ఇంటర్‌తోనే...ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేరాలంటే ?
Sakshi Education
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ! ఈ కోర్సులో చేరాలంటే అర్హత.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఐసెట్ వంటి ఎంట్రెన్స్ టెస్ట్‌లలో ర్యాంకు సాధించాలి. ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ తర్వాతే ఎంబీఏలో చేరుతున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇప్పుడు ఇంటర్మీడియెట్‌తోనే ఎంబీఏలో చేరే అవకాశం లభిస్తోంది.
విద్యార్థులకు ఉపయుక్తం:
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్.. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి ఉపయుక్తం అనే చెప్పాలి. ఈ కోర్సులో చేరే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అకడమిక్‌గా రాణించగలమనే నమ్మకం ఉంటేనే ముందుకు సాగాలి. ఇక కోర్సు వ్యవధిలో విద్యార్థులకు మొదటి నుంచే ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, మేనేజ్‌మెంట్ ట్రెండ్స్‌పై అవగాహన లభిస్తుంది. ఫలితంగా అయిదేళ్ల తర్వాత కోర్సు పూర్తయ్యేనాటికి సంపూర్ణమైన మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌గా జాబ్ మార్కెట్లో పోటీలో ముందంజలో నిలిచేందుకు అవకాశం ఉంటుంది.
- ప్రొఫెసర్ పి.జ్యోతి, డీన్, ఎస్‌ఎంఎస్, హెచ్‌సీయూ.
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుతో.. చిన్నవయసులోనే మేనేజ్‌మెంట్ నిపుణులుగా మారొచ్చు. ఆసక్తితోపాటు నైపుణ్యం ఉంటే.. కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఐఐఎంలు మొదలు ప్రముఖ బి-స్కూల్స్, రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ గురించి తెలుసుకుందాం...
ఐఐఎంలో మేనేజ్‌మెంట్ కోర్సులో అడుగుపెట్టాలంటే డిగ్రీ పూర్తిచేసి, క్యాట్‌లో అత్యుత్తమ స్కోర్ సాధించాలి. ఇతర యూనివర్సిటీలు, బి-స్కూల్స్‌లోనూ మేనేజ్‌మెంట్ పీజీలో చేరాలంటే.. డిగ్రీ తర్వాత ఎంబీఏ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించాలి. అయితే ఇటీవల కాలంలో ఇంటర్‌తోనే మేనేజ్‌మెంట్ పీజీ దిశగా అడుగులు వేయడానికి మార్గం వేస్తోంది.. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్.
కోర్సు వ్యవధి అయిదేళ్లు :
ఇంటర్ అర్హతతో ప్రవేశం లభించే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కాల వ్యవధి అయిదేళ్లు. ఈ అయిదేళ్లలో విద్యార్థులకు తొలి సంవత్సరం నుంచే మేనేజ్‌మెంట్ వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించే విధంగా బోధన సాగుతోంది. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో కీలకంగా భావించే కేస్ స్టడీ అనాలిసిస్, బిజినెస్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్ వంటి అంశాల్లో విద్యార్థులు రాణించేలా పలు ఇన్‌స్టిట్యూట్‌లు కరిక్యులం రూపొందిస్తున్నాయి.
ఏఐసీటీఈ సైతం అనుకూలంగానే..
దేశంలో ఎంబీఏ కళాశాలల నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలు చూసే ఏఐసీటీఈ సైతం ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లు అందించాలని యూనివర్సిటీలకు సూచించింది. దీంతో ఇప్పుడు రాష్ట్రాల స్థాయిలో పలు యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ కోరుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే ఆ దిశగా అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తోంది. ఇంటర్ అర్హతతోనే మేనేజ్‌మెంట్ పీజీలు అందించే క్రమంలో కొన్ని బి-స్కూల్స్ బీబీఏ+ఎంబీఏ డ్యూయల్ డిగ్రీ పేరుతో, మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పేరుతో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కోర్సును ఏ పేరుతో అందిస్తున్నప్పటికీ.. వీటి ఉద్దేశం విద్యార్థులకు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను అందించడం, భవిష్యత్తులో పీజీ కోర్సులు చేసిన వారితో దీటుగా జాబ్ మార్కెట్లో పోటీపడేలా తీర్చిదిద్దడమే.
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ :
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరుగుతోంది. ఐఐఎంలు సైతం ఇదే బాట పడుతున్నాయి. ఇప్పటికే ఐఐఎం-రోహ్‌తక్, ఇండోర్‌లు.. ఇంటర్ అర్హతతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అందిస్తున్నాయి. వచ్చే ఏడాది ఐఐఎం-అహ్మదాబాద్ కూడా ఈ దిశగా అడుగులు వేసే అవకాశముంది. మరికొన్ని ఐఐఎంలు సైతం ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ను అందించేందుకు కసరత్తు ప్రారంభించాయి. చిన్నవయసు నుంచే మేనేజ్‌మెంట్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఐఐఎంలతోపాటు ఇతర ప్రముఖ బి-స్కూళ్లు కూడా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్‌తోనే ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
బీటెక్+ఎంబీఏ :
ఇటీవల కాలంలో ఎంబీఏలో చేరుతున్న వారిలో బీటెక్ విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పైనే ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు బీటెక్+ఎంబీఏ పేరుతో కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి ఆరేళ్లుగా సదరు ఇన్‌స్టిట్యూట్‌లు నిర్దేశించాయి. అంతేకాకుండా.. యూజీ స్థాయిలో బీటెక్‌లో నిర్దిష్టంగా ఒక బ్రాంచ్‌లో బోధన సాగుతోంది. ఉదాహరణకు యూజీ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్‌ను అందిస్తూ దానికి కొనసాగింపుగా మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీల్లో ఈ విధానంలో కోర్సు అందుబాటులో ఉంది. ఫలితంగా ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్.. అనంతరం మేనేజ్‌మెంట్ రంగంలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సు అనుకూలంగా మారుతోంది. ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న సంస్థలన్నీ ప్రైవేటు యూనివర్సిటీలే. కాబట్టి విద్యార్థులు నాణ్యత ప్రమాణాల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే కోర్సులో చేరాలన్నది నిపుణుల సూచన.
ఎగ్జిట్ ఆప్షన్ :
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విషయంలో విద్యార్థులకు అనుకూలంగా నిలుస్తున్న మరో అంశం.. ‘ఎగ్జిట్’ ఆప్షన్. అంటే మొత్తం అయిదేళ్ల వ్యవధిలో తొలి మూడేళ్లు బ్యాచిలర్ స్థాయిగా, తర్వాత రెండేళ్లు పీజీ స్థాయిగా ఇన్‌స్టిట్యూట్‌లు పరిగణిస్తున్నాయి. తొలి మూడేళ్ల తర్వాత.. పీజీపై ఆసక్తి లేకపోతే విద్యార్థులకు ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. ఇలా ఎగ్జిట్ ఆప్షన్‌తో వెళ్లే వారికి బీబీఏ లేదా బీబీఎం సర్టిఫికెట్‌ను అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశించిన విద్యార్థులకు బ్యాచిలర్ స్థాయి నుంచే మేనేజ్‌మెంట్ ప్రొఫెషన్‌కు అవసరమైన ప్రాథమిక అంశాలను బోధిస్తున్నారు. నాలుగో ఏడాది నుంచి పూర్తిస్థాయిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ పాఠాల బోధన సాగుతోంది. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు నాలుగో ఏడాది నుంచి పీజీ విద్యార్థులతో కలిపి ఇంటిగ్రేటెడ్ విద్యార్థులకు ఉమ్మడిగా తరగతులు నిర్వహిస్తున్నాయి.
ఇన్‌స్టిట్యూట్‌ల సొంత కరిక్యులం :
జాతీయస్థాయిలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నప్పటికీ.. నిర్దిష్టంగా ఉమ్మడి కరిక్యులం విధానం అంటూ ఏదీ లేదు. దీంతో వీటిని అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లే వేర్వేరుగా సొంత కరిక్యులంను రూపొందించి కోర్సును బోధిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కోర్సులో ప్రవేశానికి ముందే ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల కరిక్యులంను ఆసాంతం పరిశీలించడం మేలు. తమ భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా కరిక్యులం లెర్నింగ్ మాడ్యూళ్లు ఉన్నాయో? లేదో? తెలుసుకోవాలి. ముఖ్యంగా యూజీ స్థాయిలోనే బేసిక్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు అందించే కోర్సులు, వాటికి కేటాయించిన క్రెడిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనేది నిపుణుల అభిప్రాయం.
ప్రత్యేక ప్రవేశ పరీక్షలు :
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులోకి ప్రత్యేక ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్ కల్పిస్తున్నారు. ఐఐఎం-రోహ్‌తక్, ఇండోర్‌లు ఆప్టిట్యూడ్ టెస్ట్ పేరుతో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. ఆ తర్వాత దశలో గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలను సైతం ఉంటున్నాయి. ప్రముఖ ప్రైవేటు బి-స్కూళ్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఎంట్రన్స్ టెస్ట్‌ల సిలబస్‌ను పరిశీలించి.. వాటిలో తాము రాణించగలమనే స్పష్టత ఏర్పరచుకోవాలి.
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్స్ :
1. ఐఐఎం-ఇండోర్
2. ఐఐఎం-రోహ్‌తక్
3. అమిటీ యూనివర్సిటీ
4. ఎన్‌ఎంఐఎంఎస్
5. లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
6. సింబయాసిస్ యూనివర్సిటీ
7. నిర్మా యూనివర్సిటీ
8. ఇంద్రప్రస్థ యూనివర్సిటీ
9. బెంగళూరు యూనివర్సిటీ.
వీటితోపాటు పలు ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలు సైతం ఇటీవల కాలంలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నాయి.
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ.. ప్రయోజనాలు

- యూజీ స్థాయి నుంచే బేసిక్ మేనేజ్‌మెంట్ అంశాల్లో నైపుణ్యం.
- డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి వాటిపై అవగాహన.
- ఇండస్ట్రియల్ విజిట్స్, ప్రాక్టికల్ వర్క్ వంటి విధానాలతో యూజీ స్థాయిలోనే రియల్ టైం ఎక్స్‌పోజర్.
- పీజీ స్థాయిలో చాలా సులువుగా ఆయా అంశాలను ఆకళింపు చేసుకునే అవకాశం.
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఎంబీఏలో చేరే వారికంటే ముందంజలో నిలిచే అవకాశం.
- కరిక్యులం పరంగా స్పష్టమైన విధానం లేకపోవడం.
- ఇంటర్ వరకు క్లాస్‌రూమ్ టీచింగ్‌కు అలవాటు పడి ఒక్కసారిగా ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌పై దృష్టిపెట్టే విషయంలో ఇబ్బంది.
- కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ విషయంలో పరిణితి సాధించే అవకాశం తక్కువగా ఉండటం.
విద్యార్థులకు ఉపయుక్తం:
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్.. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి ఉపయుక్తం అనే చెప్పాలి. ఈ కోర్సులో చేరే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అకడమిక్‌గా రాణించగలమనే నమ్మకం ఉంటేనే ముందుకు సాగాలి. ఇక కోర్సు వ్యవధిలో విద్యార్థులకు మొదటి నుంచే ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, మేనేజ్‌మెంట్ ట్రెండ్స్‌పై అవగాహన లభిస్తుంది. ఫలితంగా అయిదేళ్ల తర్వాత కోర్సు పూర్తయ్యేనాటికి సంపూర్ణమైన మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌గా జాబ్ మార్కెట్లో పోటీలో ముందంజలో నిలిచేందుకు అవకాశం ఉంటుంది.
- ప్రొఫెసర్ పి.జ్యోతి, డీన్, ఎస్‌ఎంఎస్, హెచ్‌సీయూ.
Published date : 04 Jun 2019 06:38PM