బీమా రంగంలో మంచి డిమాండ్ ఉన్న యాక్చురియల్ సైన్స్.. ఉపాధి అవకాశాలు ఇలా..!
Sakshi Education
యాక్చురియల్ సైన్స్..! చాలా మందికి లైఫ్ సైన్స్, సోషల్ సైన్స్ గురించి తెలుసు. కానీ, యాక్చురియల్ సైన్స్ గురించి తెలియదు.
విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం కోర్సుల ఎంపికలో బీటెక్, ఎంబీఏలకు పరిమితం అవుతున్నారు. కాగా, కొన్నేళ్లుగా యాక్చురియల్ సైన్స్ కోర్సులు చదివిన వారికి బీమా రంగంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ).. యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(ఏసెట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యాక్చురియల్ కోర్సులతో లభించే ఉద్యోగావకాశాలు, అకడమిక్ మార్గాలు, అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం..
బీమా రంగంలో డిమాండ్..
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూ రెన్స్ వంటి బీమా సదుపాయాలపై ఆసక్తి చూపుతున్నారు. బీమా సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశ పెడుతున్నాయి. ఈ పాలసీలను ప్రవేశపెట్టే ముందే వయోవర్గం వారీగా ఇన్సూరెన్స్ అమౌంట్, చెల్లించాల్సిన ప్రీమియం, ప్రీమియం చెల్లించాల్సిన వ్యవధుల(క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, సింగిల్ ప్రీమియం తదితర)పై సమగ్ర సమాచారంతో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ గణించే వారినే యాక్చురియల్æ స్పెషలిస్ట్‌లుగా పిలుస్తున్నారు. యాక్చురియల్ నైపుణ్యాలున్న వారికి దేశ విదేశాల్లో మంచి అవకాశాలు, వేతనాలు లభిస్తున్నాయి
ప్రధాన విధులు ఇవే..
గత అనుభవాలు, వర్తమాన పరిస్థితుల ఆధారంగా.. అంచనాలను జోడించి భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను విశ్లేషించడం.. నూతన పాలసీల రూపకల్పన.. వినియోగ దారులకు ఇవ్వగలిగిన వడ్డీ.. రిస్క్ మేనేజ్‌మెంట్.. సంస్థ ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్‌ను ముందుగానే అంచనా వేయడం.. వంటివి యాక్చురియల్ స్పెషలిస్టుల ప్రధాన విధులు. అలాగే ఒక పాలసీని ప్రవేశపెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ ఉద్దేశం సరైందా.. కాదా? దీన్ని ప్రవేశ పెట్టొచ్చా.. లేదా? అనే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి.. సంస్థ యాజమాన్యానికి తగిన సూచనలు చేస్తారు.
ఉపాధి వేదికలు..
లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూ రెన్స్, ఫైనాన్స్, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థల్లో యాక్చూరియల్ ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలుంటాయి. వీరికి ప్రారంభంలోనే సగటున రూ.8 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.
అవసరమైన స్కిల్స్..
యాక్చూరియల్ నిపుణుడిగా రాణించాలనుకునే వారికి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌పై పట్టు తప్పనిసరి.
ఇంటర్మీడియట్(10+2) లేదా తత్సమాన అర్హతతో యాక్చూరియల్ సైన్స్ కోర్సులో చేరొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇంటర్‌లో కామర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి ఇది కొంత అనుకూలంగా ఉంటుంది. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన వారు, పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు సైతం ఈ కోర్సులోచేరొచ్చు.
ఇన్‌స్టిట్యూట్‌లు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా అందించే స్పెషలైజ్డ్ కోర్సుతోపాటు జాతీయ స్థాయిలో పలు ప్రముఖ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు యాక్చురియల్æ సైన్స్‌లో సర్టిఫికెట్ నుంచి పీజీ వరకు కోర్సులను అందిస్తున్నాయి. అవి..

- అనలిటికల్ స్కిల్స్
- డేటా అనాలసిస్ స్కిల్స్
- కాలిక్యులేషన్ స్కిల్స్
- రిపోర్ట్ రైటింగ్ స్కిల్స్
- కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు ఉండాలి.
ఇంటర్మీడియట్(10+2) లేదా తత్సమాన అర్హతతో యాక్చూరియల్ సైన్స్ కోర్సులో చేరొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇంటర్‌లో కామర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి ఇది కొంత అనుకూలంగా ఉంటుంది. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన వారు, పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు సైతం ఈ కోర్సులోచేరొచ్చు.
ఇన్‌స్టిట్యూట్‌లు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా అందించే స్పెషలైజ్డ్ కోర్సుతోపాటు జాతీయ స్థాయిలో పలు ప్రముఖ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు యాక్చురియల్æ సైన్స్‌లో సర్టిఫికెట్ నుంచి పీజీ వరకు కోర్సులను అందిస్తున్నాయి. అవి..
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
- నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
- యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
- నేషనల్ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–బెంగళూరు తదితర ఇన్‌స్టిట్యూట్‌లు బీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లలో యాక్చూరియల్æ సైన్స్‌ను స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి.
Published date : 18 Dec 2020 04:11PM