Skip to main content

జేఈఈ-మెయిన్ నాలుగు సార్లు.. అడ్వాన్స్‌డ్ మాత్రం ఒకసారే!

ఈ ఏడాది జేఈఈ-మెయిన్‌ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు నిర్వహించనున్నారు. కాని అడ్వాన్స్‌డ్‌ను మాత్రం ఒకసారే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ సిలబస్‌లను బేరీజు వేసుకుంటూ..

ఉమ్మడి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత జేఈఈ-మెయిన్ తుదిదశ(మే నెల సెషన్) ముగిశాక.. అప్పటినుంచి జూలై 3న జరిగే అడ్వాన్స్‌డ్ పరీక్షకు పూర్తి సమయం కేటాయించాలంటున్నారు. అప్పటి వరకు అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో తాము చదవని అంశాలకు సంబంధించి బేసిక్స్, ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు తెలుసుకోవడానికి కృషి చేయాలి. ప్రస్తుతం అకడమిక్‌గా ఇంటర్, ఇతర బోర్డ్‌ల పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. అధిక శాతం మంది అభ్యర్థులు ఫిబ్రవరి, మే సెషన్‌లలోనే జేఈఈ-మెయిన్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. వీటిల్లో ఉత్తీర్ణత ఆధారంగా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకుటారు. ఇలాంటి పరిస్థితిలో అభ్యర్థులు ఇప్పటి నుంచే జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ సిలబస్‌లను కంపేరిటివ్ అప్రోచ్‌తో సాధన చేయడం మేలు చేస్తుంది.

సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ వ్యూహాలు..
మ్యాథమెటిక్స్..
కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్. 3-డి జామెట్రీ; కోఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్; బైనామియల్ థీరమ్; లోకస్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.

కెమిస్ట్రీ..
కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.

ఫిజిక్స్..
ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే..మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

ఇంకా చదవండి: part 6: వీటిపై దృష్టి పెడితేనే.. జేఈఈ- అడ్వాన్స్‌డ్ సాధించడం సులువు!

Published date : 18 Jan 2021 03:00PM

Photo Stories