ఆర్కిటెక్చర్ కోర్సులకు సరైన మార్గం....నాటా-2020
Sakshi Education
పెద్దపెద్ద భవనాలు.. వాణిజ్య సముదాయాలు.. ప్రముఖ కట్టడాలు.. అన్నీ ఆర్కిటెక్చర్ల ప్రతిభకు నిదర్శనాలు. వీరు అందించిన ప్లానింగ్, డిజైన్ బ్లూప్రింట్ ఆధారంగానే నిర్మాణాలను రూపొందిస్తారు.
సృజనాత్మకత, కొత్తగా ఆలోచించడం, ఆధునికతకు అనుగుణంగా డిజైన్ల రూపకల్పన వంటి లక్షణాలు ఉంటే ఆర్కిటెక్చర్ మంచి కెరీర్‌గా నిలుస్తుంది. ఆర్కిటెక్చర్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువత బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్) కోర్సును పూర్తిచేయాలి. దేశవ్యాప్తంగా బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే నేషనల్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా)- 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నాటా 2020కు సంబంధించిన సమగ్ర సమాచారం...
ఐదేళ్ల బీఆర్క్ :
బీఆర్క్ కోర్సు వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులో భాగంగా ఆరు నెలల ప్రాక్టికల్ ట్రెయినింగ్, ప్రాజెక్ట్ వర్‌క పూర్తిచేయడం తప్పనిసరి. నాలుగో ఏడాది తర్వాత విద్యార్థులకు జ్యూరీ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బీఆర్క్ డిగ్రీ పట్టా ప్రధానం చేస్తారు. దేశంలోని ఆర్కిటెక్చర్ విద్యను, కాలేజీలను పర్యవేక్షించి, నియంత్రించే అధికారం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు ఉంది. స్వతంత్ర ప్రతిపత్తితో ఈ సంస్థ పనిచేస్తుంది. ఆర్కిటెక్చర్ విద్యను పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆర్కిటెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం ఇందులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
నాటా :
నాటాలో మంచి స్కోర్ సాధిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 450కిపైగా ఇన్‌స్టిట్యూట్స్‌లో బీఆర్క్ కోర్సులో ప్రవేశం పొందేందుకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 26 వేలకు పైగా బీఆర్క్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలతో సహా అన్ని కాలేజీలు నాటా ర్యాంకులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలను కల్పిస్తాయి. విద్యార్థుల్లో ఉన్న ఆప్టిట్యూడ్ స్కిల్స్‌ను పరీక్షించడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో డ్రాయింగ్, ఈస్థటిక్ సెన్సిటివిటీ, క్రిటికల్ థింకింగ్ వంటి అంశాలు ఉంటాయి. నాటా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. రెండుసార్లు పరీక్షకు హాజరుకావచ్చు. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు :
మొత్తం 200 మార్కులకు నాటా పరీక్ష జరుగుతుంది. నాటా పరీక్షను రెండు భాగాలుగా నిర్వహిస్తారు. ఒకటి డ్రాయింగ్ టెస్ట్, రెండు ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్. ఈ రెండింటిలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకుమాత్రమే బీఆర్క్‌లో ప్రవేశాలను కల్పిస్తారు.
పార్ట్-ఏ (డ్రాయింగ్ టెస్ట్) :
పరీక్షను ఆఫ్‌లైన్ విధానం(పేపర్ బేస్డ్)లో నిర్వహిస్తారు. మొత్తం మూడు ప్రశ్నలుంటాయి. 35, 35, 55 మార్కుల చొప్పున మొత్తం 125 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 135 నిమిషాలు. ఇందులో స్కెచ్ విజువలైజింగ్, క్రియేటివిటీ, అండర్‌స్టాండ్ స్కేల్ అండ్ ప్రపోర్షన్‌స ఆఫ్ ఆబ్జెక్ట్ట్, జియోమెట్రిక్ కాంపోజిషన్, షేప్, బిల్డింగ్ ఫామ్స్ అండ్ ఎలిమెంట్స్, కలర్ టెక్చర్స్, హార్‌మొని అండ్ కాంట్రాస్ట్, డ్రాయింగ్ ఆఫ్ ప్యాటర్న్, ఫామ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇన్ 2డీ, 3డీ, సబ్‌స్ట్రాక్షన్, రొటేషన్, సర్ఫేసెస్ అండ్ వాల్యూమ్స్, జనరేటింగ్ ప్లాన్స్ వంటి వాటిపై ప్రశ్నలుంటాయి.
పార్ట్-బి (ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్) :
మొత్తం విభాగాలు కలిపి 75 మార్కులకు జరిగే ఈ పరీక్ష కాల వ్యవధి 45 నిమిషాలు.
అద్భుత నిర్మాణాలు :
{పస్తుతం ప్రపంచం సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. అబ్బురపరిచే నిర్మాణాలు, ఆకట్టుకునే డిజైన్‌లు ఇలా ప్రతీ దానికీ అందమైనఆకృతిని ఇచ్చేనిపుణులే ఆర్కిటెక్ట్‌లు. ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణరంగం అతివేగంగా దూసుకుపోతోంది. అటువంటి నిర్మాణాలకు చక్కని రూపాన్నిచ్చే ఆర్కిటెక్ట్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రైల్వే, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, నేషనల్ బిల్డింగ్, ఆర్గనైజేషన్స్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఇలా చాలా ప్రభుత్వ, అనుబంధ విభాగాలతోపాటు ప్రయివేటు విభాగాల్లో కూడా ఉపాధి అవకాశాలుంటాయి.
ఇద్దరూ ప్రధానమే!
నిర్మాణ రంగాలకు సంబంధించి ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్.. రెండూ ముఖ్యమే! ఆర్కిటెక్చర్ అంటే..యజమానుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని వారి కళల భవనానికి ఒక రూపాన్ని ఇచ్చే వృత్తి. అలాగే సివిల్ ఇంజనీర్ ఒక నిర్మాణానికి సంబంధించి పునాదుల దగ్గర నుంచి పటిష్టత, నాణ్యత, వాస్తు, డ్రెయినేజీ, రోడ్లు తదితర అంశాలపై పనిచేయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద వంతెనలు, ప్రాజెక్టుల నిర్మాణంలో సివిల్ ఇంజనీర్‌లదే కీలక పాత్ర.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2000 (ఒకసారి పరీక్షకు), రూ.3800 (రెండుసార్లు పరీక్షకు); ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1700 (ఒకసారి పరీక్షకు), రూ.3100 (రెండుసార్లు పరీక్ష ).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 01, 2020 (ఏప్రిల్, మే సెషన్)
దరఖాస్తుకు ముగింపు తేదీ: మార్చి 16, 2020(ఏప్రిల్), మే 04, 2020 (మే సెషన్)
ఎడిట్ ఆప్షన్: మార్చి 21-23, 2020 (ఏప్రిల్), మే 09-11, 2020 ( మే సెషన్)
పరీక్ష తేదీ: 19 ఏప్రిల్ 2020, మే 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nata.in

- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్య(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో 50శాతం మార్కులు సాధించిన వారు అర్హులు.
- మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉండి, 50శాతం మార్కులతో డిప్లొమా(10+3) పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కోర్సు ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాలకు అర్హత మార్కుల్లో ఐదు శాతం సడలింపు లభిస్తుంది.
మొత్తం 200 మార్కులకు నాటా పరీక్ష జరుగుతుంది. నాటా పరీక్షను రెండు భాగాలుగా నిర్వహిస్తారు. ఒకటి డ్రాయింగ్ టెస్ట్, రెండు ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్. ఈ రెండింటిలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకుమాత్రమే బీఆర్క్‌లో ప్రవేశాలను కల్పిస్తారు.
పార్ట్-ఏ (డ్రాయింగ్ టెస్ట్) :
పరీక్షను ఆఫ్‌లైన్ విధానం(పేపర్ బేస్డ్)లో నిర్వహిస్తారు. మొత్తం మూడు ప్రశ్నలుంటాయి. 35, 35, 55 మార్కుల చొప్పున మొత్తం 125 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 135 నిమిషాలు. ఇందులో స్కెచ్ విజువలైజింగ్, క్రియేటివిటీ, అండర్‌స్టాండ్ స్కేల్ అండ్ ప్రపోర్షన్‌స ఆఫ్ ఆబ్జెక్ట్ట్, జియోమెట్రిక్ కాంపోజిషన్, షేప్, బిల్డింగ్ ఫామ్స్ అండ్ ఎలిమెంట్స్, కలర్ టెక్చర్స్, హార్‌మొని అండ్ కాంట్రాస్ట్, డ్రాయింగ్ ఆఫ్ ప్యాటర్న్, ఫామ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇన్ 2డీ, 3డీ, సబ్‌స్ట్రాక్షన్, రొటేషన్, సర్ఫేసెస్ అండ్ వాల్యూమ్స్, జనరేటింగ్ ప్లాన్స్ వంటి వాటిపై ప్రశ్నలుంటాయి.
పార్ట్-బి (ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్) :
మొత్తం విభాగాలు కలిపి 75 మార్కులకు జరిగే ఈ పరీక్ష కాల వ్యవధి 45 నిమిషాలు.
- ఈ పరీక్షలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలుంటాయి. దాంతోపాటు జనరల్ ఆప్టిట్యూడ్‌పై 35 ప్రశ్నలుంటాయి. ఇలా మొత్తం 50 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు 1.5 మార్కుల చొప్పున 75 మార్కులకు ఉంటుంది.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థుల్లోని సృజనాత్మకత, పరిశీలనాత్మక దృక్పథం, ఆర్కిటెక్చర్‌పై అవగాహన, ఇమాజినేషన్, వంటి అంశాలపై అభ్యర్థులకున్న ప్రతిభ, నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కులుండవు. కానీ పార్ట్-ఏ, పార్ట్-బిలలో రెండింటిలో 25 శాతం మార్కులు సాధిస్తేనే బీఆర్క్ కోర్సులో ప్రవేశాలకు అర్హత లభిస్తుంది.
విభాగాలు | సబ్జెక్టు | మార్కులు | సమయం |
పార్ట్ -ఏ | {yాయింగ్ | 125 | 135 ని. |
పార్ట్ -బీ | మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ అప్టిట్యూడ్ | 75 | 45 ని. |
అద్భుత నిర్మాణాలు :
{పస్తుతం ప్రపంచం సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. అబ్బురపరిచే నిర్మాణాలు, ఆకట్టుకునే డిజైన్‌లు ఇలా ప్రతీ దానికీ అందమైనఆకృతిని ఇచ్చేనిపుణులే ఆర్కిటెక్ట్‌లు. ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణరంగం అతివేగంగా దూసుకుపోతోంది. అటువంటి నిర్మాణాలకు చక్కని రూపాన్నిచ్చే ఆర్కిటెక్ట్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రైల్వే, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, నేషనల్ బిల్డింగ్, ఆర్గనైజేషన్స్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఇలా చాలా ప్రభుత్వ, అనుబంధ విభాగాలతోపాటు ప్రయివేటు విభాగాల్లో కూడా ఉపాధి అవకాశాలుంటాయి.
ఇద్దరూ ప్రధానమే!
నిర్మాణ రంగాలకు సంబంధించి ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్.. రెండూ ముఖ్యమే! ఆర్కిటెక్చర్ అంటే..యజమానుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని వారి కళల భవనానికి ఒక రూపాన్ని ఇచ్చే వృత్తి. అలాగే సివిల్ ఇంజనీర్ ఒక నిర్మాణానికి సంబంధించి పునాదుల దగ్గర నుంచి పటిష్టత, నాణ్యత, వాస్తు, డ్రెయినేజీ, రోడ్లు తదితర అంశాలపై పనిచేయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద వంతెనలు, ప్రాజెక్టుల నిర్మాణంలో సివిల్ ఇంజనీర్‌లదే కీలక పాత్ర.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2000 (ఒకసారి పరీక్షకు), రూ.3800 (రెండుసార్లు పరీక్షకు); ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1700 (ఒకసారి పరీక్షకు), రూ.3100 (రెండుసార్లు పరీక్ష ).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 01, 2020 (ఏప్రిల్, మే సెషన్)
దరఖాస్తుకు ముగింపు తేదీ: మార్చి 16, 2020(ఏప్రిల్), మే 04, 2020 (మే సెషన్)
ఎడిట్ ఆప్షన్: మార్చి 21-23, 2020 (ఏప్రిల్), మే 09-11, 2020 ( మే సెషన్)
పరీక్ష తేదీ: 19 ఏప్రిల్ 2020, మే 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nata.in
Published date : 22 Feb 2020 02:01PM