Skip to main content

జేఈఈ మెయిన్-2021 విజయానికి ఎగ్జామ్ డే టిప్స్...

ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు మార్గం.. జేఈఈ మెయిన్. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి సెషన్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనుంది. తొలిసారి తెలుగుతోసహా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ మెయిన్‌లో విజయానికి ఎగ్జామ్ డే టిప్స్...

రెండు షిప్ట్‌ల్లో పరీక్ష :
జేఈఈ మెయిన్ పరీక్షకు అభ్యర్థులు ఇప్పటికే సర్వసన్నద్ధులై ఉంటారు. మరో 24 గంటల్లో పరీక్ష జరుగనుంది. పరీక్షను రెండు షిప్టులుగా నిర్వహిస్తారు. మొదటి షిప్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; రెండో షిప్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది.

ఒత్తిడిని జయిస్తూ...

  1. పరీక్షకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఒత్తిడికి గురికావడం సహజం. విద్యార్థులు ఆందోళనను, ఒత్తిడిని అధిగమిస్తూ వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి.
  2. పరీక్షా సమయం దగ్గర పడుతుందనే ఆందోళనను వదిలేసి.. లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రశాంతంగా ముఖ్యమైన అంశాల రివిజన్‌పై దృష్టిపెట్టాలి.
  3. ఎక్కువ గంటలు ప్రిపరేషన్ కొనసాగించే ఆత్రు తలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రోజులాగే మితాహారం, వాకింగ్, తేలికపాటి వ్యాయా మాలు చేయాలి. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
  4. కొవిడ్-19 కారణంగా పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు ముందురోజు మీరు ప్రాక్టీస్ చేసే మాక్ టెస్టులకు 3 గంటల పాటు మాస్క్ పెట్టుకొని రాయండి. అలాగే అలాగే పరీక్ష హాల్లో పాటించాల్సిన కొవిడ్ మార్గదర్శకాలను, నిబంధనలను గురించి ముందే తెలుసుకోవాలి.
  5. ఇది వరకు మీరు రోజు ఎలా మేల్కొన్నా కూడా పరీక్షకు ముందు రోజు టైమ్ ప్రకారం నిద్రలేచేలా ఒక సమయాన్ని పెట్టుకోండి. ఇది పరీక్షా రోజు సమయానికి నిద్రలేచేలా దోహదం చేస్తుంది. అలాగే పరీక్షకు ఒక రోజు ముందు బాగా నిద్రపోవాలి. ప్రశాంతంగా ఉండటం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.
  6. {పస్తుత విలువైన సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించడం..స్నేహి తులతో చాటింగ్ ఇప్పుడున్న సమయంలో సరికాదు.
  7. సబ్జెక్టు విషయానికి వస్తే ముఖ్యంగా జేఈఈ సిలబస్ ప్రకారం ఫిజిక్స్,కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లోని అన్ని ముఖ్యమైన ఫార్ములాలు/ కాన్సెప్ట్‌లను ఒకటికి రెండుసార్లు రివైజ్ చేసుకోవాలి.
  8. మీ ఎగ్జామ్ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్ణిత సమ యంలో పరీక్ష పూర్తిచేసేలా.. మాక్ టెస్టులను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల తొందరపాటు లేకుండా పరీక్ష రాసేలా మానసికంగా సిద్ధమవ్వొచ్చు.
  9. పరీక్షా రాసే ముందు రోజు వీలైతే పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో చూసి రావడం మేలు చేస్తుంది. ఎందుకంటే.. మీరు ఉండే ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంచనాకు రావచ్చు. ఫలితంగా నిర్ణీత సమయంలోపు పరీక్షా కేంద్రానికి చేరుకునే వీలుంటుంది.
  10. పరీక్ష ముందు రోజు రివిజన్ మాత్రమే చేయాలి. అదికూడా ముఖ్యమైన టాపిక్స్, ముఖ్యమైన ఫార్ములాలు వంటివి. ఇప్పటి వరకూ రాసి పెట్టుకొన్న సొంత నోట్స్‌ను రివైజ్ చేసుకోవడం మేలు చేస్తుంది.
  11. అడ్మిట్ కార్డ్ సిద్ధంగా ఉంచుకోవాలి. పరీక్ష నిబంధనలపై అవగాహనతో ఉండాలి.
  12. పరీక్షకు 24 గంటల ముందునుంచి కామ్‌గా, కూల్‌గా, ప్రశాంతగా, పాజిటివ్‌గా ఉండాలి.
  13. పరీక్ష రాయడానికి ముందే ఫలితం గురించి అస్సలు ఆలోచించ కూడదు.
  14. పరీక్ష ప్రారంభించడానికి ముందు ఒకసారి స్క్రోల్ చేసి అన్ని ప్రశ్నలను చూసుకోండి.
  15. తొలుత బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మంచిది.
  16. పరీక్ష హాల్లో వేగం, కచ్చితత్వం చాలా ముఖ్యం. వీలైనన్ని ఎక్కువ సరైన సమాధానాలు గుర్తించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు ముందురోజు పరీక్షా వేగాన్ని పెంచుకోవడానికి మీ సొంత వ్యూహాన్ని ఆలోచించి పెట్టుకోవాలి.
  17. మీరు పరీక్ష రాసే వేగాన్ని పెంచుకోవడానికి వీలు గా.. పరీక్షలో సమాధానాలు తెలియని ప్రశ్నల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం మానుకోవాలి.
  18. తెలియని ప్రశ్నలతో పరీక్షను మొదలు పెడితే ఆత్మవిశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏదైనా ఒక సెక్షన్‌లో సరిగ్గా రాణించలేకపోతే ఆందోళన చెందకండి. మరొక సెక్షన్‌లో మీరు దానిని భర్తీ చేసుకోగలననే ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
  19. పరీక్షను కనీసం రెండు రౌండ్లలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోండి.
  20. సాధ్యమైనంత వరకూ గెస్‌వర్క్‌కు దూరంగా ఉండటం మేలు.
  21. ఏదైనా ఒక ప్రశ్నకు ఎక్కువ సమయం కేటాయి స్తున్నారా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుం టూ ఉండాలి.
  22. ఏదైనా ప్రశ్న క్లిష్టంగా అనిపిస్తే దాని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందకండి.
  23. న్యూమరికల్ టైప్ ప్రశ్నలు అన్నింటినీ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే.. వీటికి నెగిటివ్ మార్కుల విధానం లేదు.



పరీక్షలో నిర్ణయాత్మకం :

  1. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబం ధించిన ముఖ్యమైన టాపిక్స్‌పై గట్టి పట్టుసాధించాలి. ఎ గత జేఈఈ మెయిన్‌లో అడిగిన ప్రశ్నల స్థాయిలో మోడల్ కొశ్చన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  2. వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు రాబట్టే నైపుణ్య మంచి ర్యాంకు సాధనలో దోహదపడుతుంది.
  3. టైమ్ మేనేజ్‌మెంట్‌తోపాటు వ్యూహాత్మక ప్రిపరేషన్, ప్రశాంతంగా పరీక్ష రాయడం కూడా విజయ సాధనలో కీలకంగా నిలుస్తుందని గుర్తించాలి.

వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in

ముఖ్యమైన టాపిక్స్...
మ్యాథమెటిక్స్‌లో: కోఆర్టినేట్ జామెట్రి-సర్కిల్, పారాబోలా, హైపర్‌బోలా, ఆల్‌జీబ్రా- క్వాడ్రాటిక్, ఈక్వేషన్ అండ్ ఎక్స్‌ప్రేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రొబబిలిటీ, వెక్టర్స్ అండ్ మ్యాట్రిక్స్, క్యాల్‌కులస్ వంటి టాపిక్స్‌ను తప్పనిసరిగా రివైజ్ చేసుకోవాలి.
ఫిజిక్స్‌లో: కైనమాటిక్స్, గ్రావిటేషన్, ఫ్లూయిడ్స్, హిట్ అండ్ థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్, కెపాసిటర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఇండక్షన్,ఆప్టిక్స్- మెడర్న్ ఫిజిక్స్ తదితర టాపిక్స్‌ను ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి.
కెమిస్ట్రీలో: ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ-కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, పిబ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఫిజికల్ కెమిస్ట్రీ-ఎలక్ట్రోకెమిస్ట్రీ, డైల్యూట్ సొల్యూషన్, కెమికల్-ఆయానిక్ ఈక్విలిబ్రియం, ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఆల్డిహైడ్స్-కీటోక్స్, అమైన్స్, ఆల్కైల్ హాలిడ్స్-బయోమాలిక్యూల్ వంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి.

Published date : 22 Feb 2021 02:35PM

Photo Stories