Skip to main content

ఇంటర్‌తోనే నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో బీఈడీ చేసే అవ‌కాశం.. ఎన్‌సీఈఆర్‌టీ సీఈఈ 2021 వివ‌రాలు ఇవే..

ఆర్‌ఐఈ.. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌! ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోని ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో.. ఇంటర్‌ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.

అందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌సీఈఆర్‌టీ–సీఈఈ)లో ఉత్తీర్ణత సాధించాలి! ఈ ఎంట్రన్స్‌లో స్కోర్,అకడెమిక్‌ మెరిట్‌ ఆధారంగా.. అయిదు ఆర్‌ఐఈలలో ప్రవేశం కల్పిస్తారు. ఇటీవల 2021–22 సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ సీఈఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఐఈలు అందించే కోర్సులు, ఎంపిక ప్రక్రియపై ప్రత్యేక కథనం....

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేందుకు బీఈడీ చదవాలంటే.. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కాని జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ విద్య పర్యవేక్షణ సంస్థ అయిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ)మాత్రం.. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే బీఈడీ కోర్సులో ప్రవేశించే అవకాశం కల్పిస్తోంది. ఉపాధ్యాయ విద్యా బోధనలో ప్రతిష్టాత్మక సంస్థలుగా పేర్కొనే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఆర్‌ఐఈ) క్యాంపస్‌లలో వివిధ ఉపాధ్యాయ విద్య కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. తాజాగా 2021–22 సంవత్సరానికి సంబంధించి ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తం అయిదు ఆర్‌ఐఈలు..
ఎన్‌సీఈఆర్‌టీ.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అయిదు ఆర్‌ఐఈల(అజ్మీర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్‌) ద్వారా కోర్సులను అందిస్తోంది. వీటిల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌ఈ–బీఈడీ, బీఏ–బీఈడీ; ఆరేళ్ల ఎమ్మెస్సీ–బీఈడీ; రెండేళ్ల వ్యవధిలోని బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో స్కోర్‌తోపాటు ఇంటర్‌లో మార్కుల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.

కోర్సులు–అర్హతలు..
ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ–బీఈడీ:

  • అర్హత: ఈ కోర్సులో రెండు విభాగాలు ఉన్నాయి. అవి.. ఫిజికల్‌ సైన్స్‌ గ్రూప్, బయలాజికల్‌ సైన్స్‌ గ్రూప్‌. ఫిజికల్‌ సైన్స్‌ గ్రూప్‌ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌లో 50శాతం మార్కులతో; బయలాజికల్‌ సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులు బైపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. బైపీసీ గ్రూప్‌నకు సంబంధించి బయాలజీ లేదా బయో టెక్నాలజీ సబ్జెక్ట్‌ను గ్రూప్‌ సబ్జెక్ట్‌గా చదివుండాలి.
  • ఇంటిగ్రేటెడ్‌ బీఏ–బీఈడీ కోర్సుకు మాత్రం ఇంటర్మీడియెట్‌లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌ గ్రూప్‌లు చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఊ ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు;అదే విధంగా 2019, 2020లో ఇంటర్మీడియె ట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్‌ఐఈలు.. సీట్ల వివరాలు..
మొత్తం అయిదు ఆర్‌ఐఈలలో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ–బీఈడీ, బీఏ–బీఈడీ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు..
ఆర్‌ఐఈ బీఎస్‌సీ-బీఈడీ బీఏ–బీఈడీ
మైసూరు 88 44
అజ్మీర్‌ 110 55
భోపాల్‌ 88 44
షిల్లాంగ్‌ 50 25
భువనేశ్వర్‌ 110 55

గమనిక: బీఎస్‌సీ–బీఈడీకి సంబంధించిన సీట్లలో యాభై శాతం సీట్లు పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) వారికి, మిగతా యాభై శాతం సీట్లను సీబీజడ్‌(కెమిస్ట్రీ బయాలజీ, జువాలజీ) వారికి కేటాయిస్తారు.

ఇంకా చ‌ద‌వండి : part 2: ఆర్‌ఐఈల్లో రాష్ట్రాల వారీగా కోటా.. ఎంపిక విధానం ఇలా..
Published date : 05 Jun 2021 05:43PM

Photo Stories