Skip to main content

ఏపీలో నర్సింగ్‌కు కోర్సులకు నోటిఫికేషన్ విడుదల.. దర ఖాస్తు చేసే చివరి తేది..

రోగులకు సేవలు అందిస్తూసమాజంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగి.. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా మెప్పు పొందిన వృత్తి.. నర్సింగ్! రోగులకు, డాక్టర్లకు మధ్య వారధిగా సేవలు అందించే నర్సులకు అవకాశాలకు కొదవలేదు.

 సేవ చేయాలనే ఆసక్తితో నర్సింగ్ కోర్సుల్లో చేరితే.. చదువు పూర్తికాగానే కొలువు దక్కడం ఖాయం! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో 2020-21 విద్యాసంవత్సరానికి జీఎన్‌ఎం,పోస్టు బేసిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ వైద్య విద్యా డెరైక్టరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

జీఎన్‌ఎం..

జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) అనేది మూడేళ్ల కోర్సు. ఇందులో ఆరు నెలల ఇంటర్నషిప్ కూడా ఉంటుంది. అలాగే పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సు కాల వ్యవధి ఒక సంవత్సరం.

అర్హతలు..

  1.  జీఎన్‌ఎం కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఇంగ్లిష్ సబ్జెక్టుతో 40శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి.
  2.  ఏఎన్‌ఎం కోర్సు 40 శాతం మార్కులతో పూర్తిచేసిన విద్యార్థులు కూడా జీఎన్‌ఎం కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  3.  వయసు: 16 ఏళ్లు నిండినవారై 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఏఎన్‌ఎం అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదు. ఎస్సీ/ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు మూడేళ్లపాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  4.  పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్టర్డ్ నర్స్, రిజిస్టర్డ్ మిడ్‌వైఫ్ అయి ఉండాలి. కనీసం ఒక సంవత్సరం నర్‌‌సగా అనుభవం పొంది ఉండాలి. వీరికి వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి.

 

ఎంపిక ప్రక్రియ..

అకడమిక్‌గా సాధించిన మెరిట్ లేదా మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలను కల్పిస్తారు.

ముఖ్యమైన సమాచారం..

  1.  దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  2.  దరఖాస్తులకు చివరి తేదీ : 15.10.2020
  3.  దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ : 10.10.2020
  4.  డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ పంపించాల్సిన తేదీ : 20.10.2020
  5.  ఎంపిక ప్రక్రియ : 09.11.2020 లోపు పూర్తవుతుంది.
  6.  తరగతులు ప్రారంభం: 16.11.2020
  7.  పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : http://dme.ap.nic.in

(ఇంకా చదవండి: part 2: నర్సింగ్ కోర్సులతో మంచి ఉద్యోగ అవకాశాలు.. సమాచారం తెలుసుకోండిలా..)

Published date : 26 Sep 2020 04:40PM

Photo Stories