జామ్ 2021 పరీక్ష ప్రిపరేషన్ సాగించండిలా...
ఇప్పటికే చాలా మంది ప్రణాళిక ప్రకారం తమ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.
- పరీక్షకు చాలా తక్కువ సమయం మిగిలి ఉన్నందున ఇప్పటికి వరకు ప్రిపేర్ అయిన టాపిక్స్‌ను మరోసారి రివైజ్ చేసుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
- ఇప్పుడున్న సమయంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొత్త టాపిక్స్ జోలికి పోకుండా.. ఇప్పటివరకు అధ్యయనం చేసిన సొంత నోట్స్‌లోని టాపిక్స్‌ను చూసుకోవాలి.
పాత పేపర్లు- ప్రాక్టీస్
- గత సంవత్సరాలకు సంబంధించిన పాత క్వశ్చన్ పేపర్లును ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసంతోపాటు వేగం పెరిగి.. పరీక్షలో సమయంలోపే అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలుగుతారు.
- పతీ ఏటా చాలా మంది విద్యార్థులు సమయాభావం కారణంగా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. అందుకే గత క్వశ్చన్ పేపర్లను, మోడల్ పేపర్ల సాధనపై ఎక్కువగా దృష్టిపెట్టడం పరీక్షలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మాక్ టెస్టులు..
జామ్ పరీక్షకు సంబంధించి ప్రిపరేషన్ స్థాయిని, స్కోర్‌ను అంచనా వేసుకోవడానికి మాక్ టెస్టులు ఉపయుక్తంగా ఉంటాయి. ఆన్‌లైన్ వేదికగా చాలా రకాల జామ్ మాక్ టెస్టులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీలైనంత ఎక్కువగా వాటిని ఉపయోగించుకొని బలహీనంగా ఉన్న టాపిక్స్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి.
రిపీట్ కొశ్చన్స్‌పై దృష్టి..
ఐఐటీ జామ్ పరీక్షల్లో కొత్త ప్రశ్నలతోపాటు పరిమిత సంఖ్యలో తరుచుగా అడిగే ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే.. ప్రతీ ఏటా కొన్ని ప్రశ్నలు రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష పరంగా సమాధానాలు ఇవ్వడంలో ప్రయోజనం పొందొచ్చు.
ముఖ్యమైన సమాచారం..
- పరీక్ష తేది: ఫిబ్రవరి 14(ఆదివారం), 2021
- పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు బయోటెక్నాలజీ (బీటీ), మ్యాథమెటికల్ సెన్సైస్ (ఎంఎస్), ఫిజిక్స్ (పీఎస్); మధ్యాహ్నం 3గంటల నుంచి 6గంటల వరకు కెమిస్ట్రీ(సీవై), ఎకనామిక్స్ (ఈఎన్), జియాలజీ (జీజీ), మ్యాథమెటిక్స్ (ఎంఏ) పేపర్లు ఉంటాయి.
- ఫలితాల వెల్లడి : మార్చి 20, 2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jam.iisc.ac.in
ఇంకా చదవండి: part 1: ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా జామ్ 2021 పరీక్ష.. ఐఐఎస్సీ బెంగళూరుతోపాటు ఐఐటీల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీకి..