ఏపీఆర్‌సెట్-2019 దరఖాస్తు ప్రక్రియ..ప్రయోజనాలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీఆర్‌సెట్)... ఏపీలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) తరపున ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీఆర్‌సెట్‌ను నిర్వహిస్తోంది. తాజాగా ఈ మేరకు నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఈ నేపథ్యంలో.. ఏపీఆర్‌సెట్ అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ,ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
ఎంఫిల్, పీహెచ్‌డీ :
ఆంధ్రప్రదేశ్‌లోని 14 విశ్వవిద్యాలయాలు, క్యాంపస్ కళాశాలలు, రీసెర్చ్ సెంటర్లు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ విధానాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీఆర్‌సెట్‌ను నిర్వహిస్తున్నారు. సైన్స్, ఆర్ట్స్, మేనేజ్‌మెంట్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఏపీఆర్‌సెట్ ద్వారా ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు.
మినహాయింపు :
యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్, ఇతర ఫెలోషిప్‌లు, వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులు, వ్యాలిడ్ జీప్యాట్ స్కోరు కలిగిన ఫార్మసీ విద్యార్థులు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు ఏపీఆర్‌సెట్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
అర్హతలు..
ఎంపిక ప్రక్రియ :
ఎంట్రెన్స్ టెస్టు, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం :
ఎంట్రన్స్ టెస్టు 180 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్ ఎలో.. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 90 మార్కులకు; పార్ట్ బిలో సంబంధిత సబ్జెక్టు నుంచి 90 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఎంట్రన్స్ టెస్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించిన జనరల్ అభ్యర్థులను, 45 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులను అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
ఇంటర్వ్యూ :
ఎంట్రెన్స్ టెస్టులో అర్హత సాధించిన వారికి ఆయా విశ్వవిద్యాలయాల డిపార్ట్‌మెంట్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూ కమిటీ ముందు రీసెర్చ్‌పై తమకున్న ఆసక్తిని ప్రజెంటేషన్ ద్వారా వివరించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కమిటీలో సంబంధిత డిపార్ట్‌మెంట్ హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఒక సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉంటారు. ఇంటర్వ్యూకి 20 మార్కులు ఉంటాయి. ఎంట్రెన్స్ టెస్టు, ఇంటర్వ్యూల్లో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ కమిటీ అభ్యర్థులకు తుది ర్యాంకు/మార్కులు కేటాయిస్తుంది.
సబ్జెక్టులు ఇవే..
ఏపీఆర్‌సెట్‌ను కింది సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అవి...
ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 10, 2019.
దరఖాస్తుల్లో మార్పులు : అక్టోబర్ 17-19, 2019.
హాల్ టిక్కెట్ల జారీ ప్రారంభం: అక్టోబర్ 28 నుంచి
పరీక్ష తేదీ: నవంబర్ 8-12, 2019.
ఫీజు: ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1300; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి రూ.900. అభ్యర్థులు గరిష్టంగా రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో సబ్జెక్టు దరఖాస్తుకు అదనంగా రూ.600 ఫీజు చెల్లించాలి.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, హైదరాబాద్.
పూర్తి వివరాలకువెబ్‌సైట్: sche.ap.gov.in

- ఫుల్‌టైమ్.. కనీసం 55 శాతం మార్కులు లేదా బీ గ్రేడ్(యూజీసీ నిబంధనల మేరకు)తో మాస్టర్ డిగ్రీ/తత్సమాన ఫ్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ తదితర కేటగిరీల లభ్యర్థులు, 1991 కంటే ముందు పీజీ ఉత్తీర్ణులైన వారికి 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ల నుంచి డిస్టెన్స్ విధానంలో పీజీ ఉత్తీర్ణులైన వారు సైతం ఏపీఆర్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పార్ట్‌టైమ్.. ఫుల్‌టైమ్‌కు పేర్కొన్న విద్యార్హతలతోపాటు యూనివర్సిటీ లేదా పీజీ సెంటర్స్‌లో పనిచే స్తున్న రెగ్యులర్ ఫ్యాకల్టీ పార్ట్‌టైమ్ ఎంఫిల్/పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
ఎంట్రెన్స్ టెస్టు, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం :
ఎంట్రన్స్ టెస్టు 180 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్ ఎలో.. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 90 మార్కులకు; పార్ట్ బిలో సంబంధిత సబ్జెక్టు నుంచి 90 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఎంట్రన్స్ టెస్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించిన జనరల్ అభ్యర్థులను, 45 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులను అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
ఇంటర్వ్యూ :
ఎంట్రెన్స్ టెస్టులో అర్హత సాధించిన వారికి ఆయా విశ్వవిద్యాలయాల డిపార్ట్‌మెంట్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూ కమిటీ ముందు రీసెర్చ్‌పై తమకున్న ఆసక్తిని ప్రజెంటేషన్ ద్వారా వివరించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కమిటీలో సంబంధిత డిపార్ట్‌మెంట్ హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఒక సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉంటారు. ఇంటర్వ్యూకి 20 మార్కులు ఉంటాయి. ఎంట్రెన్స్ టెస్టు, ఇంటర్వ్యూల్లో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ కమిటీ అభ్యర్థులకు తుది ర్యాంకు/మార్కులు కేటాయిస్తుంది.
సబ్జెక్టులు ఇవే..
ఏపీఆర్‌సెట్‌ను కింది సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అవి...
- ఆర్ట్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, లా: అడల్డ్ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, బుద్దిస్ట్, జైన, గాంధీయన్ అండ్ పీస్ స్టడీస్, కామర్స్, కంపారిటివ్ ద్రవిడియన్ లిటరేచర్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఫైన్ ఆర్ట్స్(విజువల్ ఆర్ట్స్), ఫోక్ లిటరేచర్, హిందీ, హిస్టరీ, ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, కన్నడ, లేబర్ వెల్ఫేర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, లా, లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మేనేజ్‌మెంట్, మ్యూజిక్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్-డ్యాన్స్ అండ్ డ్రామా థియేటర్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, పాపులేషన్ స్టడీస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డా. బి.ఆర్.అంబేద్కర్ స్టడీస్, రూరల్ డెవలప్‌మెంట్, సంస్కృతం, సోషల్ వర్క్, సోషియాలజీ, తమిళం, తెలుగు, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్, ఉమెన్ స్టడీస్, యోగా.
- సైన్స్: అప్లయిడ్ లైఫ్ సెన్సైస్, బోటనీ అండ్ ప్లాంట్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, జాగ్రఫీ, హోమ్ సెన్సైస్, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, మెటీరియాలజీ/స్పేస్ టెక్నాలజీ/అట్మాస్పియరిక్ సెన్సైస్, ఓషన్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, సెరీకల్చర్, స్టాటిస్టిక్స్, జువాలజీ అండ్ యానిమల్ సెన్సైస్.
- ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్: ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్; సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ టెక్నాలజీ, మెకానికల్, మెటలర్జికల్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, జియో ఇంజనీరింగ్.
నెగిటివ్ మార్కులు లేవు : ఏపీఆర్‌సెట్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. గత సంవత్సరం ఏపీఆర్‌సెట్‌లో నెగిటివ్ మార్కింగ్ ఉండేది. ఈ సంవత్సరం నెగిటివ్ మార్కులు లేవు. పరీక్ష పరంగా దీన్ని ప్రధాన మార్పుగా చెప్పొచ్చు. గతేడాది పరీక్షకు దాదాపు 25,000 మంది హాజరయ్యారు. ఈ సంవత్సరం 20,000 మంది వరకు హాజరవుతారని అంచనా. పార్ట్‌టైమ్ విధానంలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేద్దామనుకొనే అభ్యర్థులు ఏపీఆర్‌సెట్‌కు హాజరవడం తప్పనిసరి. జేఆర్‌ఎఫ్‌కు అర్హత పొందిన వారు, వ్యాలిడ్ యూజీసీ నెట్, జీప్యాట్ తదితర స్కోరులు కలిగుండి.. ఫుల్‌టైమ్ విధానంలో ప్రవేశం పొందాలనుకొనేవారికి ఏపీఆర్‌సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది. - ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, కన్వీనర్, ఏపీఆర్‌సెట్. |
ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 10, 2019.
దరఖాస్తుల్లో మార్పులు : అక్టోబర్ 17-19, 2019.
హాల్ టిక్కెట్ల జారీ ప్రారంభం: అక్టోబర్ 28 నుంచి
పరీక్ష తేదీ: నవంబర్ 8-12, 2019.
ఫీజు: ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1300; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి రూ.900. అభ్యర్థులు గరిష్టంగా రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో సబ్జెక్టు దరఖాస్తుకు అదనంగా రూ.600 ఫీజు చెల్లించాలి.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, హైదరాబాద్.
పూర్తి వివరాలకువెబ్‌సైట్: sche.ap.gov.in
Published date : 25 Sep 2019 12:24PM