ఇంజినీరింగులో భవితకు భరోసా ఏది..?
Sakshi Education
రఘు.. బాగా చదువుతాడు. ఓ ప్రయివేటు బ్యాంకులో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్లు కష్టపడి పనిచేసి... మరో బహుళజాతి కంపెనీలో ట్రెజరీ విభాగంలో ఇంకాస్త మెరుగైన ఉద్యోగంలో చేరాడు. ఇంతకీ రఘు చదివిందేమిటో తెలుసా? ముందు ఇంజినీరింగ్... ఆ తరవాత ఎంబీఏ!!
శ్రీధర్.. ఓ టీవీ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా చేరాడు. మూడేళ్లు ఒకే ఛానెల్లో పనిచేయటంతో పాటు సమకాలీన అంశాలపై పట్టున్న వ్యక్తిగా పేరొచ్చింది. దీంతో మరో టాప్ ఛానెల్ నుంచి ఆఫరొచ్చింది. శ్రీధర్ కూడా చదివింది ఇంజినీరింగే. తరవాత యాంకరింగ్‌లో స్వల్పకాలిక కోర్సు చేశాడు.
విక్రమ్... ఓ మొబైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్. రెండేళ్లుగా బాగా పనిచేస్తుండటంతో ప్రమోషన్ వచ్చింది. తొలుత ఓ మొబైల్ రిటైల్ చైన్‌లో పని చేసిన అనుభవం విక్రమ్‌కు కలిసొచ్చింది. ఇంజినీరింగ్ చదివి... వేరే ఉద్యోగాలు రాకపోవటంతో ఈ రంగంలోకి వచ్చి... బాగానే స్థిరపడ్డాడు.
రఘు.. శ్రీధర్... విక్రమ్.. ఈ ముగ్గురిలో ఎవరికీ వారు చదివిన ఇంజినీరింగ్ వల్ల ఉద్యోగాలు రాలేదు. ఇంజినీరింగ్ తరవాత చదివిన కోర్సులో... చేసిన పనులో వాళ్లకి ఉపాధి చూపించాయి. మరి ఆ కోర్సులు చేయటానికి ఇంజినీరింగ్ అవసరం లేదు కదా? మామూలు డిగ్రీ చాలు కదా! ఎందుకు చేసినట్లు?
ఎందుకంటే... అదో మేనియా!! చదవడానికి మంచి కాలేజీలు లేకున్నా... చదివిన వారికి ఉద్యోగం రాకున్నా... ఏటేటా ఫీజులు పెంచేస్తున్నా... పిల్లలు ఇంజినీరింగే చదవాలనుకుంటున్నారు వారి తల్లిదండ్రులు!. అది కాకపోతే చేయడానికి ఇంకేం లేదనుకుంటున్నారు విద్యార్థులు. ఇది చూసి టాప్ కాలేజీలన్నీ... ఎంసెట్ పరీక్ష జరక్క ముందే మేనేజిమెంట్ సీట్లను బేరానికి పెట్టేస్తున్నాయి. ఫలితాలు రాకముందే సీట్లు అయిపోయాయని చెప్పేస్తున్నాయి. చేరాలనుకున్నవారు బతిమాలి బామాలి అడిగినదానికన్నా ఎక్కువే ఇచ్చి చేరుతారన్నది వారి ధీమా. పోనీ అడిగినంత ఇచ్చి సీటు కొని... ఇంజినీరింగ్ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వస్తుందా..? కెరీర్‌లో స్థిర పడతారా? అలాంటి గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే.. ఏడాదికి దేశం మొత్తమ్మీద 15 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టా పుచ్చుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 20 శాతం మంది... అంటే 3 లక్షల మంది మాత్రమే తగిన ఉద్యోగాల్లో చేరగలుగుతున్నారు. మిగిలిన 80 శాతం వేరే కోర్సుల్లో చేరటమో... సంబంధం లేని ఉద్యోగాలు చూసుకోవటమో... స్వయం ఉపాధి వెతుక్కోవటమో చేస్తున్నారు. అత్యధికులు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. విచిత్రమేంటంటే ఏటా బయటకు వస్తున్న 15 లక్షల మందిలో తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు 20 శాతం. రెండు రాష్ట్రాల్లో కలిసి 2.9 లక్షల ఇంజినీరింగ్ సీట్లుండగా దాదాపు 2.70 లక్షల వరకూ విద్యార్థులు చేరుతుండటం ఇంజినీరింగ్ పట్ల మనకున్న వేలం వెర్రికి నిదర్శనం.
తప్పంతా తల్లిదండ్రులదేనా?
భారతీయ వ్యవస్థలో ఈ మధ్య పెరిగిన ధోరణేమంటే... అబ్బాయైతే ఇంజినీర్! అమ్మాయైతే డాక్టర్!!. మెడికల్ సీట్లు తక్కువ కావటంతో అమ్మాయిలూ ఇటే వస్తున్నారు. ఈ ధోరణి మన తెలుగు రాష్ట్రాల్లో కాస్త అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉంది. ఇక్కడ ఐదో తరగతి పాసైన దగ్గర నుంచే... ఐఐటీ ఫౌండేషన్ మొదలవుతోంది. ఆరో తరగతితో చేరిన రోజు నుంచే పిల్లలు.. ఐఐటీలో సీటు కోసం తపస్సు మొదలెట్టాలి. లక్షలు ఖర్చుచేసి శిక్షణ తీసుకున్నా... చచ్చీచెడీ చదివినా జేఈఈ, ఎంసెట్‌లలో సరైన ర్యాంకు రానివారు ఎంతో మంది!! వారిని టాప్ కాలేజీల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఎంతైనా కుమ్మరిస్తున్నారు కూడా. అప్పు చేసైనా కట్టి తీరాలన్న ధోరణే ఇక్కడ అన్నిటికన్నా ప్రమాదకరం. మరో కోణంలో చూస్తే తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కని కెరీర్‌లో స్థిరపడటానికే ఇదంతా చేస్తున్నారనేది కాదనలేని నిజం. అది తప్పు కాదు కూడా!! కాకపోతే తల్లిదండ్రుల ఆలోచన ధోరణిని ‘క్యాష్’ చేసుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థలదీ దీంట్లో పెద్ద పాత్రే. ఇంజినీరింగ్ చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులను చూపిస్తూ... చదివితే ఆ స్థాయికి చేరుకోవచ్చంటూ అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లల బలహీనతతో ఆడుకోవటం స్పష్టంగా చూడొచ్చు.
అసలెందుకింత క్రేజ్?
ఇంజినీరింగ్‌కు ఇంత క్రేజ్‌ను తెచ్చింది సాఫ్ట్‌వేర్ రంగమే. సాఫ్ట్‌వేర్ బూమ్‌తో 1990వ దశాబ్దం, ఆ తర్వాతి కాలంలో ఇంజనీరింగ్ అత్యంత క్రేజీ కోర్సుగా మారింది. భారీ జీతాలు లభించే అవకాశం, విదేశాల్లో ఉద్యోగం, సమాజంలో గుర్తింపు అందరినీ ఇంజనీరింగ్ వైపు మళ్లించాయి. ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్ వార్తలు... లక్షల్లో ఎంఎన్‌సీ కంపెనీల్లో ప్యాకేజీలు.. ఓ విద్యార్థికి ఐఐటీల్లో 2 కోట్ల ప్యాకేజీ వచ్చిందంటూ.. వెలువడే వార్తలు.. ఇవన్నీ ఆ క్రేజ్‌ను తారస్థాయికి తీసుకెళ్లాయి. ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు మంచి సంబంధాలు, ఎక్కవ కట్నం వచ్చే దోరణి ప్రబలడం కూడా బీటెక్ చదువుల పట్ల క్రేజ్‌ను పెంచిందనే చెప్పాలి. ఇంజనీరింగ్, మెడికల్ కాకుండా.. వేరే కోర్సుల్లో చేరిన విద్యార్థులను అనామకులుగా, సగటు విద్యార్థులుగా పరిగణించే పరిస్థితి నెలకొనడంతో ఏదో ఒక కాలేజీలో బీటెక్‌లో చేరడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి పెరిగిపోయింది.
ఆర్థికంగా ఎంతో భారమైనా..!
తాజా అంచనాప్రకారం... దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి సగటున ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.80,000-90,000 ఖర్చవుతోంది. అంటే.. నాలుగేళ్లకు మూడున్నర లక్షలు అవుతుంది. అదే సంప్రదాయ బీఏ/బీఎస్సీ/బీకామ్ చదవడానికి సగటున ఏడాదికి రూ.6000-10,000 అవుతుందని ఓ అంచనా. అంటే.. డిగ్రీ కోర్సులతో పోల్చినప్పుడు ఇంజనీరింగ్ పూర్తిచేయడానికి ఎన్నో రెట్లు అధికంగా ఖర్చవుతోంది. అంతిమంగా ఫలితం చూస్తే... ఏదో కొంత మంది తప్ప అత్యధిక శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. లేదా చదువుకు సంబంధంలేని పని చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. నేషనల్ ఎంప్లాయబిలిటీ సర్వే ప్రకారం దేశంలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల్లో 80 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ పూర్తిచేసి ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్న వారి కథనాలు మనకు తెలిసిందే.
ఇంజినీరు కావాలనే కోరిక ఉంటే...
నిజానికి గతంలో ఇంజినీరు కావాలన్న కలను నెరవేర్చుకోవటానికి ఇంజినీరింగ్‌లో చేరేవారు. ఆటో మొబైల్ ఇండస్ట్రీలో రాణించాలనుకునేవారు మెకానికల్‌ను, నిర్మాణ రంగంపై ఇష్టమున్న వారు సివిల్‌ను, ఎలక్ట్రానిక్స్‌పై మక్కువ ఉన్నవారు ఈఈఈ... ఇలా రంగాన్ని బట్టి బ్రాంచ్‌ను ఎంచుకునే వారు. కానీ ఇపుడు ఇంజినీరింగ్‌లో చేరుతున్న వారిలో అత్యధికులకు తాము ఎంచుకున్న బ్రాంచ్‌కు భవిష్యత్తులో ఉన్న అవకాశాలపై ఏమాత్రం అవగాహన లేదన్నది నిపుణుల మాట. దానికి తగ్గ నైపుణ్యాలను అలవాటు చేసుకోవాలనే ఆసక్తి కూడా వారిలో లేదు. ఇంజినీరింగ్ పూర్తయితే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది కదా!! అనే ఆలోచన ఒక్కటే వారిని ఆ కోర్సులో చేరేలా చేస్తోంది. చాలా మంది తెలివైన విద్యార్థులు సైతం ఈ కోర్సు పూర్తికాగానే సివిల్స్, గ్రూప్స్, రైల్వేలు, బ్యాంక్స్ ఉద్యోగాల కోచింగ్ సెంటర్లలో చేరిపోతున్నారు. వాస్తవానికి ఈ ఉద్యోగాలు పొందేందుకు లక్షలు ఖర్చు చేసి నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదవాల్సిన పనిలేదు. తక్కువ ఖర్చుతో మూడేళ్లలోనే పూర్తయ్యే సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ/బీఎస్సీ/ బీకామ్/ బీబీఎం వంటివేవైనా చాలు. వాటితోనే ఐఏఎస్,ఐపీఎస్, గ్రూప్-1, పీవో వంటి ఉద్యోగాలు కొట్టొచ్చు కూడా!!. కానీ ఇప్పుడు ప్రభుత్వ నియామక పరీక్షల్లో ప్రతి పరీక్షకూ దరఖాస్తు చేసుకుంటున్న వారిలో సగటున 50 శాతానికిపైగా బీటెక్ విద్యార్థులే. చివరకు.. క్లర్కులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోలీస్ కానిస్టేబుల్, వీఏఓ, అటెండర్ వంటి పోస్ట్‌లకూ బీటెక్ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయిలో రైల్వేలు, బ్యాంకుల్లో గ్రూప్-డి, క్లరికర్ కేడర్ పోస్ట్‌ల కోసం కూడా లక్షల సంఖ్యలో బీటెక్ విద్యార్థుల దరఖాస్తు చేస్తున్నారు.
విదేశాల్లో ఇలా లేదు మరి...
మన దేశంలో ఏం కావలనుకున్నా... ముందుగా ఇంజనీరింగ్ పట్టా పొందాలి.. లేకుంటే... సమాజంలో ఏమాత్రం విలువ ఉండదు. ముందు ఇంజనీరింగ్ పాసయిన తర్వాతే ఏదైనా...! ఇది దేశంలో పాతుకుపోయిన ధోరణి!! అందుకే భారత దేశం ఏటా 15 లక్షల మంది ఇంజనీర్లను తయారు చేస్తోంది. అదే నోబెల్ బహుమతి గ్రహీతలకు పుట్టినిల్లు అయిన అమెరికాలో కేవలం 90వేల మంది ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్నారు.. మన పక్కనే ఉండి తన ఎలక్ట్రానిక్స్, తయారీ పరికరాలతో ప్రపంచ మార్కెట్లను ముంచెత్తుతున్న జన చైనాలోనూ ఏటా 7లక్షల మందే ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు.
20 శాతం మందికే స్కిల్స్
మరోవైపు బీటెక్ పూర్తయిన విద్యార్థుల్లో 20 శాతం మందికి కూడా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండట్లేదు. కారణం.. ఎలాంటి కనీస ల్యాబ్‌లు, సౌకర్యాలు లేకుండా ఏర్పాటైన కాలేజీలు. అలాంటి కాలేజీల్లో చదివిన విద్యార్థులు బీటెక్ పట్టా అయితే పొందుతున్నారు కాని...జాబ్ మార్కెట్‌కు తగ్గ నైపుణ్యాలు అలవడటం లేదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్లు చేజిక్కించుకున్న విద్యార్థులు కూడా టాప్10, 20 మహా అయితే టాప్50 జాబితాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో చదివిన విద్యార్థులే. మిగతా కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసుకున్న వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది అంటూ నిరంతరం పలు సర్వేలు, విద్యావేత్తలు, ఇండస్ట్రీ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు.
దేశవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలతో బయటకు వస్తుంటే... వీరిలో అతికష్టం మీద ఉద్యోగాలు లభించేది కేవలం 3 లక్షల మందికే! అంటే...ఏటా 12 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్న పరిస్థితి!!
తెలంగాణ :
2018-19లో తెలంగాణ రాష్ట్రంలో 228 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,14,117 సీట్లకు ఏఐసీటీఈ అనుమతిచ్చింది. గతేడాది 242 కాలేజీల్లో 1,24,239 సీట్లుండేవి. అంటే... ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 10,122 ఇంజనీరింగ్ సీట్లలో కొతపడింది.
ఆంధ్రప్రదేశ్ :
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ ఎంసెట్ 2017 కౌన్సెలింగ్‌లో 319 ఇంజనీరింగ్ కాలేజీల్లో...మొత్తం 1,65,793 సీట్లుండగా... 20 శాతానికి పైగా సీట్లు భర్తీ కానీ వైనం!!

- ఏటా 15 లక్షల మందికి ఇంజనీరింగ్ పట్టాలు
- వీరిలో 80 శాతం మందికి ఉద్యోగాల్లేవ్
- దీంతో ఇంజినీరింగ్ చదివాక ఇతరత్రా కోర్సుల్లోకి
- కొందరేమో స్వయం ఉపాధి ప్రయత్నాలు
- మామూలు డిగ్రీతో దొరికే ఉద్యోగాల్లోనే అత్యధికులు
- అయినా సరే... ఇంజినీరింగ్‌కే తల్లిదండ్రులు, పిల్లల ఓటు
- వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్న కాలేజీలు
- ఆరో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్‌తో ఆశల వ ల
- ఆ వలలో చిక్కి అవతలి వైపు చూడలేకపోతున్న తీరు.
- సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థి.. మ్యూజిక్ కోర్సులో చేరుతాడు.
- పెయింటింగ్‌పై ఇష్టముంటే... ఫైన్ ఆర్‌ట్సను ఎంచుకుంటాడు.
- ఫోటోగ్రఫీపై అభిరుచి ఉంటే.. ఫోటీగ్రఫీ కోర్సులో చేరతాడు
- స్టోరీలు రాయాలనుకుంటే.. ఏ బీఏ లిటరేచర్ కోర్సో పూర్తి చేస్తాడు.
- సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థి.. ఇంజనీర్ అవుతాడు.
- పెయింటింగ్‌పై ఇష్టమున్నా... ఇంజనీరింగే చదువుతాడు.
- ఫోటోగ్రఫీపై అభిరుచి ఉంటే.. ఇంజనీరింగ్‌లోనే చేరతాడు.
- ఓ మంచి రచయిత కావాలనుకున్నా... ఇంజనీరింగ్ కాలేజీకే వెళతాడు.
- గత ఏడాది యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో.. కోర్ ఇంజనీరింగ్‌లో కేవలం ఏడు శాతం మందికే ఎంప్లాయబిలిటీ స్కిల్స్.
- సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో ఈ సంఖ్య మూడు శాతం మాత్రమే.
- టైర్ 2, 3, 4 కళాశాలలకు చెందిన విద్యార్థుల్లో ఒకే ఒక్క శాతం విద్యార్థుల్లో జాబ్ రెడీ స్కిల్స్
- సంస్థలు తమ అవసరాలకు తగినట్లుగా శిక్షణనిచ్చినా వాటిని అందుకోలేని వారి సంఖ్య 62 శాతం.
- ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న విద్యార్థుల సంఖ్య 20 శాతం మాత్రమే.
- ఈ స్కిల్స్ లోపం కారణంగానే నాన్‌టెక్నికల్ జాబ్స్ వైపు దృష్టి సారిస్తున్నారని స్పష్టం చేసిన నివేదిక
Published date : 08 May 2018 03:47PM