Skip to main content

ఇంటర్ +ఎంసెట్ (బైపీసీ)కు ప్రిపరేషన్ ప్రణాళిక...

ఓ వైపు కొత్త సంవత్సరం రాకతోపాటే పరీక్షల సందడి మొదలవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాసే ఎంసెట్ షెడ్యూల్ వెలువడింది. తెలంగాణలో మే 9, 11 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్ష జరుగనుంది. అలాగే ఏపీలో ఎంసెట్ ఏప్రిల్ 20-24 తేదీల మధ్య నిర్వహించనున్నారు. అదే సమయంలో ఇంటర్ పరీక్షలకు సిద్ధం కావాలి. కాబట్టి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ.. అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఎంసెట్(అగ్రికల్చర్,ఫార్మసీ)స్ట్రీమ్ విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రిపరేషన్ ప్రణాళిక..

కోర్సులు :
గత ఎంసెట్ నోటిఫికేషన్ ప్రకారం- ఎంసెట్(అగ్రికల్చర్ స్ట్రీమ్) ద్వారా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ/బీఎస్సీ అగ్రికల్చర్/బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సు/బీఎస్సీ(సీఏ,బీఎం)/బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్/బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/బీటెక్ బయోటెక్నాలజీ/ బీఫార్మసీ / ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు.

ప్రిపరేషన్ పటిష్టంగా ..
భౌతిక శాస్త్రం :
  • ఎంసెట్ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే మిగిలిన సబ్జెక్టుల కంటే భౌతికశాస్త్రం సులభంగా ఉంటుందని తెలుస్తుంది. ఇంటర్ పరీక్షలకు పూర్తి స్థాయిలో ప్రిపేరైన విద్యార్థులు.. ఎంసెట్ ఫిజిక్స్‌లోనూ సత్తా చాటగలరు. సాధారణంగా ఇంటర్ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరం సులభంగా అనిపిస్తుంది.
  • ఎంసెట్‌లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు సమాన వెయిటేజీ ఉంటుంది. కాబట్టి రెండు సంవత్సరాల్లోని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం చాప్టర్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి.
  • గ్రావిటేష‌న్‌, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియెల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్లకూ ఎంసెట్‌లో మంచి వెయిటేజీ లభిస్తోంది. వీటి తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్, రే ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, వేవ్ ఆప్టిక్స్, మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, డ్యూయెల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మేటర్, న్యూక్లియై, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ చాప్టర్లపై దృష్టిపెట్టాలి.
  • ఎంసెట్ ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు మెకానిక్స్‌పై ఫోకస్ చేయాలి. పరీక్షలో దీనికి అధిక వెయిటేజీ దక్కుతోంది. వీటి తర్వాత ఎలక్ట్రిసిటీ, మోడ్రన్ ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంసెట్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. బోర్డు పరీక్షలకు సంబంధించి డిస్క్రిప్టివ్ తరహాలో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. బోర్డు పరీక్షలకు ప్రిపేరయ్యే సమయంలో బిట్‌లు అడిగేందుకు ఆస్కారం ఉన్న అంశాన్ని గుర్తించి దాన్ని ప్రత్యేకంగా నోట్ చేసుకోవడం లాభిస్తుంది.

రసాయన శాస్త్రం :
  • ఎంసెట్ పరంగా కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలుగా విభజించుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీని ఎంత బాగా ప్రిపేరయ్యాం అనే దానిపైనే ఎంసెట్ ర్యాంకు ఆధారపడి ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతోపాటు రౌల్ట్స్ లా, ఐడియల్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ, మొలారిటీ, మొలాలిటీ, వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ తదితరాలపై దృష్టిపెట్టాలి. సాలిడ్‌స్టేట్‌లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ, బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లలోని నెర్ట్స్ ఈక్వేషన్‌పై ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలు, ఎలక్ట్రాలసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌పై ఫోకస్ పెట్టాలి.
  • IA, IIA, IIIA, IVA గ్రూపు మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్లు, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగిటివిటీ, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పొటన్షియల్ వాల్యూమ్ టాపిక్స్‌పై దృష్టిపెట్టాలి. గ్రూపులకు పట్టికలను ఏర్పరచుకొని వాటిని రోజూ రివిజన్ చేయడం లాభిస్తుంది.
  • II-IA గ్రూపులో బోరాక్స్, డైబోరేన్ స్ట్రక్చర్, ప్రిపరేషన్, ప్రాపర్టీస్, IVA గ్రూపులో డైమండ్, రాఫైట్ స్ట్రక్చర్లు, సిలికాన్ల గురించి క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు డి, ఎఫ్-బ్లాక్ ఎలిమెంట్లు, స్టాండర్డ్ రిడక్షన్ పొటన్షియల్ వాల్యూ, వెస్పర్ థియరీ తదితరాలపై ఫోకస్ పెట్టాలి.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకోవాలి. ఇందులో హైడ్రోకార్బన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు, హోమోజినైజేషన్, రియాక్షన్ విత్ బేయర్స్ రియేజెంట్, హాలోజన్, ఎస్‌ఎల్ మెకానిజమ్స్, యాసిడ్ స్ట్రెంత్ ఆఫ్ ఫీనాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్‌పై దృష్టిపెట్టాలి. పరీక్ష సమయం దగ్గరపడుతుందనగా బయోమాలిక్యుల్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ స్ట్రక్చర్లు, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్స్‌ను చదివితే సరిపోతుంది.

బయాలజీ :
బయాలజీ (జీవశాస్త్రం)లో బోటనీ నుంచి 40 ప్రశ్నలు, జువాలజీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ప్లాంట్స్(మార్ఫాలజీ), రీ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్‌ఫిజియాలజీ, మైక్రోబయాలజీ(బ్యాక్టీరియా,వైరస్),జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ తదితర చాప్టర్లను అధ్యయనం చేయాలి. తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా చదవడం లాభిస్తుంది. ఎంసెట్‌లో ప్రశ్నలను మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. కానీ, ప్రిపరేషన్ డిస్క్రిప్టివ్ తరహాలో సాగిస్తే ప్రశ్న ఎలా అడిగినా సమాధానం గుర్తించేందుకు వీలవుతుంది. జువాలజీ : ప్రిపరేషన్‌లో ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. ఇంటర్ సిలబస్‌లోని జువాలజీ-డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ (I & II), లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రొటొజోవా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లెనేటా అమెరికానా, ఎకోలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ (I,II,III,IV), హ్యూమన్ రీప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, అప్లయిడ్ బయాలజీ చాప్టర్లను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి.

కీలక సూచనలు :
  • ఇంటర్, ఎంసెట్ ప్రిపరేషన్‌లో విద్యార్థులు పునఃశ్చరణ, ప్రాక్టీస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. రోజూ వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటారుుంచాలి. విద్యార్థులు స్వీయ సామర్థ్యాల మేరకు ఆయా సబ్జెక్టులకు సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి.
  • రోజూ బయాలజీ(బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సమయం కేటారుుంచేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా బయాలజీలో డయాగ్రమ్స్, అసెర్షన్ అండ్ రీజన్, స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది.
  • ఎంసెట్ సిలబస్ ఆధారంగా ఆయా అంశాల కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. దీంతోపాటు గత ప్రశ్నపత్రాలను తప్పక పరిశీలించాలి.
  • ఫిజిక్స్‌కు సంబంధించి అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ముందుకెళ్లాలి. ఫార్ములాలను అన్వరుుంచడం నేర్చుకోవాలి. కెమిస్ట్రీలో తులనాత్మక అధ్యయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బోటనీకి సంబంధించి అంతర్గత అనుబంధ ప్రిపరేషన్ విధానం లాభిస్తుంది.
  • ఎంసెట్‌లో అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్ సిలబస్ ఆధారంగానే ఉంటారుు. కాకపోతే ప్రశ్నలను ఇన్‌డెరైక్ట్‌గా అడుగుతారు. కాబట్టి అకాడమీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చిన ప్రాక్టీస్ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో ప్రముఖంగా పేర్కొన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
Published date : 01 Jan 2020 06:28PM

Photo Stories