Skip to main content

ఎర్లీ ఎగ్జిట్ అయిన వారికి బీఎస్సీ డిగ్రీకి అవకాశం?

ఐఐటీల్లో బీటెక్‌లో చేరి అకడమిక్‌గా రాణించలేకపోతున్న విద్యార్థులకు మూడో సంవత్సరంలోనే ఎర్లీ ఎగ్జిట్ పేరుతో అవకాశం కల్పిస్తూ.. వారికి బీఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలనే విషయంపై చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.
ఒత్తిడి వద్దు..
ఐఐటీల్లో చేరే విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్న మాట వాస్తవమే. దీనికి ఐఐటీలు సమస్య కాదు. ఇంటర్ వరకు చదివిన వాతావరణానికి భిన్నంగా ఐఐటీల్లో పరిస్థితులు, కరిక్యులం ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్లే విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. కేవలం ఒత్తిడి కారణంగా డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయనడం సరికాదు ఇటీవల కాలంలో ఐఐటీలు విద్యార్థులకు అందిస్తున్న కౌన్సెలింగ్ సదుపాయం ఫలితంగా డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గుతోంది.

గేట్ అభ్యర్థులకు సలహా..
గేట్ ద్వారా ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో చేరే అవకాశం లభిస్తుందనే ఆలోచన చేస్తున్న విద్యార్థులు.. తమ ఉన్నత చదువులు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నంచేయాలి. ముఖ్యంగా పీహెచ్‌డీ స్థాయి అభ్యర్థులు తమ పరిశోధనలు సామాజిక ప్రగతికి దోహదపడేలా కృషిచేయాలి.
Published date : 25 Sep 2020 02:55PM

Photo Stories