ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో విజయానికి సూచనలు...
Sakshi Education
బీటెక్.. ఇంటర్మీడియెట్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువమంది లక్ష్యమిదే. ఇంజనీరింగ్ కల నెరవేర్చుకునేందుకు ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే కసరత్తు! అందుకోసం కోచింగ్‌లు, ట్యూషన్లు, ఆన్‌లైన్ టెస్టులు, మాక్ టెస్టులు.. ఇలా ఎన్నో ప్రయత్నాలు!! ఇలాంటి విద్యార్థులు తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది! ఎందుకంటే... జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరిగే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్ వంటి పలు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్టుల సందడి మొదలైంది. ఆయా ప్రవేశ పరీక్షలకు 2019 సంవత్సరానికి షెడ్యూళ్లు విడుదలవుతున్నాయి! ఈ నేపథ్యంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు.. వాటిలో విజయానికి సలహాలు...
దేశ వ్యాప్తంగా లక్షల మంది హాజరయ్యే జేఈఈ మెయిన్... ఐఐటీల్లో ప్రవేశం కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్.. తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా నిర్వహించే ఎంసెట్‌తో పాటు ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జరిపే ఎంట్రెన్స్ టెస్ట్‌లకు రంగం సిద్ధమవుతోంది. ఇంటర్మీడియెట్‌లో చేరిన తొలిరోజు నుంచే బీటెక్‌లో ప్రవేశం లక్ష్యంగా కృషిచేసే విద్యార్థులు తమ ప్రిపరేషన్ వేగం పెంచుతున్నారు. పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే చేరాలనే భావనతో ఆయా ఎంట్రెన్స్ టెస్ట్‌లకు సిద్ధమవుతున్నారు.
జేఈఈ మెయిన్ (2)
జేఈఈ మెయిన్.. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్‌లో ప్రవేశం కల్పించే పరీక్ష. తాజాగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని ఏర్పాటు చేసింది. జేఈఈ-మెయిన్‌ను ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు (జనవరి, ఏప్రిల్) నిర్వహించనుంది. జనవరి నెలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. జేఈఈ మెయిన్ (2) పేరిట ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది.
అర్హతలు:
2017 లేదా 2018లో 10+2/ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు (ఎంపీసీ)లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. లేదా సదరు బోర్డు ఫలితాల్లో టాప్ 20 పర్సంటైల్‌లో నిలవాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 65 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2019లో ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం :
జేఈఈ-మెయిన్ పేపర్-1, పేపర్-2 ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూలు) ఉంటాయి. బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు జేఈఈ-మెయిన్ పేపర్-1కు హాజరవ్వాలి. పేపర్-2.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష.
పేపర్-1 విధానం :
జేఈఈ మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్.. మూడు సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 30 ప్రశ్నల చొప్పున మూడు సబ్జెక్టులకు సమాన వెయిటేజీ ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. అంటే.. 90 ప్రశ్నలతో 360 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత ఉంటుంది.
పేపర్-2 పరీక్ష విధానం:
ఈ పేపర్‌లో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ విభాగాలుంటాయి. వీటిలో డ్రాయింగ్ టెస్ట్ ఒక్కటే పెన్ పేపర్ విధానంలో నిర్వహిస్తారు. మిగతా రెండు విభాగాలకు విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలోనే హాజరు కావాలి.
జేఈఈ మెయిన్ (2) ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు: ఫిబ్రవరి 8, 2019 నుంచి మార్చి 7, 2019 వరకు.
ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు: ఏప్రిల్ 6, 2019 నుంచి ఏప్రిల్ 20, 2019 వరకు.
తెలుగు రాష్ట్రాల్లో... ఎంసెట్
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుపరిచితమైన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్.. ఎంసెట్. తెలంగాణలో టీఎస్ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఎంసెట్‌గా పేర్కొంటున్నారు. ఇందులో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో ర్యాంకు ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అందుకోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
టీఎస్, ఏపీ ఎంసెట్ వివరాలు...
రెండు రాష్ట్రాల ఎంసెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతున్నాయి. పరీక్ష విధానం కూడా ఒకే విధంగా ఉంటోంది. ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్).. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా మూడు విభాగాల్లో పరీక్ష జరుగుతుంది. ఫిజిక్స్ నుంచి 40; మ్యాథమెటిక్స్ నుంచి 80; కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు చొప్పున మొత్తం 160 ప్రశ్నలకు ఉంటుంది. ఈ పరీక్ష సాధారణంగా మేలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్.. డిసెంబర్‌లో వెలువడే అవకాశముంది.
బిట్‌శాట్ :
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌ల పరంగా జేఈఈ మెయిన్ తర్వాత అత్యధిక శాతం మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్ష.. బిట్‌శాట్! ప్రతిష్టాత్మక బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్).. పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఇది.
పరీక్ష విధానం :
కంప్యూటర్ ఆధారితంగా జరిగే బిట్‌శాట్ నాలుగు విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలకు ఉంటుంది. ఫిజిక్స్(40 ప్రశ్నలు), కెమిస్ట్రీ(40 ప్రశ్నలు); ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ(15 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్(10 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్(45 ప్రశ్నలు) విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు.
బిట్‌శాట్-2019 సమాచారం...
అర్హత: ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 60 శాతం మార్కులతో మొత్తం 75 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత.
నోటిఫికేషన్ వెల్లడి: డిసెంబర్ మూడో వారంలో
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: మే రెండో వారం నుంచి చివరి వారం వరకు పలు స్లాట్లలో నిర్వహించే అవకాశం (అభ్యర్థులు తమకు అనుకూలమైన స్లాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు).
జేఈఈ అడ్వాన్స్‌డ్ :
ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్. ఈ పరీక్ష నిర్వహణను ఏటా ఒక ఐఐటీ చేపడుతుంది. 2019కి సంబంధించి ఈ ఎంట్రెన్స్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహించనుంది.
అర్హతలు:
10+2/ఇంటర్మీడియెట్‌తోపాటు జేఈఈ-మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన 2.24 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత లభిస్తుంది.
అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానం :
పరీక్ష ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు.. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానంలో ఏటా మార్పులు జరిగే అవకాశముంది. గత రెండేళ్లుగా ఒక్కో సబ్జెక్టు నుంచి 18 ప్రశ్నలు చొప్పున మొత్తం 54 ప్రశ్నలతో 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు.
జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2019 సమాచారం..
పరీక్ష తేదీ: మే 19, 2019.
ఆన్‌లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం.
ఇతర పరీక్షల వివరాలు...
ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ :
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఎస్‌ఆ ర్‌ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎస్‌ఆర్‌ఎం-జేఈఈఈ). ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో మూడు విభాగాల్లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ల్లో.. ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.
అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://applications.srmuniv.ac.in/
విటీ :
దేశంలోని మరో ప్రముఖ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్.. విట్ (వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ). ఈ ఇన్‌స్టిట్యూట్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (విటీ). ఈ పరీక్షలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. విటీ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. విటీకి దరఖాస్తు చేసుకునేందుకు
అర్హత : ఎంపీసీ గ్రూప్‌తో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.vit.ac.in/btechadmissions/viteee2019
మణిపాల్ అకాడమీ ఎంట్రన్స్ :
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్.. బీటెక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఎంయూఓఈటీ. మొత్తం నాలుగు విభాగాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అవి.. ఫిజిక్స్ (50 ప్రశ్నలు); కెమిస్ట్రీ(50 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్(50 ప్రశ్నలు); ఇంగ్లిష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు).
అర్హత: ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://manipal.edu/mu/admission.html
కేఎల్‌యూఈఈఈ :
ఏపీలోని డీమ్డ్ యూనివర్సిటీ.. కేల్ యూనివర్సిటీ.. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కేఎల్‌యూఈఈఈ. ఈ పరీక్ష ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ ఉంటుంది. పరీక్ష మూడు విభాగాల్లో (ఫిజిక్స్-40 ప్రశ్నలు; కెమిస్ట్రీ-40 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్-80 ప్రశ్నలు) ఉంటుంది. అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://kluniversity.in/admissions.aspx
విశాట్- 2019
ఏపీలోని డీమ్డ్ యూనివర్సిటీ... విజ్ఞాన్ యూనివర్సిటీలోని బీటెక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష విశాట్ (విజ్ఞాన్స్ స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్). ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు; ఫిజిక్స్-30 ప్రశ్నలు; కెమిస్ట్రీ-30 ప్రశ్నలు; ఇంగ్లిష్/ఆప్టిట్యూడ్ - 30 ప్రశ్నలు.
అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: vignan.ac.in/vsat
గీతం యూనివర్సిటీ జీఏటీ :
ఏపీలోని గీతం యూనివర్సిటీ.. బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష నాలుగు విభాగాల్లో ఉంటుంది. అవి.. మ్యాథమెటిక్స్ - 40 ప్రశ్నలు; ఫిజిక్స్ 30 ప్రశ్నలు; కెమిస్ట్రీ - 30 ప్రశ్నలు;

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://gat.gitam.edu/index.php

- అభ్యర్థులు ఆన్‌లైన్ టెస్ట్ తేదీలను పరిశీలించి తమకు అనుకూలమైన స్లాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

Published date : 27 Nov 2018 11:30AM