ఇంగ్లిష్ మీడియంతో..భవిష్యత్తులో ప్రయోజనాలెన్నో...
Sakshi Education
సివిల్స్ నుంచి గ్రూప్స్ వరకూ... ఏ సర్కారీ కొలువు కావాలన్నా... ఐటీ నుంచి బ్యాంకింగ్ వరకూ.. ఏ రంగంలో ఉద్యోగం రావాలన్నా... ఇంగ్లిష్ నైపుణ్యాలు తప్పనిసరిగా మారాయి. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా, విదేశాల్లో విద్యా, ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలన్నా... ఇంగ్లిష్నైపుణ్యం లేకపోవడం పెద్ద ఆటంకంగా మారుతోంది!! ఫలితంగా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలన్నీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారికే వరిస్తున్నాయి. ఒక స్థాయి దాటాక ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ ఒంట బట్టకపోవడం.. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ చదువులు చదివిన వారితో పోటీపడలేక కుంగిపోవడం..! ఇలాంటి పరిస్థితుల్లో.. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ ఆవశ్యకత గురించి తెలుసుకుందాం...
కంప్యూటర్, సైన్స్, మ్యాథ్స్ భాష... ఇంగ్లిష్. ఇంజనీరింగ్, మెడికల్‌లో రాణించాలంటే... ఇంగ్లిష్! మేనేజ్‌మెంట్ రంగంలో దూసుకుపోవాలన్నా... ఇంగ్లిష్. ఐటీ రంగంలో కొలువు కొట్టాలంటే... ఇంగ్లిష్.
సివిల్స్‌లో రాణించాలంటే... ఇంగ్లిష్. విదేశీ విద్యకు వెళ్లాలంటే... ఇంగ్లిష్!
పరిశోధనల్లో సత్తా చూపాలంటే... ఇంగ్లిష్ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టు రావాలన్నా... ఇంగ్లిష్!
ప్రత్యక్ష నిదర్శనాలెన్నో..!
అడుగడుగునా ఆటంకాలే!
ఇంగ్లిష్ రాకపోతే అడుగడుగునా ఆటంకాలే. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్.. ఇలా ఏ కోర్సులో ప్రవేశం పొందాలన్నా.. చేరిన కోర్సులో రాణించాలన్నా.. ఇంగ్లిష్ రాకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఎంతో కష్టపడి చదివి ఎంట్రెన్స్ టెస్టులో ర్యాంకు సాధించి... టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాక... ఇంగ్లిష్‌లో ఉన్న సబ్జెక్టులను అర్థం చేసుకోలేక.. ఇంగ్లిష్ మీడియంలో చదువుకొని వచ్చిన వారితో పోటీపడలేక.. ఆత్మన్యూనతకు (ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్) గురై మధ్యలోనే కోర్సును మానేస్తున్న విద్యార్థులు ఎంతో మంది! రెండేళ్ల క్రితం యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లుగా పేర్కొనే ఐఐటీల్లో బీటెక్ చదివిన విద్యార్థుల్లో సైతం ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్ లేవని తేలడం విస్మయం కలిగించింది. కారణం... స్కూల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదవకపోవడమే! అంతేకాదు.. పదోతరగతి, ఇంటర్ వరకూ టాప్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సైతం ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరాక.. ఇంగ్లిష్‌లో ఉన్న ఆయా సబ్జెక్టులకు భయపడి ఏకంగా చదువుపైనే ఆసక్తి కోల్పోతున్నారు.
పాఠశాల స్థాయిలోనే పునాది..
నేటి ప్రపంచీకరణ యుగంలో ఇంగ్లిష్ లేకుంటే అడుగు బయటపెట్టలేని పరిస్థితి. ఇంగ్లిష్ రాకుంటే.. ఎన్ని నైపుణ్యాలున్నా వృథానే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?! చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ను నేర్పించాలి, అందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలి.. అంటున్నారు నిపుణులు. అందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా.. పేద, ధనిక అనే తారతమ్యం చూపకుండా... ప్రతి ఒక్కరికీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. తద్వారా భావి పౌరుల చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేసినట్లు అవుతుందంటున్నారు. మరోవైపు ప్రైవేటులో అధికశాతం ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఉంటున్నాయి. తమ పిల్లలను వీటిలో చేర్పిస్తే ఇంగ్లిష్‌లో చదువుకొని.. భవిష్యత్‌లో ఉన్నత స్థానాలు అందుకుంటారనే ఆశతో తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. మారుమూల గ్రామంలో నివశించే పేదలు సైతం తమకు సమీపంలో ఉన్న పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. ఆయా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టి అప్పులపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తే.. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి ఇంగ్లిష్ మీడియం చదువులు, ఇంగ్లిష్ నైపుణ్యాలు లభిస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
బడిలో నేర్చుకుంటేనే భవిష్యత్తు..
పలు అధ్యయనాల ప్రకారం-పాఠశాల స్థాయిలో నేర్చుకున్న భాష జీవితాంతం వెన్నంటి ఉంటుంది. ఎందుకంటే... ఆ వయసులో పిల్లల్లో గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ కౌన్సిల్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు నిర్వహించిన అధ్యయనంలో సైతం ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. కాబట్టి ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేలా పాఠశాల స్థాయిలోనే బలమైన పునాదులు వేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ఎంహెచ్‌ఆర్‌డీ విడుదల చేసిన నూతన విద్యా విధానం ముసాయిదాలో సైతం పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ బోధన ప్రాధాన్యం, ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
‘ఇంగ్లిష్’లోకి మారుతున్న దేశాలు :
అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌కు నెలకొన్న ప్రాధాన్యతను గుర్తించిన పలు దేశాలు ఇప్పుడు.. తమ జాతీయ భాషతో సంబంధం లేకుండా ఇంగ్లిష్ మీడియానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. మన పొరుగునే ఉన్న చైనా.. ప్రపంచీకరణ, మారుతున్న కార్పొరేట్ అవసరాలను గుర్తించి.. నాలుగేళ్ల క్రితమే ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించింది. ఫలితంగా ఇప్పుడు ఆ దేశం అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య పరంగా పలు దేశాలతో పోటీ పడుతోంది. అంతేకాకుండా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ... ఏ దేశ యూనివర్సిటీల్లో చూసినా... సింహభాగం చైనా విద్యార్థులే! చైనాతోపాటు జర్మనీ, కొరియా, జపాన్ తదితర దేశాలు సైతం ఇంగ్లిష్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు.
కమ్యూనికేషన్... ఆటోమేషన్ :
గత మూడు, నాలుగేళ్లుగా ఆటోమేషన్, ఐఓటీ విస్తృతి పెరుగుతోంది. నేటి ఆటోమేషన్ యుగంలో కొలువు సొంతం చేసుకోవాలంటే.. కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి. సంస్థలు ఓ వైపు డొమైన్ నాలెడ్జ్‌కు పెద్ద పీట వేస్తూనే.. మరోవైపు కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి అంటున్నాయి. కంపెనీలు ప్లేస్‌మెంట్స్ సమయంలో అభ్యర్థుల్లోని కమ్యూనికేషన్ స్కిల్స్‌కు 40శాతం మేర వెయిటేజీ ఇస్తున్నట్లు గతేడాది ఇండియా స్కిల్ రిపోర్ట్ అధ్యయనంలో వెల్లడైంది. ఇంగ్లిష్‌లో బెరుకు లేకుండా ప్రభావ వంతంగా మాట్లాడటాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్‌గా సంస్థలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీల ఎంపిక ప్రక్రియల్లో ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేక లక్షల మంది విద్యార్థులు అవకాశాలు అందుకోలేకపోతున్నారు.
పోటీ పరీక్షల్లో సైతం..
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నా.. ఇంగ్లిష్ కీలకంగా మారింది. యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలు మొదలు.. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఐఐఎంల్లో ప్రవేశానికి జరిపే క్యాట్.. ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షల దాకా... ఇంగ్లిష్ మీడియం ఆవశ్యకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయా పరీక్షల్లో ప్రశ్నలు ఇంగ్లిష్‌లో ఉంటాయి. సమాధానాలు ఇచ్చే క్రమంలో.. ఇంగ్లిష్ మీడియంలో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవడం సైతం విజయ సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సివిల్స్, క్యాట్, జేఈఈ తదితర పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఉపయోగపడే ప్రామాణిక పుస్తకాలన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఇంగ్లిష్‌పై పట్టు ఉంటేనే ఆయా పుస్తకాలను చదివి కాన్సెప్ట్‌లపై స్పష్టత పొందడం సాధ్యమవుతుంది. ప్రధాన పరీక్షల్లో విజేతల నేపథ్యం చూసినా... ఎక్కువ శాతం మంది పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారే కావడం గమనార్హం.
ఇంగ్లిష్ బోధన కోర్సులు..
పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం బోధన అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉపాధ్యాయ విద్యలోనూ ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇఫ్లూ, ఇగ్నో, హెచ్‌సీయూ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో పీజీ, పీజీ డిప్లొమా స్థాయిలో ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఇంగ్లిష్ మీడియంలో బోధించే మెళకువలను ఈ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఆయా కోర్సుల కరిక్యులంను రూపొందిస్తున్నాయి.
ఇంగ్లిష్ .. ముఖ్యాంశాలు

- వికాస్.. ఇంటర్ వరకూ తెలుగు మీడియం. ఆ తర్వాత బీటెక్(సీఎస్‌ఈ) పూర్తి చేశాడు. అకడమిక్‌గా టాప్ గ్రేడ్. ఉద్యోగ సాధనలో భాగంగా ఓ ప్రముఖ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని పిలుపు వచ్చింది. ఎంతో ఆనందంగా వెళ్లాడు. కానీ.. అక్కడ అంతా ఇంగ్లిష్‌లోనే! గ్రూప్ డిస్కషన్‌లో, ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను స్పష్టంగా, అనర్గళంగా చెప్పలేక అవకాశం కోల్పోయాడు.
- సూరజ్.. పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాడు. భవిష్యత్తులో ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో... ఓ ప్రముఖ విద్యా సంస్థలో ఇంటర్‌లో ఇంగ్లిష్ మీడియంలో చేరాడు. కానీ.. అక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా ముఖ్య సబ్జెక్టుల బోధన పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో జరిగేది. లెక్చరర్‌లు చెప్పేది అర్థం కాక...పదో తరగతి వరకు టాప్ స్టూడెంట్‌గా ఉన్న సూరజ్.. ఇంటర్‌లో యావరేజ్ స్టూడెంట్‌గా మారాడు. కారణం.. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫౌండేషన్ సరిగా లేకపోవడమే.
- రమేశ్.. ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఒక కీలకమైన ప్రాజెక్ట్‌లో టీమ్ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. ఓ రోజు అనుకోకుండా అమెరికాకు చెందిన క్లయింట్‌తో మాట్లాడాల్సి వచ్చింది. ఆ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లిష్‌లోనే. కానీ.. రమేశ్ ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్ అంతంత మాత్రమే. దాంతో క్లయింట్‌కు విషయాన్ని సరిగా వివరించలేకపోయాడు. అమెరికా క్లయింట్ మాట్లాడిన ఇంగ్లిష్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఫలితంగా క్లయింట్ సంస్థ నుంచి రమేశ్ పని చేస్తున్న కంపెనీ యజమానికి ఫిర్యాదు వెళ్లింది. ఆ తర్వాత రమేశ్ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావం పడింది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత ముఖ్యమో చెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనాలు ఇవి! ఈ ముగ్గురే కాదు. పాఠశాల స్థాయిలో తెలుగు మీడియంలో చదివిన వారిలో అత్యధిక శాతం మంది పరిస్థితి ఇదే!!
అడుగడుగునా ఆటంకాలే!
ఇంగ్లిష్ రాకపోతే అడుగడుగునా ఆటంకాలే. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్.. ఇలా ఏ కోర్సులో ప్రవేశం పొందాలన్నా.. చేరిన కోర్సులో రాణించాలన్నా.. ఇంగ్లిష్ రాకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఎంతో కష్టపడి చదివి ఎంట్రెన్స్ టెస్టులో ర్యాంకు సాధించి... టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాక... ఇంగ్లిష్‌లో ఉన్న సబ్జెక్టులను అర్థం చేసుకోలేక.. ఇంగ్లిష్ మీడియంలో చదువుకొని వచ్చిన వారితో పోటీపడలేక.. ఆత్మన్యూనతకు (ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్) గురై మధ్యలోనే కోర్సును మానేస్తున్న విద్యార్థులు ఎంతో మంది! రెండేళ్ల క్రితం యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లుగా పేర్కొనే ఐఐటీల్లో బీటెక్ చదివిన విద్యార్థుల్లో సైతం ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్ లేవని తేలడం విస్మయం కలిగించింది. కారణం... స్కూల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదవకపోవడమే! అంతేకాదు.. పదోతరగతి, ఇంటర్ వరకూ టాప్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సైతం ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరాక.. ఇంగ్లిష్‌లో ఉన్న ఆయా సబ్జెక్టులకు భయపడి ఏకంగా చదువుపైనే ఆసక్తి కోల్పోతున్నారు.
పాఠశాల స్థాయిలోనే పునాది..
నేటి ప్రపంచీకరణ యుగంలో ఇంగ్లిష్ లేకుంటే అడుగు బయటపెట్టలేని పరిస్థితి. ఇంగ్లిష్ రాకుంటే.. ఎన్ని నైపుణ్యాలున్నా వృథానే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?! చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ను నేర్పించాలి, అందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలి.. అంటున్నారు నిపుణులు. అందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా.. పేద, ధనిక అనే తారతమ్యం చూపకుండా... ప్రతి ఒక్కరికీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. తద్వారా భావి పౌరుల చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేసినట్లు అవుతుందంటున్నారు. మరోవైపు ప్రైవేటులో అధికశాతం ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఉంటున్నాయి. తమ పిల్లలను వీటిలో చేర్పిస్తే ఇంగ్లిష్‌లో చదువుకొని.. భవిష్యత్‌లో ఉన్నత స్థానాలు అందుకుంటారనే ఆశతో తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. మారుమూల గ్రామంలో నివశించే పేదలు సైతం తమకు సమీపంలో ఉన్న పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. ఆయా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టి అప్పులపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తే.. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి ఇంగ్లిష్ మీడియం చదువులు, ఇంగ్లిష్ నైపుణ్యాలు లభిస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
బడిలో నేర్చుకుంటేనే భవిష్యత్తు..
పలు అధ్యయనాల ప్రకారం-పాఠశాల స్థాయిలో నేర్చుకున్న భాష జీవితాంతం వెన్నంటి ఉంటుంది. ఎందుకంటే... ఆ వయసులో పిల్లల్లో గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ కౌన్సిల్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు నిర్వహించిన అధ్యయనంలో సైతం ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. కాబట్టి ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేలా పాఠశాల స్థాయిలోనే బలమైన పునాదులు వేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ఎంహెచ్‌ఆర్‌డీ విడుదల చేసిన నూతన విద్యా విధానం ముసాయిదాలో సైతం పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ బోధన ప్రాధాన్యం, ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
‘ఇంగ్లిష్’లోకి మారుతున్న దేశాలు :
అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌కు నెలకొన్న ప్రాధాన్యతను గుర్తించిన పలు దేశాలు ఇప్పుడు.. తమ జాతీయ భాషతో సంబంధం లేకుండా ఇంగ్లిష్ మీడియానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. మన పొరుగునే ఉన్న చైనా.. ప్రపంచీకరణ, మారుతున్న కార్పొరేట్ అవసరాలను గుర్తించి.. నాలుగేళ్ల క్రితమే ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించింది. ఫలితంగా ఇప్పుడు ఆ దేశం అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య పరంగా పలు దేశాలతో పోటీ పడుతోంది. అంతేకాకుండా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ... ఏ దేశ యూనివర్సిటీల్లో చూసినా... సింహభాగం చైనా విద్యార్థులే! చైనాతోపాటు జర్మనీ, కొరియా, జపాన్ తదితర దేశాలు సైతం ఇంగ్లిష్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు.
కమ్యూనికేషన్... ఆటోమేషన్ :
గత మూడు, నాలుగేళ్లుగా ఆటోమేషన్, ఐఓటీ విస్తృతి పెరుగుతోంది. నేటి ఆటోమేషన్ యుగంలో కొలువు సొంతం చేసుకోవాలంటే.. కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి. సంస్థలు ఓ వైపు డొమైన్ నాలెడ్జ్‌కు పెద్ద పీట వేస్తూనే.. మరోవైపు కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి అంటున్నాయి. కంపెనీలు ప్లేస్‌మెంట్స్ సమయంలో అభ్యర్థుల్లోని కమ్యూనికేషన్ స్కిల్స్‌కు 40శాతం మేర వెయిటేజీ ఇస్తున్నట్లు గతేడాది ఇండియా స్కిల్ రిపోర్ట్ అధ్యయనంలో వెల్లడైంది. ఇంగ్లిష్‌లో బెరుకు లేకుండా ప్రభావ వంతంగా మాట్లాడటాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్‌గా సంస్థలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీల ఎంపిక ప్రక్రియల్లో ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేక లక్షల మంది విద్యార్థులు అవకాశాలు అందుకోలేకపోతున్నారు.
పోటీ పరీక్షల్లో సైతం..
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నా.. ఇంగ్లిష్ కీలకంగా మారింది. యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలు మొదలు.. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఐఐఎంల్లో ప్రవేశానికి జరిపే క్యాట్.. ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షల దాకా... ఇంగ్లిష్ మీడియం ఆవశ్యకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయా పరీక్షల్లో ప్రశ్నలు ఇంగ్లిష్‌లో ఉంటాయి. సమాధానాలు ఇచ్చే క్రమంలో.. ఇంగ్లిష్ మీడియంలో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవడం సైతం విజయ సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సివిల్స్, క్యాట్, జేఈఈ తదితర పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఉపయోగపడే ప్రామాణిక పుస్తకాలన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఇంగ్లిష్‌పై పట్టు ఉంటేనే ఆయా పుస్తకాలను చదివి కాన్సెప్ట్‌లపై స్పష్టత పొందడం సాధ్యమవుతుంది. ప్రధాన పరీక్షల్లో విజేతల నేపథ్యం చూసినా... ఎక్కువ శాతం మంది పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారే కావడం గమనార్హం.
ఇంగ్లిష్ బోధన కోర్సులు..
పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం బోధన అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉపాధ్యాయ విద్యలోనూ ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇఫ్లూ, ఇగ్నో, హెచ్‌సీయూ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో పీజీ, పీజీ డిప్లొమా స్థాయిలో ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఇంగ్లిష్ మీడియంలో బోధించే మెళకువలను ఈ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఆయా కోర్సుల కరిక్యులంను రూపొందిస్తున్నాయి.
ఇంగ్లిష్ .. ముఖ్యాంశాలు
- నియామకాల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌కు 40 శాతం మేర ప్రాధాన్యం.
- ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థుల్లో సైతం ఇంగ్లిష్ నైపుణ్యాలులేక ఇబ్బందులు.
- కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం- నియామకాల్లో ఇంగ్లిష్ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తామని 90 శాతం సంస్థల వెల్లడి.
- ఇండియా స్కిల్ రిపోర్ట్-2019 ప్రకారం- నియామకాల పరంగా టాప్-3 స్కిల్స్‌లో నిలిచిన ఇంగ్లిష్ నైపుణ్యం.
- పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం చదివిన వారికి పోటీ పరీక్షల్లో నూటికి 80 శాతం విజయం.
- ఉన్నత విద్య, ఉద్యోగ నియామక పరీక్షల విజేతల్లో నూటికి 60 శాతం మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే.
ఇంగ్లిష్‌తోనే విజయం : భవిష్యత్తులో జాబ్ మార్కెట్‌లో పోటీలో నిలదొక్కుకోవడానికి ఇంగ్లిష్ భాష నైపుణ్యం కీలకంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి ఉద్యోగమైనా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే పోటీలో ముందంజలో నిలిచేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా విద్యార్థులను ఇప్పటి నుంచే తీర్చిదిద్దాలి. ప్రాథమిక స్థాయి నుంచే ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మరింత సత్ఫలితాలు ఉంటాయి. - ప్రొఫెసర్ ఇ.సురేశ్ కుమార్, వైస్ ఛాన్స్‌లర్, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) |
బోధన సులువుగా.. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం బోధిస్తే పిల్లలు అర్థం చేసుకోగలరా..? అని సందేహించాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ బోధనకు ఇప్పుడు పలు సులువైన మార్గాలు ఉన్నాయి. ఇంగ్లిష్‌లో యాక్టివిటీ బేస్డ్ టీచింగ్- లెర్నింగ్ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగిస్తూ బోధిస్తే పిల్లలు సులువుగా అర్థం చేసుకోగలరు. - నవమీత ముఖర్జీ, మేనేజర్, టీచ్ ఫర్ ఇండియా |
ఆత్మన్యూనతకు కారణమిదే.. ఇంగ్లిష్ రాకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల పరంగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో పోల్చుకొని ఆత్మన్యూనతకు (ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్) గురవుతున్నారు. ఫలితంగా ఉజ్వల అవకాశాలను కోల్పోతున్నారు. దీనికి పరిష్కారంగా పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంను అమలు చేయాలి. తద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయి. - మంజులా రావు, డెరైక్టర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ, బ్రిటిష్ కౌన్సిల్ |
Published date : 27 Nov 2019 12:32PM