ఈ ఏడాది మీరు పదో తరగతి చదువుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Sakshi Education
పదోతరగతి..కెరీర్‌లో అత్యంత కీలకమైన ఘట్టం! టెన్త్‌క్లాస్‌లో చూపిన ప్రతిభ ఆధారంగానే భవిష్యత్తుకు పునాది పడుతుంది! కొవిడ్ మహమ్మారి కారణంగా.. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు పాఠాలను ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే వింటున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో తరగతులు జరిగినా.. పదోతరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రం ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తామని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి!
దాంతో ఆన్‌లైన్‌లో కొద్దిపాటి సమయంలో విన్న తరగతులకు సంబంధించి.. ఆఫ్‌లైన్‌లో పూర్తిస్థాయిలో పరీక్షలకు సంసిద్ధం కాగలమా?! అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. నిర్దిష్ట ప్రణాళికను అనుసరిస్తూ.. ప్రిపరేషన్ కొనసాగిస్తే.. పరీక్షల్లో ప్రతిభ చూపొచ్చని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆన్‌లైన్ తరగతులు వింటున్న పదో తరగతి విద్యార్థులు.. ఏప్రిల్‌లో ఆఫ్‌లైన్ విధానంలో జరిగే వార్షిక పరీక్షల్లో రాణించేందుకు నిపుణుల సలహాలు...
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదిహేను లక్షల మంది పదోతరగతి చదువుతున్నారు. సీబీఎస్‌ఈ బోర్డ్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాసే వారి సంఖ్య మరో రెండు లక్షల వరకూ ఉంటోంది. ఈ విద్యార్థులంతా కొవిడ్ కారణంగా పాఠశాలలకు వెళ్లలేక.. ఆన్‌లైన్‌లోనే తరగతులు వింటున్నారు. వార్షిక పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని అధికార వర్గాల స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ చదువుల ద్వారా పరీక్షల్లో సమర్థవంతంగా సమాధానాలు రాయగలమా? మంచి మార్కులు సాధించడం ఎలా?అనే సందేహం విద్యార్థుల్లో తలెత్తుతోంది. నోట్స్ రాసుకోవడం, స్వీయ సన్నద్ధత ద్వారా ఈ సమస్యను సులువుగానే అధిగ మించొచ్చు అనేది సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం.
నోట్స్, అసైన్‌మెంట్స్..
పదో తరగతి విద్యార్థులు..ఆన్‌లైన్ తరగతులు వింటున్నప్పుడే ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాం శాలను నోట్స్‌లో రాసుకోవాలి. వాటికి సంబం ధించిన అన్ని అసైన్‌మెంట్స్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. టీచర్‌లను సంప్రదించి కరక్షన్‌స చేసు కోవాలి. ఆన్‌లైన్ విధానంలో ముఖాముఖి బోధ నకు అవకాశం ఉండదు. కాబట్టి విద్యార్థులు తాము క్లిష్టమైనవిగా భావించే పాఠాలను పదేపదే చద వాలి. ఫలితంగా సదరు సబ్జెక్ట్‌లపై మంచి పట్టు, మెరుగైన అవగాహన సొంతమవుతుంది.
స్వీయ సన్నద్ధతే సాధనం..
ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు.. స్వీయ సన్నద్ధతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే..ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి సొంతంగా ప్రిపరేషన్ సాగించే ప్రయత్నం చేయాలి. ఆన్‌లైన్ తరగతుల విషయంలో నిర్దిష్ట క్యాలెండర్ విధానం అమలవుతోంది. దీనికి అనుగుణంగా ప్రతిరోజు కోర్స్ వర్క్‌కు సంబం దించి.. పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను సొం తంగా అధ్యయనం చేయాలి. అదే విధంగా ప్రతి సబ్జెక్ట్‌లోనూ, ప్రతి చాప్టర్ చివరన ఉండే ప్రాక్టీస్ ప్రశ్నలకు సమాధానాలు సాధన చేయాలి. వాటిని టీచర్లను సంప్రదించి మూ ల్యాంకన చేయిం చుకోవాలి. తద్వారా విద్యార్థికి తన ప్రిపరేషన్ స్థాయిపై అవగాహన వస్తుంది.
సందేహాల నివృత్తి..
విద్యార్థులు.. సదరు ఆన్‌లైన్ తరగతులు పూర్త య్యాక దానికి సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు కలిగే సందేహాలను ఎప్పటి కప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే టీచర్లను సంప్రదించాలి.
మ్యాథమెటిక్స్, సైన్స్..
ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు.. మ్యాథమెటిక్స్,సైన్స్ సబ్జెక్ట్‌ల విషయంలో మరింత ఎక్కువగా శ్రద్ధ చూపాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ఆయా టాపిక్స్ ప్రాథమిక భావనల ఆధారంగా పాఠ్య పుస్తకాల్లోని సమస్యలను సాధన చేయడం అలవర్చుకోవాలి. సైన్స్ విషయానికొస్తే.. బయాలజీ, ఫిజికల్ సైన్స్‌లకు సంబంధించి ముఖ్యమైన సూత్రాలు, డయాగ్రమ్స్‌లను ప్రాక్టీస్ చేయాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల విషయంలో కూడా వ్యాకరణాలు, వాటి వాడుకకు సంబంధించి బోర్డ్ పాఠ్య పుస్తకాల ఆధారంగా.. స్వీయ ప్రిపరేషన్ సాగించాలి.
ఇంకా చదవండి: part 2: ఆన్‌లైన్ తరగతులతో పాటు వీటిపై కూడా దృష్టి పెడ్తే పదో తరగతిలో విజయం సులువే..

Published date : 03 Dec 2020 02:37PM