జామ్-2019 విజయానికి వ్యూహాలు..
Sakshi Education
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జేఏఎం-జామ్).. దేశంలోని
ప్రతిష్టాత్మక ఐఐటీల్లో రెండేళ్ల ఎంఎస్సీ, జాయింట్ఎంఎస్సీ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్సీ-ఎంఎస్ (రీసెర్చ్)/పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీతోపాటు ఇతర పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే పరీక్ష. జామ్ స్కోర్‌తో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐఎస్‌ఈఆర్‌లు, నిట్‌లు, ఐఐఈఎస్‌టీ షిబ్‌పూర్, ఎస్‌ఎఎల్‌ఐఈటీ పంజాబ్‌లోనూ ప్రవేశం పొందొచ్చు. జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష జామ్ 2019ను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించనుంది. జామ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా జరగనుంది. జామ్-2019 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కోర్సులు, వాటిని అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్స్,
అర్హతలు, ప్రవేశ పరీక్ష, ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం...
ఇన్‌స్టిట్యూట్లు- కోర్సులు:
ఐఐఎస్సీ బెంగళూరు:
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్).
ఐఐటీ భువనేశ్వర్:
జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అట్మాస్పియర్ అండ్ ఓసెన్ సెన్సైస్).
ఐఐటీ బాంబే:
ఐఐటీ ఢిల్లీ:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ ధన్‌బాద్ (ఐఎస్‌ఎం):
ఐఐటీ గాంధీనగర్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ గువహటి:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్).
ఐఐటీ హైదరాబాద్ :
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్).
ఐఐటీ ఇండోర్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, ఆస్ట్రానమీ). ఈ కోర్సులో చేరిన విద్యార్థులు రెండో సెమిస్టర్‌లో ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు మారే అవకాశముంది. ఇందుకు ఆయా విద్యార్థులు సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, గేట్ తదితర పరీక్షల్లో అర్హత సాధించిన వారినే పరిగణనలోకి తీసుకుంటారు.
ఐఐటీ జోధ్‌పూర్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ కాన్పూర్:
ఐఐటీ ఖరగ్‌పూర్:
జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ మద్రాస్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ పాట్నా:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ రూర్కీ:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (అప్లయిడ్ జియాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ రోపార్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ వారణాసి:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, ఫిజిక్స్).
ఐఐటీ భిలాయ్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్) .
ఐఐటీ పాలక్కాడ్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ)(కెమిస్ట్రీ, ఫిజిక్స్).
అర్హతలు..
ప్రవేశ పరీక్ష విధానం:
ఎగ్జామ్ టిప్స్...
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 1, 2018.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2018.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జనవరి 4, 2019.
మాక్ టెస్టుల లింక్ అందుబాటు: జనవరి 10, 2019.
జామ్ 2019 పరీక్ష: ఫిబ్రవరి 10, 2019.
ఫలితాల వెల్లడి: మార్చి 20, 2019.
జామ్ 2019 వెబ్‌సైట్: https://jam.iitkgp.ac.in

- రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
- ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్).
ఐఐటీ ఢిల్లీ:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ ధన్‌బాద్ (ఐఎస్‌ఎం):
- రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్).
- మూడేళ్ల మాస్టర్ ఇన్ సైన్స్ (ఎంఎస్సీ టెక్) (అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్).
ఐఐటీ గాంధీనగర్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ గువహటి:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్).
ఐఐటీ హైదరాబాద్ :
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్).
ఐఐటీ ఇండోర్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, ఆస్ట్రానమీ). ఈ కోర్సులో చేరిన విద్యార్థులు రెండో సెమిస్టర్‌లో ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు మారే అవకాశముంది. ఇందుకు ఆయా విద్యార్థులు సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, గేట్ తదితర పరీక్షల్లో అర్హత సాధించిన వారినే పరిగణనలోకి తీసుకుంటారు.
ఐఐటీ జోధ్‌పూర్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ కాన్పూర్:
- రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్).
- ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయ ల్ డిగ్రీ ప్రోగామ్స్ ఇన్ ఫిజిక్స్.
ఐఐటీ ఖరగ్‌పూర్:
జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ మద్రాస్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ పాట్నా:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ రూర్కీ:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (అప్లయిడ్ జియాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ రోపార్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్).
ఐఐటీ వారణాసి:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) (కెమిస్ట్రీ, ఫిజిక్స్).
ఐఐటీ భిలాయ్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్) .
ఐఐటీ పాలక్కాడ్:
రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ)(కెమిస్ట్రీ, ఫిజిక్స్).
అర్హతలు..
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- మొత్తం ఏడు సబ్జెక్టులకు జామ్ పరీక్ష జరుగుతుంది. అవి.. బయలాజికల్ సెన్సైస్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటి కల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్.
- ప్రతి అభ్యర్థి ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరుకావచ్చు.
- బయోటెక్నాలజీ పేపర్ రాసేందుకు ఏదైనా సైన్స్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అర్హులు.
- మూడేళ్ల డిగ్రీ కోర్సులో బయాలజీ చదివిన విద్యార్థులు బయలాజికల్ సైన్స్ పేపర్ రాయొచ్చు.
- కెమిస్ట్రీ పేపర్ రాసేందుకు డిగ్రీ స్థాయిలో మూడేళ్లపాటు కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదవాలి.
- మ్యాథమెటిక్స్ పేపర్ రాసేందుకు బీఎస్సీలో మ్యాథమెటిక్స్; ఫిజిక్స్ పేపర్ రాసేందుకు బీఎస్సీలో ఫిజిక్స్ చదవడం తప్పనిసరి.
- మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ పేపర్ రాసేందుకు డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ కనీసం రెండేళ్లు చదివుండాలి.
- జియాలజీ పేపర్‌కు హాజరయ్యేందుకు డిగ్రీ స్థాయిలో మూడేళ్లు జియాలజీ ఒక సబ్జెక్టుగా చదవాలి.
ప్రవేశ పరీక్ష విధానం:
- జామ్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 60 ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
- ప్రశ్నపత్రాన్ని ఏ, బీ, సీ అనే మూడు సెక్షన్లుగా విభజిస్తారు. మూడు సెక్షన్‌లు తప్పనిసరిగా రాయాలి. ప్రతి సెక్షన్‌లో భిన్నమైన ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్ ఏ: ఇందులో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ) ఉంటాయి. వీటిలో పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు; అలాగే మరో 20 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించారు. అంటే ఈ సెక్షన్‌లో 30 ప్రశ్నలు మొత్తం 50 మార్కులకు ఉంటాయి.
సెక్షన్ బీ: ఇందులో మొత్తం 10 మల్టిపుల్ సెలెక్ట్ కొశ్చన్స్ (ఎంఎస్‌క్యూ)లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించారు. ఇందులో ప్రశ్న కింద ఇచ్చిన 4 ఆప్షన్లలో ఒకటి కంటె ఎక్కువ సరైన సమాధానాలు ఉండే అవకాశముంది.
సెక్షన్ సీ: ఇందులో 20 న్యూమరికల్ ఆన్షర్ టైప్ (ఎన్‌ఏటీ) ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఎలాంటి ఆప్షన్స్ ఉండవు. కీ బోర్డ్ ద్వారా సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో పది ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు చొప్పున; మరో 10 పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ఒక మార్కు ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు; అలాగే 2 మార్కుల ప్రశ్నల్లో 2/3 మార్కు కోత ఉంటుంది. సెక్షన్ బీలోని ఎంఎస్‌క్యూలకు, అలాగే సెక్షన్ సీలోని ఎన్‌ఏటీ ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఎగ్జామ్ టిప్స్...
- జామ్‌లో ప్రతిభ చూపడం ద్వారా ఉత్తమ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య దిశగా అడుగులు వేయొచ్చనే ఆలోచనతో ప్రేరణ పొందుతూ ప్రిపరేషన్ సాగించాలి.
- పరీక్షకు ఇంకా దాదాపు 5నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్న విద్యార్థులు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి.
- ఇప్పటి నుంచే రోజూ కొంత సమయం జామ్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
- జామ్ సిలబస్, గత ప్రశ్నపత్రాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా ప్రిపరేషన్ పరంగా ఒక అంచనాకు రావచ్చు.
- తాము రాయదలుచుకున్న జామ్ పేపర్ సిలబస్‌ను, డిగ్రీలో చదువుతున్న సిలబస్‌ను పోల్చిచూసుకొని ఉమ్మడి ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది.
- డిగ్రీ పరీక్షల కోణంలో చదువుతూనే కొంత లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రామాణిక పుస్తకాలను చదవడం మేలుచేస్తుంది.
- డిగ్రీ సిలబస్‌లోని అంశాలకు సంబంధించి లైబ్రరీలో రిఫరెన్స్ పుస్తకాల ద్వారా నోట్స్ రూపొందించుకోవాలి. తద్వారా పరీక్షలప్పుడు అధ్యయనం సులువవుతుంది.
- జామ్ పరీక్ష ఫిబ్రవరిలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఏప్రిల్‌లో ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకుంటూ... జనవరి చివరివారం నాటికే డిగ్రీ సిలబస్‌తోపాటు జామ్ సిలబస్‌కు ప్రిపరేషన్ పూర్తిచేయాలి. జామ్ పరీక్ష తర్వాత డిగ్రీ పరీక్షల కోసం మరోమారు రివిజన్ చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 1, 2018.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2018.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జనవరి 4, 2019.
మాక్ టెస్టుల లింక్ అందుబాటు: జనవరి 10, 2019.
జామ్ 2019 పరీక్ష: ఫిబ్రవరి 10, 2019.
ఫలితాల వెల్లడి: మార్చి 20, 2019.
జామ్ 2019 వెబ్‌సైట్: https://jam.iitkgp.ac.in
Published date : 21 Aug 2018 04:56PM