డాక్టర్ కల నెరవేరేనా.. !
Sakshi Education
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ ఇటీవల ప్రకటించిన నీట్ 2018 ఫలితాల గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 12.69 లక్షల మంది నీట్‌కు హాజరుకాగా 7.14 లక్షల మంది అర్హత సాధించారు.
వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 49253 మంది నీట్‌కు హాజరుకాగా.. 35732 మంది అర్హత సాధించారు. అలాగే తెలంగాణ నుంచి నీట్ అభ్యర్థులు 44877 మంది ఉండగా.. వీరిలో 30912 మంది అర్హత పొందారు. ఔత్సాహికులు దేశవ్యాప్తంగా లక్షల్లో, రాష్ట్రాల్లో వేల సంఖ్యలోనే నీట్ అర్హత సాధించి వైద్య కోర్సుల్లో చేరాలని ఆశిస్తుండగా... దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా సీట్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కోత వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వాటిలో 68 కాలేజీలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సిఫార్సుల మేరకు పక్కన పెట్టింది. అలాగే మౌలిక వసతుల కొరత కారణంతో దేశవ్యాప్తంగా 12 ప్రభుత్వ, 70 ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు రెన్యువల్ ఇవ్వలేదు. అదేవిధంగా సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసుకున్న 9 కాలేజీల అభ్యర్థనను కూడా పక్కన పెట్టేసింది. తద్వారా మొత్తంగా జాతీయస్థాయిలో 10 వేలకుపైగా సీట్లకు కోతవేసినట్లయింది. వీటిలో కొన్ని కాలేజీలకు గతేడాది కూడా ప్రవేశాలకు అనుమతి లభించకపోవడం గమనార్హం. దాంతో తమ డాక్టర్ కల నెరవేరేనా అనే సందేహం ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది.
జూన్ 13 నుంచి ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ :
నీట్ 2018 కౌన్సెలింగ్‌లో భాగంగా ఆలిండియా కోటా 15 శాతం సీట్ల భర్తీకి రెండు దశల్లో ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్ జరగనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి జూన్ 13 నుంచి మొదట దశ కౌన్సెలింగ్, జూలై 6 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. అలాగే రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కళాశాలల్లోని మిగతా 85 శాతం సీట్లతోపాటు ప్రైవేటు వైద్య కాలేజీల్లోని సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియను సంబంధిత రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ అథారిటీస్ చేపడతాయి. సదరు కౌన్సెలింగ్ అథారిటీస్ విడుదల చేసే కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు అనుగుణంగా ఆన్‌లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకోవాలి. రాష్ట్ర కౌన్సెలింగ్ విభాగాలు స్టేట్ మెరిట్‌లిస్ట్‌ను రూపొందిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో జూన్ చివరి వారంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.
నేషనల్ పూల్ కలిసొచ్చేనా ?
తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం నుంచి నేషనల్ పూల్‌లో చేరాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 15 శాతం సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళతాయి. ప్రస్తుత అంచనా ప్రకారం దేశంలో 4,508 సీట్లు ఆలిండియా కోటాలో భర్తీచేసే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఉన్న 1,900 ఎంబీబీఎస్ సీట్ల నుంచి 285 సీట్లు పోగా.. ఏపీ విద్యార్థులకు 1,615 సీట్లు; తెలంగాణలోని 8 ప్రభుత్వ కాలేజీల్లోని 1,250 సీట్ల నుంచి 187 సీట్లు నేషనల్ పూల్‌లోకి చేరగా.. తెలంగాణ విద్యార్థులకు 1013 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఇన్సూర్డ్ పర్సన్‌స కోటా కింద నీట్‌లో అర్హులైన ఈఎస్‌ఐ ఉద్యోగుల పిల్ల్లలతో భర్తీ చేస్తారు. ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌లో మన విద్యార్థులు ఎక్కువ సీట్లలో ప్రవేశం పొందితేనే నేషనల్ పూల్‌లో చేరిన ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ కాలేజీ సీట్లు పెరుగుతాయని భావిస్తే నిరాశ తప్పలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వైద్య కళాశాలలకు ఆరోగ్య శాఖ అనుమతి నిరాకరిస్తూ ఇటీవల జాబితా విడుదల చేసింది. తెలంగాణ నుంచి మూడు కాలేజీలు, ఏపీ నుంచి ఒక కాలేజీ నూతనంగా వైద్య కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు కోరగా... కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతివ్వలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాలేజీ, తెలంగాణ నుంచి ఒక కాలేజీ సీట్లు పెంచుకునేందుకు అనుమతులు కోరగా.. నిరాకరించింది. ఇంకొన్ని కాలేజీలు రెన్యూవల్ కావాలని కోరగా.. అనుమతివ్వలేదు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు కాలేజీలు, తెలంగాణ నుంచి నాలుగు కాలేజీలు ఉన్నాయి. అయితే అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్, చిత్తూరుకు 150 సీట్లకు ప్రవేశాలకు అనుమతి ఉంది.

Published date : 12 Jun 2018 11:48AM