Skip to main content

జేఈఈ-మెయిన్-2021 పరీక్ష స్వరూపం ఇలా..

బీఈ/బీటెక్ కోసం జరిగే జేఈఈ మెయిన్ కంప్యూట్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో మూడు సబ్జెక్టులు.. ప్రతి సబ్జెక్టుపై రెండు సెక్షన్లలో నిర్వహిస్తారు. ఆ వివరాలు..

సబ్జెక్ట్ సెక్షన్-ఎ సెక్షన్-బి
{పశ్నల సంఖ్య {పశ్నల సంఖ్య మార్కులు
మ్యాథమెటిక్స్ 20 10 100
ఫిజిక్స్ 20 10 100
కెమిస్ట్రీ 20 10 100
మొత్తం 90 ప్రశ్నలు 300

  1. సెక్షన్-ఎలో బహుళైచ్ఛిక ప్రశ్నలే అడుగుతారు.
  2. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు అడుతారు.
  3. సెక్షన్-బిలో అభ్యర్థులు 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్ లభిస్తుంది. ఠ సెక్షన్-ఎలో 0.25 శాతం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. సెక్షన్ బీలో నెగిటివ్ మార్కులు ఉండవు.


బీఆర్క్ పరీక్ష స్వరూపం..
ఇది పేపర్ 2ఏ.. ఇందులో మ్యాథమెటిక్స్(పార్ట్-1), అప్టిట్యూడ్ టెస్ట్(పార్ట్-2) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో.. డ్రాయింగ్ టెస్ట్(పార్ట్-3) పెన్-పేపర్ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షనకు మూడు విభాగాలు నిర్వహిస్తారు. వివరాలు..

సబ్జెక్ట్

ఎంసీక్యూలు

న్యూమరికల్ ప్రశ్నలు

మార్కులు

మ్యాథమెటిక్స్(పార్ట్-1) 20 10 100
ఆప్టిట్యూడ్ టెస్ట్(పార్ట్-2) 50 - 200
డ్రాయింగ్ టెస్ట్(పార్ట్-3) 02 - 100
మొత్తం ప్రశ్నలు ---82--- 400

  1. మ్యాథమెటిక్స్‌లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు అదే విభా గంలో న్యూమరికల్ ప్రశ్నలలో 5 ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.
  2. డాయింగ్ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.


బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష స్వరూపం..
ఇందులో మ్యాథమెటిక్స్(పార్ట్-1), అప్టిట్యూడ్ టెస్ట్(పార్ట్-2), ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నలు(పార్ట్-3) అన్నీ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతాయి.

సబ్జెక్ట్ {పశ్నల న్యూమరికల్ మార్కులు
సంఖ్య {పశ్నల సంఖ్య
మ్యాథమెటిక్స్ 20 10 100
ఆప్టిట్యూడ్ టెస్ట్ 50 - 200
ప్లానింగ్ ఆధారిత ప్రశ్నలు 25 - 100
మొత్తం ప్రశ్నల సంఖ్య: 105 ప్రశ్నలు మార్కులు 400


ఫిబ్రవరి సెషన్ సమాచారం..

  1. అర్హత: 2019, 2020లో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. 2021లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా అర్హులే.
  2. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: డిసెంబర్ 16, 2020 నుంచి జనవరి 16, 2021 వరకూ
  3. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 17, 2021
  4. దరఖాస్తుల సవరణ అవకాశం: జనవరి 19, 2021 నుంచి జనవరి 21, 2021 వరకూ
  5. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: ఫిబ్రవరి రెండో వారం
  6. పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 23, 24, 25, 26
  7. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
  8. ఆంధ్రప్రదేశ్: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం.
  9. తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట
  10. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in


ఇంకా తెలుసుకోండి: part 5: జేఈఈ-మెయిన్-2021 జేఈఈకి సన్నద్ధత ఇలా ఉంటే.. విజయం తథ్యం..

Published date : 28 Dec 2020 03:08PM

Photo Stories