జాతీయ స్థాయి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఎంట్రన్స్ కోసం క్లాట్.. వివరాలు తెలుసుకోండిలా..
అలాగే రాష్ట స్థాయి విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అడ్మిషన్ కోరుకుంటే.. లాసెట్‌ను లక్ష్యంగా ఎంచుకోవాలి. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశించాలనుకుంటే.. ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్టుకు హాజరవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో.. లా కోర్సుల ఔత్సాహికులకు ఉపయోగపడేలా టాప్ లా ఎంట్రన్స్ టెస్టులు, ప్రవేశాలు కల్పిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రవేశ విధానాలపై ప్రత్యేక కథనం...
క్లాట్..
కామన్ లా అడ్మిషన్ టెస్ట్... క్లుప్తంగా క్లాట్! దేశంలోని లా ఎంట్రన్స్‌ల్లో కెల్లా అత్యంత క్రేజీ పరీక్ష. దీన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు కన్సార్షియంగా ఏర్పడి నిర్వహిస్తున్నాయి. క్లాట్-యూజీ ద్వారా దేశంలోని 22 నేషనల్ లా విశ్వవిద్యాలయాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా; క్లాట్-పీజీ ద్వారా ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే క్లాట్ స్కోరును దేశంలోని 70కిపైగా లా ఇన్‌స్టిట్యూట్‌లు పరిగణలోకి తీసుకుంటున్నాయి.
క్లాట్-యూజీ..
క్లాట్ యూజీ పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రంలో 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూలు) అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి పావువంతు మార్కు కోత పడుతుంది. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ విభాగాలు ఉంటాయి. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లాట్-పీజీ..
ఈ ప్రవేశ పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో 100 ఎంసీక్యూలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కు కోత పడుతుంది. రెండో సెక్షన్‌లో అభ్యర్థులు రెండు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూట్స్..
- నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు
- నల్సార్ హైదరాబాద్
- నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్
- వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సెన్సైస్, కోల్‌కతా
- నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్
- హిదాయుతుల్లా లా యూనివర్సిటీ, ఛత్తీస్‌గడ్
- గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ
- డా.రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, లక్నో
- రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పాటియాల
- చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పట్నా
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్, కోచి
- నేషనల్ లా యూనివర్సిటీ ఒడిషా
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంఛీ
- నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిషియల్ అకాడెమీ, అస్సాం
- దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం
- తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ, తిరుచిరాపల్లి
- మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, ముంబై
- నేషనల్ లా యూనివర్సిటీ, నాగ్‌పూర్
- మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, ఔరంగాబాద్
- హిమాచల్ ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ, సిమ్లా
- ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, జబల్‌పూర్
- డా.బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీ, సోనెపట్.
- క్లాట్-2021 ముఖ్య సమాచారం..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 31
- క్లాట్ నిర్వహణ తేదీ: జూన్ 13
- పరీక్ష విధానం: ఆఫ్‌లైన్(పెన్ పేపర్ విధానం) లో పరీక్ష నిర్వహిస్తారు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/
ఇంకా చదవండి: part 2: క్లాట్ ఎంట్రన్స్ మిస్ అయినవారికి.. మరో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఏఐఎల్‌ఈటీ..