ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2020పరీక్ష విధానం- కెరీర్ అవకాశాలు
Sakshi Education
ఇంటర్ తర్వాత ఎంసెట్, నీట్ లేనా.. ఇంజనీరింగ్, మెడిసిన్‌లకు దీటుగా ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులే లేవా...? అని మదనపడుతున్నారా..! అలాంటి వారికి సరిగ్గా సరితూగే కోర్సు..
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్..! తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో ప్రవేశాలను ఖరారు చేసే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ)- 2020కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు.. కెరీర్ అవకాశాలు.. ఐహెచ్‌ఎంల ప్రత్యేకత, పరీక్ష విధానం తదితరాలపై ప్రత్యేక కథనం...
ఐహెచ్‌ఎం క్యాంపస్‌లు:
హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అవసరమైన మానవ వనరులను తయారుచేసేందుకు కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇతర రంగాలతో పోల్చితే ఆతిథ్య రంగం దూసుకుపోతోంది. ఏటా స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో సేవల రంగంలో భాగమైన హోటల్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీలో సరికొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం) క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది.
21 ఐహెచ్‌ఎంలు.. 6,395 సీట్లు :
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం 21 ఐహెచ్‌ఎంలు ఉండగా.. వాటిలో దాదాపు 6,395సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు పీఎస్‌యూ ఆధ్వర్యంలో న్యూఢిల్లో ఏర్పాటు చేసిన ఐహెచ్‌ఎంలో 90 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని 48 ఇన్‌స్టిట్యూట్స్ భారీగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐహెచ్‌ఎం క్యాంపస్‌ల్లోని సీట్లను ఉమ్మడి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈలో ర్యాంకు ఆధారంగా వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.
హోటల్ మేనేజ్‌మెంట్... జేఈఈ :
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షే.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ. దీనిలో ఉత్తీర్ణులైన వారికి ఐహెచ్‌ఎంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లోని హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.
పరీక్ష విధానం :
ఎన్‌హెచ్‌ఎం జేఈఈ ఎంట్రెన్స్‌ను మొత్తం ఐదు విభాగాల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
ప్రిపరేషన్... పటిష్టంగా
న్యూవురికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ :
మ్యాథ్స్‌లో ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు హైస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌పై పట్టుసాధించాలి. ప్రధానంగా శాతాలు, లాభ-నష్టాలు, నంబర్ సిస్టమ్, సగటు, కాలం-పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, జామెట్రీ తదితర అంశాలను ప్రిపేరవ్వాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి నిర్దిష్టంగా ఇచ్చిన డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని సమాచారాన్ని క్రోడీకరించి..అడిగిన ప్రశ్నకు సమాధానం గుర్తించగలిగే నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. దీనికోసం గ్రాఫ్‌లు, పైచార్ట్‌లు, ఫ్లోచార్ట్‌లను బాగా ప్రాక్టీస్ చేయాలి.
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్:
ఈ విభాగంలో అభ్యర్థుల్లోని సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణా నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థులు మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ తదితరాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా డేటా సఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్‌ను ప్రాక్టీస్ చే యాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ :
ఇందులో అభ్యర్థులకు సామాజిక అంశాలు, సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. ఇందులో ఎక్కువ మార్కులు పొందాలంటే.. హైస్కూల్ స్థాయిలోని చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది. చరిత్రలో కీలక యుద్ధాలు-పర్యవసనాలు, స్వాతంత్య్రోద్యమం తదితరాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జాగ్రఫీలో దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు-అవి లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఇతర పోటీ పరీక్షల మాదిరిగానే ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, తాజా అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ :
పరీక్ష పరంగా ఈ విభాగం కీలకమైంది. గ్రామర్‌పై పట్టుసాధించడం ద్వారా ఇందులో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్‌పై పట్టు సాధించాలి. దీనికోసం బేసిక్ గ్రామర్ పుస్తకాలను అధ్యయనం చేయడం లాభిస్తుంది. ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలోని కొత్త పదాలను తెలుసుకోవడంతోపాటు, ఆయా పదాలను ఉపయోగించే తీరును పరిశీలించాలి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ :
ఇది ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగం. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాలపై ఉన్న ఆసక్తి, దృక్పథాలను పరీక్షిస్తారు. వాస్తవ సంఘటన లేదా ఏదైనా అంశాన్నిచ్చి దానిపై స్పందించమనే తరహాలో ప్రశ్నలు అడుగుతారు. ఆయా ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరు, సందర్భానికి తగినట్లు వ్యవహరించే శైలిని పరీక్షిస్తాయి.
ముఖ్యసమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20, 2020
ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ ఆన్‌లైన్ టెస్టు తేదీ: ఏప్రిల్ 25, 2020
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: ఏప్రిల్ 7 నుంచి
ఫలితాల వెల్లడి: మే 15, 2020
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, నాన్‌క్రీమిలేయర్ ఓబీసీ-900, ఈడబ్ల్యూఎస్-రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.450.
అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జూలై 1, 2020 నాటికి 25 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, గుంటూరు, హైదరాబాద్/ సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: nchmjee.nta.nic.in

విభాగం | {పశ్నలు |
న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ | 30 |
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ | 30 |
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ | 30 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 60 |
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ | 50 |
మొత్తం ప్రశ్నలు | 200 |

Published date : 21 Jan 2020 04:46PM