Skip to main content

ఎంబీఏ Vs ఎంకామ్

బీకామ్ పూర్తయిందా.. అయితే మీ దారెటు..!? ఎంబీఏలో చేరడమా.. లేదంటే ఎంకామ్ వైపు వెళ్లడమా..? రెండింట్లో దేంట్లో చేరాలో తేల్చుకోలేకపోతున్నారా..! కోర్సు ఎంపికకు ముందుగా ఎంకామ్, ఎంబీఏ ద్వారా లభించే నైపుణ్యాలు, ఆయా కోర్సులు పూర్తిచేస్తే లభించే ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
అంతిమంగా అభ్యర్థి వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి, అవకాశాల మేరకే కోర్సు ఎంపిక ఉండాలంటున్నారు నిపుణులు. ఎంబీఏ, ఎంకామ్‌లలో దేంట్లో చేరాలో తేల్చుకోలేకపోతున్న బీకామ్ విద్యార్థులకు ఉపయోగపడేలా రెండు కోర్సుల బలాబలాలపై ఫోకస్...

ఎంబీఏ:
  • ఎంబీఏలో అనేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. బీకామ్ గ్రాడ్యుయేట్లకు ఫైనాన్స్ చక్కగా సరిపోతుంది. ఈ స్పెషలైజేషన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విభాగాల్లో అభ్యర్థికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది. ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్ ఎవరైనా ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ స్పెషలైజేషన్ ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు లాజికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఎంబీఏ ఫైనాన్స్ విద్యార్థులు కోర్సులో భాగంగా అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ టెక్నిక్‌్లకి సంబంధించిన సిద్ధాంతాలు, ప్రాక్టికల్ అప్లికేషన్లపై పట్టు సాధిస్తారు. తద్వారా అభ్యర్థుల్లో నైపుణ్యాలు పెంపొంది.. భవిష్యత్తులో మేనేజీరియల్ స్థానాల్లో స్థిరపడేందుకు కావాల్సిన అర్హతలు లభిస్తాయి.
  • కామర్స్ గ్రాడ్యుయేట్లకు ఎంబీఏ ఫైనాన్స్తోపాటు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లు చక్కగా సరిపోతాయి. అలాగే బీకామ్ విద్యార్థులు ఆసక్తి ఉంటే మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్) వంటి స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.
  • ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకింగ్ సెక్టార్, షేర్ బ్రోకరింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కార్పొరేట్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఎంబీఏ.. ఏ బీస్కూల్‌లో చదివామనేది కీలకంగా మారుతోంది. ఐఐఎంలు వంటి ప్రముఖ బీస్కూల్స్‌లో ఎంబీఏ పూర్తిచేస్తే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే కార్పొరేట్ కంపెనీల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అందువల్ల ఎంబీఏ వైపు కదలాలనుకొనే కామర్స్ గ్రాడ్యుయేట్‌లు క్యాట్, మ్యాట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఎంబీఏలో చేరే అవకాశం దక్కుతుంది.

మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) :
  • కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసివారు రెండేళ్ల ఎంకామ్‌లో చేరేందుకు అర్హులు. మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) ద్వారా అకౌంటింగ్, ఫైనాన్స్, కంప్యూటర్స్, ఈ-బిజినెస్ వంటి అంశాల్లో లోతైన అవగాహన లభిస్తుంది. ఈ కోర్సు ప్రధానంగా కామర్స్ సబ్జెక్టుల్లో విజ్ఞానాన్ని పెంపొందిం చుకోవాలనుకునే వారి కోసం ఉద్దేశించింది. ఎంకామ్‌లో అభ్యర్థులు స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు. మంచి మార్కులతో ఎంకామ్‌ను పూర్తిచేస్తే క్వాలిఫైడ్ అకౌంటెంట్స్‌గా స్థిరపడొచ్చు.
  • ఎంకామ్ విద్యార్థులు ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్‌లో నైపుణ్యాలను పెంపొందిం చుకునేందుకు షార్ట్‌టర్మ్ కోర్సులు; కంప్యూటర్ అప్లికేషన్స్, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో ఆకర్షణీయ మైన జీతాలతో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
  • ఎంకామ్ అనంతరం ఆసక్తి మేరకు ఉన్నత చదువులు లేదా ఉద్యోగంలో స్థిరపడొ చ్చు. ఎంకామ్ తర్వాత ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరొచ్చు. బోధనా రంగంలో సుస్థిర కెరీర్‌ను కోరుకునే వారు ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ పూర్తిచేయడం లాభిస్తుంది. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్), నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) అర్హతతో బోధన రంగంలో ఉద్యోగంలో చేరే వీలుంది.
  • ఎంకామ్ పూర్తిచేసిన వారికి ప్రధానంగా బ్యాం కులు, ఫైనాన్షియల్ సంస్థలలో ఉద్యోగ అవకా శాలు ఉంటాయి. ఆయా సంస్థల్లో ఆడిటింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఎలక్ట్రానిక్ రిటైలింగ్, ఫండ్‌‌స మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, స్టాక్ బ్రోకింగ్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్స్ వంటి ఉపాధి మార్గాలు అందుకోవచ్చు. ఎంకామ్ పూర్తిచేసిన వారు ప్రభుత్వ రంగంలోనూ స్థిరపడొచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
ప్రధాన వ్యత్యాసాలు...
ఎంబీఏ
1. ప్రొఫెషనల్ కోర్సు
2. ఏదైనా డిగ్రీ కనీస అర్హత
3. ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్ ఉంటాయి
4. ఖర్చుతో కూడుకున్న కోర్సు

ఎంకామ్
1. సంప్రదాయ పీజీ కోర్సు
2. బీకామ్ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు
3. పలు విశ్వవిద్యాలయాల్లో
4. ప్రాజెక్టు వర్క్ ఉంది.
5. తక్కువ ఖర్చులో పూర్తవుతుంది.

దేనికదే ఎంతో ప్రత్యేకం :
Career guidanceఎంబీఏ అనేది ఒక జనరల్ కోర్సు. ఇందులో అభ్యర్థులు అనేక భిన్నమైన అంశాలను నేర్చుకుంటారు. ఎంబీఏ లోని ఎక్కువ శాతం సబ్జెక్టులు అభ్యర్థులకు ఆయా అంశాల్లో స్థూలంగా అవగాహన, అందిస్తాయి. కానీ, ఎంకా మ్.. అభ్యర్థులకు ఆయా సబ్జెక్టు అంశాలపై లోతైన అవగాహ నను అందిస్తుంది. ఎంకామ్ కోర్సు ప్రధానంగా అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ దృక్పథంతో సాగుతుంది. ఎంబీఏ ప్రస్తుతం అత్యంత పాపులర్ ప్రొఫెషనల్ కోర్సు. ఈ డిగ్రీ విలువ.. ఇన్‌స్టిట్యూట్ పేరు ప్రఖ్యాతలపై ఆధారపడి ఉంటుంది. సబ్జెక్టుపై పట్టుతో ఎంకామ్ పూర్తిచేస్తే కెరీర్ పరంగా ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ఎంకామ్ డిగ్రీ హోదాను ఇన్‌స్టిట్యూట్ స్థాయి పెద్దగా ప్రభావితం చేయదు. ఎంబీఏ పూర్తిచేసిన వారు మేనేజీరియల్ స్థానాల్లోకి స్థిరపడే అవకాశముంది. ఎంకామ్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు కొంత అనుభవం ద్వారా మేనేజీరియల్ స్థానాలు అందుతాయి.
- డా. వి.అశోక్, ప్రొఫెసర్
Published date : 09 Aug 2018 07:01PM

Photo Stories