ఎంసెట్-2021లో ఇలా చదివి...ఇలా ప్రాక్టీస్ చేస్తే విజయం మీదే..
ఆంధ్రప్రదేశ్‌లో సైతం త్వరలో ఎంసెట్
నిర్వహణ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎంసెట్‌లో విజయానికి దీర్ఘకాలిక ప్రిపరేషన్ వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపే ప్రత్యేక కథనం...
కోర్సులు...
తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డైరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బండ్రీ, బ్యాచిలర్ ఫిషరీస్ సైన్స్, బీఫార్మసీ, ఫార్మాడి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష స్వరూపం :
ఎంసెట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
ఇంజనీరింగ్ స్ట్రీమ్ :
సబ్జెక్టు | ప్రశ్నలు |
మ్యాథమెటిక్స్ | 80 |
ఫిజిక్స్ | 40 |
కెమిస్ట్రీ | 40 |
మొత్తం | 160 |
అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ :
సబ్జెక్టు | ప్రశ్నలు |
బయాలజీ(బోటనీ+జువాలజీ) | 40+40=80 |
ఫిజిక్స్ | 40 |
కెమిస్ట్రీ | 40 |
మొత్తం | 160 |
మ్యాథమెటిక్స్ :
- ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరడమే లక్ష్యంగా జేఈఈమెయిన్‌తోపాటు ఎంసెట్‌కు హాజరవుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారానే ఎక్కువ మందికి ఇంజనీరింగ్‌లో చేరే అవకాశం దక్కుతోంది. జేఈఈ వంటి పరీక్షల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సమాన వెయిటేజీ ఉంటుంది. కానీ, ఎంసెట్ లో మాత్రం మ్యాథమెటిక్స్‌కు 50 శాతం వెయిటేజీ ఉంది. కాబట్టి విద్యార్థులు మ్యాథ్స్‌పై ఎక్కువ సమయం వెచ్చించాలి.
- ఎంసెట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఫార్ములా లు, సినాప్సిస్, స్టాండర్డ్ రిజల్ట్స్‌పై పట్టుసాధించాలి. ట్రిగ నోమెట్రిలో ఫార్ములాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని సరైన చోట అన్వయించగలిగేలా ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా వేగం, కచ్చితత్వంపైనా ఎక్కవగా దృష్టిసా రించాలి.
- కీలక చాప్టర్లు: ఇంటర్ మ్యాథ్స్ సిలబస్‌ను ఆల్‌జీబ్రా, కాల్కు లస్, జామెట్రీ, వెక్టార్ ఆల్‌జీబ్రా, ట్రిగనోమెట్రీగా విభజిం చొచ్చు. కాల్కులస్ నుంచి 20 ప్రశ్నల వరకు అడుగుతు న్నారు. విద్యార్థులు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియే షన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డిఫెనైట్ ఇంటెగ్రల్, డిఫెరెన్షియెల్ ఈక్వేషన్స్‌పై ఫోకస్ పెట్టాలి.
- జామెట్రీ నుంచి 20-25 ప్రశ్నల వరకు వస్తున్నాయి. ఇందులో 2డీ, 3డీ జ్యామెట్రీ, లోకస్, స్ట్రైట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎల్లిప్స్, డైరక్షన్ కొసైన్స్, డైరక్షన్ రేషియోస్, ప్లేన్ తదితరాలు కీలక అంశాలుగా ఉంటాయి.
- ఎంసెట్ పరంగా ఆల్‌జీబ్రా అత్యంత కీలక చాప్టర్‌గా నిలు స్తుంది. దీన్నుంచి దాదాపు 25 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. ఫంక్షన్లు, మ్యాట్రిసెస్, క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరమ్ తదితరాలపై ఫోకస్ పెట్టాలి.
- {sిగనోమెట్రి నుంచి 10-15 ప్రశ్నలు అడుగుతున్నారు. ట్రిగనోమెట్రి రేషియోస్ అప్‌టు ట్రాన్స్‌ఫర్మేషన్స్, హైపర్ బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టాపిక్స్‌ను సమగ్రంగా ప్రిపేరవ్వాలి.
- వెక్టర్ ఆల్‌జీబ్రా నుంచి ఐదు లేదా ఆరు ప్రశ్నలు వస్తున్నాయి. అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ అండ్ ప్రాబబిలిటీలో మెజర్స్ ఆఫ్ డిప్రెషన్, ప్రాబబిలిటీ, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌పై పట్టుసాధించాలి.
ిఫజిక్స్ :
- ఫిజిక్స్ సిలబస్‌లో దాదాపు 30 చాప్టర్లను పేర్కొన్నారు. పరీక్ష పరంగా వీటిని పది పాఠ్యాంశాలుగా అన్వయిం చుకోవచ్చు. ఎంసెట్‌లో అత్యధికంగా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ చాప్టర్ నుంచి దాదాపు పది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీని తర్వాత వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి ఐదు లేదా ఆరు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- {V>Ñsేషన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియెల్ అండ్ కెపాసిటెన్స్‌పై చాప్టర్ల నుంచి నాలుగు ప్రశ్నల చొప్పున అడిగే అవకాశం ఉంది. వీటి తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, రేఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, వేవ్ ఆప్టిక్స్, మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, డ్యూయెల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మేటర్, న్యూక్లియై, సెమికండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టిపెట్టాలి.
కెమిస్ట్రీ :
- ఎంసెట్ పరంగా కెమిస్ట్రీని విద్యార్థులు ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలుగా విభజించుకొని చ దవడం లాభిస్తుంది.
- ఫిజికల్ కెమిస్ట్రీలో.. సొల్యూషన్స్ చాప్టర్ నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ చాప్టర్‌లో ప్రధానంగా ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలను సాధన చేయాలి. రౌల్ట్స్ లా, ఐడియల్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ, మొలారిటీ, మొలాలిటీ, వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ తదితరాలపై దృష్టిపెట్టాలి. సాలిడ్ స్టేట్‌లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ, బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రో కెమిస్ట్రీ చాప్టరలో నెర్ట్స్ ఈక్వేషన్‌పై ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలు, ఎలక్ట్రాలసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌పై ఫోకస్ పెట్టాలి.
- ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రిపరేషన్‌పై ఎంసెట్ ర్యాంకు ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపితే.. కెమిస్ట్రీలో 35 మార్కులకు పైగా సాధించొచ్చు. విద్యార్థులు ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి అకాడెమీ పుస్తకాలను అనుసరించడం లాభిస్తుంది.
- IA,IIA,IIIA,IVA గ్రూపు మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్లు, ఎలక్ట్రో పాజిటివిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పొటన్షియల్ వాల్యూమ్ టాపిక్స్‌పై దృష్టిపెట్టాలి.
- IVA గ్రూపులో డైమండ్, రాఫైట్ స్ట్రక్చర్లు, సిలికాన్ల గురించి క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు డి, ఎఫ్-బ్లాక్ ఎలిమెంట్లు, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, వెస్పర్ థియరీ తదితరాలపై ఫోకస్ పెట్టాలి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌం డ్లుగా విభజించుకొని చదవాలి. ఇందులో హైడ్రోకార్బన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు, హోమోజినైజేషన్, రియాక్షన్ విత్ బేయర్స్ రియేజెంట్, హాలోజన్, ఎస్‌ఎల్ మెకానిజమ్స్, యాసిడ్ స్ట్రెంత్ ఆఫ్ ఫీనాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్‌పై దృష్టిపెట్టాలి. పరీక్ష సమయం దగ్గ రపడుతుందనగా బయోమాలిక్యుల్స్‌పై దృష్టి పెట్టడం లాభిస్తుంది.
బోటనీ:
- ముఖ్య టాపిక్స్: డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ప్లాంట్స్(మార్ఫాలజీ), రీ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్.
జువాలజీ
- ముఖ్యటాపిక్స్: జువాలజీ-డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సి టీ(ఐ-ఐఐ), బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లెనేటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, జెనిటిక్స్, అప్లయిడ్ బయాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటొజోవా.
{పాక్టీస్ :
- {పిపరేషన్ పరంగా చదవడంతోపాటు ప్రాక్టీసుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- పాత ఎంసెట్ ప్రశ్నపత్రాలను సాధించాలి.
- రోజూ కనీసం 100 ప్రశ్నలను సాధన చేయాలి. ప్రశ్నపత్రాల సాధనలో చేస్తున్న తప్పులను విశ్లేషించాలి.
- కష్టంగా అనిపించే ప్రశ్నలను గుర్తించి... రివిజన్‌లో వాటిపై దృష్టిసారించాలి.
- సులభంగా ఉన్న ప్రశ్నలను సైతం రివిజన్ చేయాలి.
{పామాణిక మెటీరియల్ :
ఎంసెట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ముందుగా ప్రామాణిక మెటీరియల్ లేదా బుక్స్‌ను అనుసరించాలి. ఆ దిశగా సందేహాలు ఉంటే..ఫ్యాకల్టీ, కోచింగ్ నిపుణులు, సీని యర్లను సంప్రదించాలి. ఎంసెట్‌లో సమాధానాలను సాధ్యమైనంత వరకు ఊహించి రాసేందుకు ప్రయత్నించొద్దు.
ఆరోగ్యం :
- పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు శారీరక,మానసిక ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలి. ప్రోటీన్‌లతో కూడిన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరు నుంచి ఏడు గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి.
- {పిపరేషన్ పరంగా సానుకూలతను ప్రదర్శించాలి. తద్వారా పరీక్ష పరంగా ఆశించిన ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.
- ఆత్మవిశ్వాసాన్ని అతివిశ్వాసంగా మారకుండా చూసుకోవాలి.
- G కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని గుర్తించాలి.
మాక్ టెస్టులు :
రోజూ మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగ డంతోపాటు పరీక్ష పరంగా స్వీయసామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. మాక్‌టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రిపరేషన్ వ్యూహాలను మార్చుకోవాలి.