కువసార్లు మెయిన్ నిర్వహించడంవల్ల విద్యార్థులకు పలు ప్రయోజనాలు ఉన్నారుు. అవేంటంటే..
- అభ్యర్థులు ఒక ప్రయత్నంలో మంచి స్కోర్ సాధించలేకపోతే.. మరోసారి మెయిన్ ఎగ్జామ్ రాసి స్కోర్ పెంచుకోవచ్చు. మొదటిసారి పరీక్ష రాసినప్పుడు అనుభవం వస్తుంది. ఫలితంగా తొలిసారి చేసిన పొరపాట్లను సరిచేసుకోవచ్చు. రెండోసారి అవగాహనతో పరీక్ష రాసి.. స్కోర్ పెంచుకోవచ్చు.
- ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం ఉన్నందున అకడమిక్ ఇయర్ వృథాకాదు. పైగా ఇంటర్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి కూడా అవకాశం లభిస్తుంది.
- నాలుగు సెషన్లలోనూ పరీక్ష రాస్తే.. ఏ సెషన్‌లో అత్యధిక స్కోరు సాధిస్తారో దాన్నే ఎన్‌టీఏ మెరిట్ లిస్ట్ రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంటుంది.
జేఈఈ(మెయిన్)-2021కు దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటివరకు అవకాశం ఉంది?
ఫిబ్రవరి సెషన్‌లో పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు జనవరి 16, 2021 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజును జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ప్రతి సెషన్ ఫలితాలను ప్రకటించిన మూడు నాలుగు రోజుల్లో మరో సెషన్ అప్లికేషన్ విండో అందుబాటులో ఉంటుంది, అప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్ని సెషన్‌సకు దరఖాస్తు చేసుకోవచ్చు? దరఖాస్తు చేసిన ప్రతిసారి ఫీజు చెల్లించాలా?
- ఆసక్తిని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ని సెషన్లకు హాజరవ్వాలను కుంటున్నారో.. అన్ని సెషన్లకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి సెషన్‌కు అభ్యర్థి ప్రత్యేకంగా దరఖాస్తు ఫారం పూరించాల్సిందేనా?
ప్రతి సెషన్‌కు దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థి నాలుగు సెషన్లకు హాజరైనా.. ఒక్కసారి దరఖాస్తు నింపితే సరిపోతుంది. ఒక సెషన్ తర్వాత మరో సెషన్‌కు హాజరయ్యేటప్పుడు ఆన్‌లైన్‌లో విద్యార్థి గతంలో నింపిన దరఖాస్తు ఓపెన్ అవుతుంది. దాని ప్రకారం తదుపరి సెషన్‌కు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు.
ఒక అభ్యర్థి ఫిబ్రవరి సెషన్‌కు దరఖాస్తు చేయలేకపోతే.. మిగిలిన సెషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చా?
నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మొదటి సెషన్(ఫిబ్రవరి)కు అవకాశం కుదరకపోతే.. మార్చి సెషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక సెషన్ ఫలితాలు ప్రకటించిన మూడు లేదా నాలుగు రోజుల్లో తర్వాత సెషన్ విండో ఓపెన్ అవుతుంది. దానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒక విద్యార్థి ఒక సెషన్‌కు మాత్రమే హాజరవ్వాలా.. లేదా నాలుగు సెషన్లలో పరీక్ష రావచ్చా?
ఇది అభ్యర్థి ఇష్టం. ఒక అభ్యర్థి ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు సెషన్లలోనూ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది.
అభ్యర్థి ఒక సెషన్‌కు లేదా నాలుగు సెషన్లకు ఫీజు చెల్లించాలా, ఎప్పుడు ఫీజు చెల్లించాలి?
దరఖాస్తు ఫారం నింపేటప్పుడు, అభ్యర్థి హాజరు కావాలనుకునే సెషన్ల సంఖ్యను ఎన్నుకోవాలి. దానిప్రకారం ఎన్ని సెషన్లకు హాజరవ్వాలనుకుంటే.. అన్నిసార్లుకు ఫీజు చెల్లించాలి. ఒకేసారి అన్ని సెషన్లకు ఫీజు చెల్లించొచ్చు.
ఒకవేళ అభ్యర్థి ఓ సెషన్‌కు ఫీజు చెల్లించి, ఆ సెషన్ పరీక్ష రాయకూడదనుకుంటే.. చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చేస్తారా?
అవును, ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సెషన్‌లో పరీక్ష రాయకూడదని నిర్ణయించుకుంటే లేదా ఇప్పటికే ఫీజు చెల్లించిన సెషన్ నుంచి వైదొలగాలని కోరుకుంటే.. ఆ సెషన్‌కు చెల్లించిన ఫీజును ఎన్‌టీఏ తిరిగి ఇస్తుంది. అందుకోసం సదరు అభ్యర్థి ఉపసంహరించు కోవాలనుకుంటున్న సెషన్ దరఖాస్తు ప్రక్రియలో మరోసారి ఆన్‌లైన్‌లోనే అభ్యర్థన నింపాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ పరీక్ష ఫీజును ఎలా చెల్లించాలి?
జేఈఈ మెయిన్ ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ లేదా పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.
అన్ని సెషన్‌సకు ఒకే కన్ఫర్మేషన్ పేజీ ఉంటుందా?
అవును, ఒకసారి దరఖాస్తు చేసుకుంటే..అన్ని సెషన్‌సకు ఒకే కన్ఫర్మేషన్ పేజీ ఉంటుంది.
మెరిట్ జాబితా లేదా ర్యాంకింగ్‌లో ఏ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు?
అభ్యర్థికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెషన్లలో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకుంటే.. ప్రతి సెషన్‌లో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఎన్‌టీఏ స్కోరు ఇస్తుంది. విద్యార్థి పరీక్ష రాసిన నాలుగు సెషన్‌సలో అత్యుత్తమ స్కోరును మాత్రమే మెరిట్/ర్యాంకింగ్ కోసం తీసుకుంటారు.
ఆన్‌లైన్ దరఖాస్తులో పొరపాట్లను సరిచేసుకునేందుకు, పరీక్ష సెంటర్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుందా?
నోటిఫికేషన్‌లో ముందే చెప్పినట్లు కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు.. నిర్దేశిత తేదీలోగా దరఖాస్తులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాన్ని కూడా ఆ తేదీలోగా మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
జేఈఈ(మెయిన్) సిలబస్‌ను ఈ ఏడాది (2021) మార్చారా?
మార్చలేదు, గతేడాది సిలబస్ ప్రకారమే పరీక్ష జరుగుతుంది. కాని దేశమంతా వివిధ బోర్డులు తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రశ్నపత్రంలో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయని.. అభ్యర్థి 75 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుందని ఎన్‌టీఏ ప్రకటించింది. ఆ 15 ఐచ్ఛిక ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు.
జేఈఈ(మెయిన్)-2021 ఎన్ని భాషల్లో నిర్వహిస్తారు?
మెయిన్ పరీక్ష హిందీ,ఇంగ్లిష్‌తోపాటు పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోను నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది?
ఈ ఏడాది మెయిన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. బీఆర్క్ డ్రాయింగ్ టెస్ట్ మాత్రం పెన్ అండ్ పేపర్ విధానంలో ఉంటుంది.
జేఈఈ మెయిన్ ఏయే తేదీల్లో నిర్వహిస్తారు?
మొత్తం నాలుగు సెషన్‌సలో జరిగే 2021 మెయిన్‌కు వేర్వేరు తేదీలు కేటారుుంచారు.
సెషన్-1: ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో
సెషన్-2: మార్చి 15, 16, 17, 18 తేదీల్లో
సెషన్-3: ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో
సెషన్-4: మే 24, 25, 26, 27, 28 తేదీల్లో పరీక్ష జరుగుతుంది.
పేపర్ 2ఏ,2బీలోని సెక్షన్-బీలో రాయాల్సిన ఐదు ప్రశ్నలను అభ్యర్థి ఎంచుకునే అవకాశం ఉందా?
ఇచ్చిన 10 ప్రశ్నల్లో అభ్యర్థి ఏవైనా ఐదు ప్రశ్నలను ఎంచుకుని జవాబులు రాయవచ్చు. పేపర్ సబ్మిట్(తుది సమర్పణ)కు ముందు ఎంచుకున్న ప్రశ్నలకు సమాధానాలను మార్చుకునే అవకాశం, మొత్తం ప్రశ్నలను కూడా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థి ఇంతకుముందు ఎంచుకున్న ప్రశ్నలకు భిన్నమైన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. మొత్తంమ్మీద సెక్షన్-బీలోని ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి.
పేపర్-1(బీటెక్), పేపర్-2ఏ(బీఆర్క్), పేపర్-2బీ (బీప్లానింగ్) ఏ సెషన్‌లో నిర్వహిస్తారు?
జేఈఈ(మెయిన్) 2021లో పేపర్ 1(బీటెక్) ఫిబ్రవరితోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలలో జరిగే సెషన్లలో ఉంటుంది. కానీ, పేపర్-2ఏ(బీఆర్క్), పేపర్-2బీ (బీ-ప్లానింగ్) సంవత్సరా నికి రెండుసార్లు(ఫిబ్రవరి, మే) మాత్రమే జరుగుతుంది.
బీ-ఆర్క్, బీ-ప్లానింగ్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులకు పరీక్ష వ్యవధి ఎంత ఉంటుంది?
పేపర్-2ఏతోపాటు పేపర్-2బీకి హాజరు కావాలనుకునే అభ్యర్థుల పరీక్షా వ్యవధి 3.30 గంటలు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు సమయం ఉంటుంది.
దివ్యాంగులకు ఎన్‌టీఏ ఏమైనా మినహారుుంపులు ఇస్తుందా?
అభ్యర్థి శారీరకంగా కదలలేని వైకల్యం ఉన్నప్పుడు వారి తరఫున పరీక్ష రాసేందుకు స్క్రైబ్‌కు అనుమతిస్తారు. ఇలాంటి వారు సివిల్ సర్జన్/మెడికల్ సూపరింటెండెంట్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. దీంతోపాటు కోవిడ్-19 పరీక్షలు చేరుుంచుకున్న అభ్యర్థిని స్క్రైబ్‌గా తీసురావచ్చు. ూదివ్యాంగులకు అదనంగా గంట సమయం ఇస్తారు.
జేఈఈ(మెయిన్) 2021లో బీటెక్/బీఆర్క్ స్కోరు యూపీఎస్‌ఈఈ-2021/ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ-లక్నోలో ప్రవేశానికి ఉపయోగపడతాయా?
2021 జేఈఈ మెయిన్‌లో సాధించిన స్కోరు ఆధారంగా యూపీఎస్‌ఈఈ- 2021/డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ-లక్నోలో ప్రవేశం పొందొచ్చు.
జేఈఈ (మెయిన్)కు హాజరయ్యేందుకు వయోపరిమితి ఎంత ఉండాలి?
ఈ పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. 2019, 2020లో ఇంటర్/10+2 పరీక్ష పాసైనవారు, అలాగే 2021లో ఇంటర్ ఫైనల్ పరీక్షలకు హాజరయ్యేవారు వయసుతో సంబంధం లేకుండా జేఈఈ(మెయిన్) 2021 రాయవచ్చు.
ఆన్‌లైన్‌లో జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థులు జనరల్ ఈడబ్ల్యూఎస్, -ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(ఎన్‌సీఎల్), పీడబ్ల్యూడీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలా?
తప్పనిసరిగా చేయాలి. వారివారి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జారీ చేసిన నిర్దేశిత ఫార్మాట్ల ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ, ఆయా సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించవచ్చు.
జేఈఈ (మెయిన్) పరీక్షా విధానం, పరీక్షల సరళి ఎలా ఉంటుంది?
- ప్రశ్నపత్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. పేపర్-1లో 90 ప్రశ్నలు ఉంటారుు. అభ్యర్థి 75 ప్రశ్నలకు మాత్రమే రాయాలి. 15 ఐచ్ఛిక ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు. పేపర్ వారీగా పరిశీలిస్తే..
- బీఈ/బీటెక్(పేపర్-1 నాలుగు సెషన్‌సలో ఉంటుంది): ప్రతి సబ్జెక్టు రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్-ఏలో అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్‌లో ఉంటాయి, సెక్షన్-బిలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఏవైనా ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, ఈ విభాగంలో నెగిటివ్ మార్కులు ఉండవు.
- బీఆర్క్(పేపర్ 2ఏ)-ఫిబ్రవరి,మే సెషన్లలో ఉంటుంది. పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటారుు. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛారుుస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు రాయాలి. వీటికి నెగిటివ్ మార్కులు ఉండవు.
- బీ-ప్లానింగ్(పేపర్ 2బీ) ఫిబ్రవరి, మే సెషన్లలో ఉంటుంది. ఇందులోని పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటారుు. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో 10 ప్రశ్నలు ఉంటారుు. వాటిలో ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, వీటికీ నెగిటివ్ మార్కులు ఉండవు.