బీటెక్ సిలబస్‌లో మార్పులు
Sakshi Education
బీటెక్ సిలబస్‌లో సమూల మార్పులకు రంగం సిద్ధమైంది. నైపుణ్యాలకు నగిషీలు దిద్దే సిలబస్ ఆవిష్కృతం కానుంది. నేటి టెక్నాలజీ యుగంలో.. బీటెక్ ఐఓటీ బాటలో పయనించనుంది.
దేశవ్యాప్తంగా 3000 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇండక్షన్ ప్రోగ్రామ్స్ తప్పనిసరి కానుంది. అంతేకాదు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇకపై భారత రాజ్యాంగం, సంస్కృతిని చదివి తీరాల్సిందే! వీటితోపాటు థియరీని తగ్గించి.. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేసేలా..ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మోడల్ కరిక్యులం రూపొందించింది. జాతీయ స్థాయిలో 2018 నుంచి అమల్లోకి రానున్న ఇంజనీరింగ్ కొత్త సిలబస్‌పై విశ్లేషణ..
ప్రస్తుతం మొదటి సంవత్సరానికి సంబంధించి నూతన నమూనా సిలబస్‌ను రూపొందించిన ఏఐసీటీఈ.. ఇకపై ఏటా సిలబస్‌ను సమీక్షించనుంది. దాని ఆధారంగా అవసరమైన అంశాల్లో మార్పులు చేయనుంది. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కళాశాలల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. ఏఐసీటీఈ మార్పుల్లో ఇన్‌స్టిట్యూట్‌లకు వెసులుబాటు కల్పించే అంశం.. ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి విషయంలో సడలింపు ఇవ్వడం. ఇప్పటివరకు ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి 1:15గా అమలవుతోంది. తాజా మార్పుల ప్రకారం- ఈ నిష్పత్తిని 1:20గా మార్చింది. అదే విధంగా సెమిస్టర్, సంవత్సరాల వారీ ఎగ్జామినేషన్స్‌లో అధిక శాతం అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ థింకింగ్‌తో సమాధానాలు ఇవ్వాల్సిన విధంగా ఉండే ప్రశ్నపత్రాలను రూపొందించేలా ఏఐసీటీఈ చర్యలు తీసుకోనుంది.
ఇండక్షన్ ప్రోగ్రామ్ తప్పనిసరి..
ఒకవైపు కోర్ నాలెడ్జ్ పరంగా ఆధునిక నైపుణ్యాలు పొందేలా నూతన కరిక్యులంను రూపొందించిన ఏఐసీటీఈ.. మరోవైపు విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంది. మోడల్ కరిక్యులంను అనుసరించి.. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులోని 150-160 క్రెడిట్స్‌లో.. 12 క్రెడిట్స్ సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ సబ్జెక్టుల నుంచి పొందడం తప్పనిసరి. ఎన్విరాన్‌మెంట్, భారత రాజ్యాంగం, భారత సంస్కృతి అంశాలను ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వీటికి క్రెడిట్స్ ఉండవు.
- 'సీ, సీ++, జావా వంటి వాటికే పరిమితమైతే కుదరదు. అవి బేసిక్స్ నైపుణ్యాలను అందిస్తాయే తప్ప.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగించవు. విద్యార్థులు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీపై దృష్టిసారించాలి. ఇందుకోసం సిలబస్‌లో కూడా మార్పులు చేయాలి'.
- 'ప్రాజెక్ట్ వర్క్ మినహాయిస్తే.. బీటెక్‌లో విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు లభించే అవకాశం చాలా తక్కువ. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయాలి. అప్పుడే విద్యార్థులు కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు సొంతం చేసుకోగలుగుతారు'.
వీటిని పరిగణనలోకి తీసుకున్న ఏఐసీటీఈ పూర్తిస్థాయి అధ్యయనానికి కసరత్తు చేసింది. ఐఐటీ ప్రొఫెసర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సబ్జెక్టుల వారీగా ఉపకమిటీలను నియమించింది. వీటిలో ఇండస్ట్రీ వర్గాల నుంచి ముగ్గురు చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఈ కమిటీలు వాస్తవ పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేసి పలు సిఫార్సులు చేశాయి. వీటి ఆధారంగా ఏఐసీటీఈ నమూనా సిలబస్ (మోడల్ కరిక్యులం)ను విడుదల చేసింది.
మొత్తం క్రెడిట్స్ తగ్గింపు :
మొత్తం క్రెడిట్స్ తగ్గింపు :
- ఏఐసీటీఈ మోడల్ కరిక్యులంలో కీలక మార్పు.. అభ్యర్థులు పొందాల్సిన క్రెడిట్స్‌ను తగ్గించడం. ప్రస్తుతం బీటెక్‌లో గరిష్టంగా 192 క్రెడిట్స్ ఉండగా.. వాటిని 150-160కు తగ్గించాలని నిర్ణయించింది. 20 క్రెడిట్స్‌ను సంబంధిత సబ్జెక్టును ఆన్‌లైన్‌లో అభ్యసించడం ద్వారా పొందొచ్చని తెలిపింది.
- ఏఐసీటీఈ కొత్త సిలబస్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచారు. ప్రాజెక్ట్ వర్క్, సెమినార్లకు హాజరుకావడం, ఇంటర్న్‌షిప్‌లకు 15 క్రెడిట్స్ నిర్దేశించారు. అదే విధంగా మొత్తం 12 సబ్జెక్టులతో కూడిన మొదటి సంవత్సరంలో.. అన్నింటికీ కలిపి 22 ప్రాక్టికల్స్ ఉండాలని పేర్కొంది. థియరీ క్లాస్‌ల పరంగా ప్రస్తుతం వారానికి 30 గంటల సమయం విధానం అమలవుతుండగా.. దాన్ని 20 గంటలకు తగ్గించింది.
- మోడల్ కరిక్యులం ప్రకారం- ప్రతి ఇన్‌స్టిట్యూట్ ఇండస్ట్రీ వర్గాలను నిరంతరం సంప్రదిస్తూ.. పరిశ్రమ పరంగా వస్తున్న మార్పులు తెలుసుకోవాలి. వాటికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలు లభించేలా ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి చేపట్టాలి. విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు లభించేలా తప్పనిసరిగా రెండు ఇంటర్న్‌షిప్‌లు పూర్తిచేసేలా నూతన కరిక్యులంను అమలు చేయాలి. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌లు కూడా చొరవ చూపాలి.
- నూతన కరిక్యులంలో ఆధునిక పరిస్థితులకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించే అంశాలను చేర్చాలని ఏఐసీటీఈ మోడల్ కరిక్యులం సూచించింది. ఈ క్రమంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స (ఐఓటీ), ఆటోమేషన్ టెక్నాలజీ, బిగ్ డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంశాలు ఇకపై బీటెక్ సబ్జెక్టుల్లో కనిపించనున్నాయి.
- బీటెక్ విద్యార్థులు కేవలం తాము ఎంపిక చేసుకున్న బ్రాంచ్ సబ్జెక్టులకు పరిమితం కాకుండా ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ సొంతం చేసుకునేలా మోడల్ కరిక్యులంను ఏఐసీటీఈ రూపొందించింది. ప్రొఫెషనల్ ఎలక్టివ్, ఓపెన్ ఎలక్టివ్ కోర్సుల విధానాన్ని నిర్దేశించింది. ప్రొఫెషనల్ ఎలక్టివ్ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు తమ బ్రాంచ్‌తోపాటు.. ఇతర ఇంజనీరింగ్ సబ్జెక్టులను అధ్యయనం చేసే వీలుంటుంది. ఓపెన్ ఎలక్టివ్ కోర్సుల్లో భాగంగా.. అందుబాటులో ఉన్న కోర్సుల్లో ఏ కోర్సులనైనా ఎంపిక చేసుకుని అభ్యసించొచ్చు. ఎలక్టివ్ కోర్సుల విషయంలో యూనివర్సిటీలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించుకోవచ్చు.
ప్రస్తుతం మొదటి సంవత్సరానికి సంబంధించి నూతన నమూనా సిలబస్‌ను రూపొందించిన ఏఐసీటీఈ.. ఇకపై ఏటా సిలబస్‌ను సమీక్షించనుంది. దాని ఆధారంగా అవసరమైన అంశాల్లో మార్పులు చేయనుంది. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కళాశాలల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. ఏఐసీటీఈ మార్పుల్లో ఇన్‌స్టిట్యూట్‌లకు వెసులుబాటు కల్పించే అంశం.. ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి విషయంలో సడలింపు ఇవ్వడం. ఇప్పటివరకు ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి 1:15గా అమలవుతోంది. తాజా మార్పుల ప్రకారం- ఈ నిష్పత్తిని 1:20గా మార్చింది. అదే విధంగా సెమిస్టర్, సంవత్సరాల వారీ ఎగ్జామినేషన్స్‌లో అధిక శాతం అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ థింకింగ్‌తో సమాధానాలు ఇవ్వాల్సిన విధంగా ఉండే ప్రశ్నపత్రాలను రూపొందించేలా ఏఐసీటీఈ చర్యలు తీసుకోనుంది.
ఇండక్షన్ ప్రోగ్రామ్ తప్పనిసరి..
- కొత్త సిలబస్ మార్గనిర్దేశకాల ప్రకారం.. బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టిన విద్యార్థులకు తప్పనిసరిగా మూడు వారాల వ్యవధిలో ఇండక్షన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలి. వీటిలో భాగంగా నిర్దేశిత సమయంలో ఫిజికల్ యాక్టివిటీ, క్రియేటివ్ ఆర్ట్స్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, లిటరరీ, ప్రొఫిషియన్సీ మాడ్యూల్స్, నిపుణులతో లెక్చర్స్, కాలేజ్ సమీప నివాస ప్రాంతాలకు తీసుకెళ్లడం తదితర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్లు, ప్రొఫెసర్లు మెంటార్లుగా వ్యవహరించాలని పేర్కొంది. ఏఐసీటీఈ ఆధ్వర్యంలోని మూడువేల కాలేజీలు ఈ ప్రోగ్రామ్‌ను తప్పనిసరిగా నిర్వహించనున్నాయి.
- ప్రతి విద్యార్థి క్రీడలు, వ్యాయామం, సమాజసేవ తదితరాల్లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలి. దీనికోసం విద్యాసంస్థలు కరిక్యులంను మార్చాలి.
- ప్రతి విద్యార్థి నైపుణ్యాభివృద్ధికి విజువల్ ఆర్ట్స్ లేదా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకొని, దానిపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ లాంగ్వేజెస్ సంబంధిత అంశాలను కూడా అధ్యయనానికి ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ కోసం కేటాయించిన సమయంలో తరగతులు నిర్వహించకూడదు.
- కొత్తగా ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు కంగారుపడకుండా కోర్సుపై అభిరుచిని పెంచుకునేలా చేయడం. ఫ్యాకల్టీ, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు పెంపొందించడం.
- విద్యార్థుల్లో శారీరక, మానసిక చురుకుదనం పెంపొందించడం. నచ్చిన అంశంపై అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చేయడం.
- నాలుగేళ్ల ఇంజనీరింగ్ కాలేజీ విద్యను మరిచిపోలేని అనుభూతిగా మిగిలేలా చేయడం. అన్ని విధాలా కొత్త క్యాంపస్‌ను ఆవిష్కరించడం.
ఒకవైపు కోర్ నాలెడ్జ్ పరంగా ఆధునిక నైపుణ్యాలు పొందేలా నూతన కరిక్యులంను రూపొందించిన ఏఐసీటీఈ.. మరోవైపు విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంది. మోడల్ కరిక్యులంను అనుసరించి.. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులోని 150-160 క్రెడిట్స్‌లో.. 12 క్రెడిట్స్ సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ సబ్జెక్టుల నుంచి పొందడం తప్పనిసరి. ఎన్విరాన్‌మెంట్, భారత రాజ్యాంగం, భారత సంస్కృతి అంశాలను ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వీటికి క్రెడిట్స్ ఉండవు.
Published date : 04 Dec 2017 05:47PM