ఇంటర్‌కు ఏ బోర్డ్ సిలబస్ బెటర్..?
Sakshi Education
త్వరలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. పదోతరగతి పూర్తిచేసుకున్న విద్యార్థుల తదుపరి గమ్యం..
ఇంటర్మీడియెట్. మరి ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలి.. భవిష్యత్ లక్ష్యాల సాధనకు ఏ బోర్డు సిలబస్ బెటర్?! మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లకు సరిపోయే బోర్డ్ ఏది.. ఏ బోర్డ్‌ను ఎంపిక చేసుకుంటే.. ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది. సీబీఎస్‌ఈ, రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియెట్ బోర్డుల్లో ఏది బెటర్, ఎందుకు? రెండు బోర్డుల సిలబస్ సానుకూల, ప్రతికూల అంశాల గురించి తెలుసుకుందాం...
‘ఇంటర్మీడియెట్ అర్హతగా జాతీయస్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలు సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగానే జరుగుతున్నాయి. అలాంటప్పుడు సీబీఎస్‌ఈలో +1లో చేరితే మంచిదేమో..!’
- ఇది పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం.
‘జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో... సీబీఎస్‌ఈ కంటే ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌తోనే బాగా రాణించే అవకాశముంది’
- ఇది మరికొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల వాదన.
ఇలా.. ఇంటర్మీడియెట్/+1లో చేరే విషయంలో బోర్డ్ ఎంపికలో ఏటా తల్లిదండ్రులు ఎంతో గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం.. ఆయా బోర్డ్‌ల గ్రూప్‌లు, సిలబస్, బోధన, లెర్నింగ్ విధానాలను తెలుసుకోవడమే అంటున్నారు నిపుణులు!!
‘గ్రూప్’లు ఇలా..
రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియెట్ బోర్డ్‌లో.. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ ప్రధాన గ్రూప్‌లు. వీటిలో చేరిన విద్యార్థులు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్‌తోపాటు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా నిర్దేశించిన మూడు సబ్జెక్ట్‌లనుచదవాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ బోర్డ్ మాదిరిగా ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం స్టేట్ బోర్డ్ సిలబస్‌లో ఉండదు.
‘మెడికల్’ లక్ష్యమైతే..
ఇంటర్మీడియెట్ తర్వాత ఎంబీబీఎస్ లక్ష్యంగా నీట్, ఎయిమ్స్, జిప్‌మర్ వంటి పరీక్షల్లో రాణించాలనుకునే విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డ్‌లో చేరితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఇంజనీరింగ్‌లో చేరేందుకు వీలుకల్పించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో మెరుగ్గా రాణించాలన్నా సీబీఎస్‌ఈ బోర్డ్ మేలనే మాట వినిపిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షల సిలబస్ ప్రధానంగా సీబీఎస్‌ఈ కరిక్యులం ఆధారంగా రూపొందించడమే ఇందుకు కారణం. అయితే స్టేట్‌బోర్డ్ సిలబస్‌లో మ్యాథమెటిక్స్ విస్తృతంగా ఉండటం జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో ఎంపీసీ విద్యార్థులకు కలిసొస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కామర్స్ :
కామర్స్ స్ట్రీమ్ విద్యార్థులు.. భవిష్యత్తులో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సుల్లో మెరుగ్గా రాణించేందుకు సీబీఎస్‌ఈ బోర్డ్ సిలబస్ అనుకూలమనే అభిప్రాయం వినిపిస్తోంది. భవిష్యత్తులో ఆయా ప్రొఫెషనల్ కోర్సులకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను +2 స్థాయిలోనే అందిపుచ్చుకునే అవకాశం సీబీఎస్‌ఈ సిలబస్ ద్వారా లభిస్తోంది.
పోటీ పరీక్షలకు ఏ సిలబస్ :
భవిష్యత్తులో ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకునే విద్యార్థులు.. స్టేట్‌బోర్డ్, హ్యుమానిటీస్(హెచ్‌ఈసీ) గ్రూప్‌లో చేరడం మేలన్నది నిపుణుల సలహా. ఆయా పోటీ పరీక్షలకు నిర్దేశించిన సిలబస్‌లో అధిక శాతం సంబంధిత రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాల ఆధారంగానే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇంటర్ బోర్డ్ హెచ్‌ఈసీ గ్రూప్ సిలబస్ కూడా ఉండటం ఉపయుక్తం. హెచ్‌ఈసీ తర్వాత రాష్ట్రాల్లోనే యూనివర్సిటీల్లో సంప్రదాయ బీఏలో చేరొచ్చు. తద్వారా డిగ్రీ అర్హతతో నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, ఇతర ఉద్యోగ నియామక పరీక్షల్లో మెరుగ్గా రాణించేందుకు వీలవుతుంది. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో మాత్రం సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు.
సీబీఎస్‌ఈ.. లెర్నింగ్ బై డూయింగ్ :
బోధన విషయానికొస్తే సీబీఎస్‌ఈ, స్టేట్ బోర్డ్‌ల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. సీబీఎస్‌ఈలో లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో ప్రాక్టికల్ ఆధారిత, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా సైన్స్, మ్యాథమెటిక్స్ విద్యార్థులకు అప్లికేషన్ ఓరియెంటేషన్ అలవడుతోంది. అదే స్టేట్ బోర్డ్ విధానంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఆధారిత టీచింగ్, లెర్నింగ్ చాలా తక్కువ.
స్టేట్ బోర్డ్.. బట్టీ విధానం :
స్టేట్ బోర్డ్‌లో ప్రధానంగా బట్టీ విధానం కనిపిస్తోంది. సబ్జెక్టును అవగాహన చేసుకోవడం కంటే పరీక్షల కోసం గుర్తుంచుకునే పద్ధతిని అనుసరిస్తున్నారు. జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్ పరీక్షల కోసం ఇంటర్ తొలిరోజు నుంచే ఆయా పరీక్షల పాత ప్రశ్నపత్రాల సాధన, వీక్లీ టెస్ట్‌లతో విద్యార్థులు పుస్తకాలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా పరీక్షల్లో అడిగే అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేకపోతున్నారు. అంతేకాకుండా నిరంతరం పరీక్షల కోణంలో చదువు కొనసాగిస్తుండటంతో విద్యార్థుల్లో ప్రాక్టికల్ దృక్పథం లోపిస్తోందనే వాదన ఉంది.
స్టేట్ బోర్డ్.. సిలబస్ మార్చినా
స్టేట్ బోర్డ్ విద్యార్థులు.. జాతీయస్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం ఇంటర్మీడియెట్ స్టేట్ బోర్డ్ సిలబస్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో దాదాపు 80 శాతం సిలబస్ సీబీఎస్‌ఈ సిలబస్‌కు సరితూగే విధంగా మార్చారు. కానీ.. బోధన పరంగా అందుకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, బోధన సిబ్బంది కొరత కారణంగా సిలబస్ మార్చినా.. బట్టీ విధానంలోనే అభ్యసనం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉమ్మడి సిలబస్ రానుందా..!
జాతీయస్థాయి పరీక్షల్లో సీబీఎస్‌ఈ విద్యార్థులే ముందంజలో నిలుస్తున్నారనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. దేశ వ్యాప్తంగా ఉమ్మడి సిలబస్ రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం మాజీ కేబినెట్ సెక్రటరీ టి.ఎస్.ఆర్.సుబ్రమణియన్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ గతేడాది కొత్త విద్యావిధానంపై నివేదిక సమర్పించింది. అందులో ఉమ్మడి సిలబస్ అంశాన్ని గట్టిగా సిఫార్సు చేసింది. దీనివల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయనే తెలిపింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో నూటికి నూరు శాతం సిలబస్ ఒకే మాదిరిగా ఉండేలా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారంగా రూపొందించాలని పేర్కొంది. హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌ల విషయంలో 70 శాతం ఉమ్మడి సిలబస్‌ను, 30 శాతం సంబంధిత రాష్ట్ర అంశాలను జోడించి రూపొందించాలని సిఫార్సు చేసింది. దీనిపై గతేడాది అన్ని రాష్ట్రాల విద్యా శాఖమంత్రులతో సమావేశం సైతం నిర్వహించారు. వాస్తవానికి ఈ విధానాన్ని 2019 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని భావించినా.. కొంత సమయం పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
సీబీఎస్‌ఈ :
సానుకూలతలు:
ఆసక్తికి అనుగుణంగా..
సీనియర్ సెకండరీ లెవల్‌లో బోర్డ్‌ను ఎంపిక చేసుకునే ముందు విద్యార్థులు తమ సహజ ఆసక్తులను విశ్లేషించుకోవాలి. సీబీఎస్‌ఈలో ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి బోర్డ్, స్కూల్ ఎంపికలో నిర్ణయం తీసుకోవాలి.
- వసంత రామన్, ప్రిన్సిపాల్, డీఏవీ పబ్లిక్ స్కూల్.

- సీబీఎస్‌ఈ +2 స్థాయిలో ప్రస్తుతం ప్రధానంగా మూడు స్ట్రీమ్(గ్రూప్)లు అందుబాటులో ఉన్నాయి. అవి.. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్.
- సైన్స్ స్ట్రీమ్‌లో మెడికల్, నాన్-మెడికల్ పేరుతో రెండు సబ్ స్ట్రీమ్స్ విధానం అమలవుతోంది.
- నాన్-మెడికల్ స్ట్రీమ్‌లో విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లతోపాటు ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను చదవాలి. దీన్ని పీసీఎం గ్రూప్‌గా పిలుస్తున్నారు.
- మెడికల్ స్ట్రీమ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లను, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను చదవాలి. దీన్ని పీసీబీ గ్రూప్‌గా పేర్కొంటున్నారు.
- కామర్స్ స్ట్రీమ్‌లో అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను చదవాల్సి ఉంటుంది.
- హ్యుమానిటీస్.. మిగతా స్ట్రీమ్‌లతో పోల్చితే విభిన్నం, వినూత్నం అని చెప్పొచ్చు. ఈ స్ట్రీమ్‌లో విద్యార్థులకు కోర్ సబ్జెక్ట్ విధానంలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ.. ఇలా అనేక సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి.
రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియెట్ బోర్డ్‌లో.. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ ప్రధాన గ్రూప్‌లు. వీటిలో చేరిన విద్యార్థులు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్‌తోపాటు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా నిర్దేశించిన మూడు సబ్జెక్ట్‌లనుచదవాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ బోర్డ్ మాదిరిగా ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం స్టేట్ బోర్డ్ సిలబస్‌లో ఉండదు.
‘మెడికల్’ లక్ష్యమైతే..
ఇంటర్మీడియెట్ తర్వాత ఎంబీబీఎస్ లక్ష్యంగా నీట్, ఎయిమ్స్, జిప్‌మర్ వంటి పరీక్షల్లో రాణించాలనుకునే విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డ్‌లో చేరితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఇంజనీరింగ్‌లో చేరేందుకు వీలుకల్పించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో మెరుగ్గా రాణించాలన్నా సీబీఎస్‌ఈ బోర్డ్ మేలనే మాట వినిపిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షల సిలబస్ ప్రధానంగా సీబీఎస్‌ఈ కరిక్యులం ఆధారంగా రూపొందించడమే ఇందుకు కారణం. అయితే స్టేట్‌బోర్డ్ సిలబస్‌లో మ్యాథమెటిక్స్ విస్తృతంగా ఉండటం జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో ఎంపీసీ విద్యార్థులకు కలిసొస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కామర్స్ :
కామర్స్ స్ట్రీమ్ విద్యార్థులు.. భవిష్యత్తులో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సుల్లో మెరుగ్గా రాణించేందుకు సీబీఎస్‌ఈ బోర్డ్ సిలబస్ అనుకూలమనే అభిప్రాయం వినిపిస్తోంది. భవిష్యత్తులో ఆయా ప్రొఫెషనల్ కోర్సులకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను +2 స్థాయిలోనే అందిపుచ్చుకునే అవకాశం సీబీఎస్‌ఈ సిలబస్ ద్వారా లభిస్తోంది.
పోటీ పరీక్షలకు ఏ సిలబస్ :
భవిష్యత్తులో ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకునే విద్యార్థులు.. స్టేట్‌బోర్డ్, హ్యుమానిటీస్(హెచ్‌ఈసీ) గ్రూప్‌లో చేరడం మేలన్నది నిపుణుల సలహా. ఆయా పోటీ పరీక్షలకు నిర్దేశించిన సిలబస్‌లో అధిక శాతం సంబంధిత రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాల ఆధారంగానే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇంటర్ బోర్డ్ హెచ్‌ఈసీ గ్రూప్ సిలబస్ కూడా ఉండటం ఉపయుక్తం. హెచ్‌ఈసీ తర్వాత రాష్ట్రాల్లోనే యూనివర్సిటీల్లో సంప్రదాయ బీఏలో చేరొచ్చు. తద్వారా డిగ్రీ అర్హతతో నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, ఇతర ఉద్యోగ నియామక పరీక్షల్లో మెరుగ్గా రాణించేందుకు వీలవుతుంది. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో మాత్రం సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు.
సీబీఎస్‌ఈ.. లెర్నింగ్ బై డూయింగ్ :
బోధన విషయానికొస్తే సీబీఎస్‌ఈ, స్టేట్ బోర్డ్‌ల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. సీబీఎస్‌ఈలో లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో ప్రాక్టికల్ ఆధారిత, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా సైన్స్, మ్యాథమెటిక్స్ విద్యార్థులకు అప్లికేషన్ ఓరియెంటేషన్ అలవడుతోంది. అదే స్టేట్ బోర్డ్ విధానంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఆధారిత టీచింగ్, లెర్నింగ్ చాలా తక్కువ.
స్టేట్ బోర్డ్.. బట్టీ విధానం :
స్టేట్ బోర్డ్‌లో ప్రధానంగా బట్టీ విధానం కనిపిస్తోంది. సబ్జెక్టును అవగాహన చేసుకోవడం కంటే పరీక్షల కోసం గుర్తుంచుకునే పద్ధతిని అనుసరిస్తున్నారు. జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్ పరీక్షల కోసం ఇంటర్ తొలిరోజు నుంచే ఆయా పరీక్షల పాత ప్రశ్నపత్రాల సాధన, వీక్లీ టెస్ట్‌లతో విద్యార్థులు పుస్తకాలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా పరీక్షల్లో అడిగే అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేకపోతున్నారు. అంతేకాకుండా నిరంతరం పరీక్షల కోణంలో చదువు కొనసాగిస్తుండటంతో విద్యార్థుల్లో ప్రాక్టికల్ దృక్పథం లోపిస్తోందనే వాదన ఉంది.
స్టేట్ బోర్డ్.. సిలబస్ మార్చినా
స్టేట్ బోర్డ్ విద్యార్థులు.. జాతీయస్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం ఇంటర్మీడియెట్ స్టేట్ బోర్డ్ సిలబస్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో దాదాపు 80 శాతం సిలబస్ సీబీఎస్‌ఈ సిలబస్‌కు సరితూగే విధంగా మార్చారు. కానీ.. బోధన పరంగా అందుకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, బోధన సిబ్బంది కొరత కారణంగా సిలబస్ మార్చినా.. బట్టీ విధానంలోనే అభ్యసనం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉమ్మడి సిలబస్ రానుందా..!
జాతీయస్థాయి పరీక్షల్లో సీబీఎస్‌ఈ విద్యార్థులే ముందంజలో నిలుస్తున్నారనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. దేశ వ్యాప్తంగా ఉమ్మడి సిలబస్ రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం మాజీ కేబినెట్ సెక్రటరీ టి.ఎస్.ఆర్.సుబ్రమణియన్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ గతేడాది కొత్త విద్యావిధానంపై నివేదిక సమర్పించింది. అందులో ఉమ్మడి సిలబస్ అంశాన్ని గట్టిగా సిఫార్సు చేసింది. దీనివల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయనే తెలిపింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో నూటికి నూరు శాతం సిలబస్ ఒకే మాదిరిగా ఉండేలా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారంగా రూపొందించాలని పేర్కొంది. హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌ల విషయంలో 70 శాతం ఉమ్మడి సిలబస్‌ను, 30 శాతం సంబంధిత రాష్ట్ర అంశాలను జోడించి రూపొందించాలని సిఫార్సు చేసింది. దీనిపై గతేడాది అన్ని రాష్ట్రాల విద్యా శాఖమంత్రులతో సమావేశం సైతం నిర్వహించారు. వాస్తవానికి ఈ విధానాన్ని 2019 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని భావించినా.. కొంత సమయం పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
సీబీఎస్‌ఈ :
సానుకూలతలు:
- జాతీయస్థాయి పరీక్షలన్నీ సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగానే జరుగుతున్న పరిస్థితి.
- ఏటా కరిక్యులంలో తాజా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు.
- లెర్నింగ్ బై డూయింగ్ విధానం, ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం.
- మ్యాథ్స్‌కు ప్రాధాన్యం తక్కువ.
- సీబీఎస్‌ఈ పాఠశాలల సంఖ్య తక్కువగా ఉండటం.
- బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఒకేషనల్ కోర్సుల పరంగా పరిమిత అవకాశాలు.
స్టేట్ బోర్డ్..
సానుకూలతలు:
సానుకూలతలు:
- స్థానిక పరిస్థితులపై అవగాహన కల్పించే విధంగా సిలబస్.
- మ్యాథ్స్ విస్తృతంగా ఉండటం.
- వార్షిక పరీక్షల కోణంలో కలిసొచ్చే అంశం.
- కరిక్యులంలో నిరంతర మార్పులు లేకపోవడం.
- మౌలిక సదుపాయాల కొరత.
- ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోవడం.
ఆసక్తికి అనుగుణంగా..
సీనియర్ సెకండరీ లెవల్‌లో బోర్డ్‌ను ఎంపిక చేసుకునే ముందు విద్యార్థులు తమ సహజ ఆసక్తులను విశ్లేషించుకోవాలి. సీబీఎస్‌ఈలో ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి బోర్డ్, స్కూల్ ఎంపికలో నిర్ణయం తీసుకోవాలి.
- వసంత రామన్, ప్రిన్సిపాల్, డీఏవీ పబ్లిక్ స్కూల్.
Published date : 12 Jun 2019 02:08PM