Skip to main content

ఆర్‌బీఐలో ఈ ఉద్యోగానికి ఎంపికైతే రూ.27వేల వ‌ర‌కూ వేత‌నం..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్, ప్రీ–రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఫిజికల్‌ టెస్టులను నిర్వహిస్తారు. ఈ రెండు విభాగాల్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ సహా ప్రీ–రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ల్లో అర్హత సాధించిన వారిని బ్యాంకు నిబంధనల ప్రకారం–తుది ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

పరీక్షా విధానం..
ఆన్‌లైన్‌ విధానంలో టెస్ట్‌ ఉంటుంది. ఈ పరీక్ష మూడు విభాగాల్లో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. రీజనింగ్‌ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌లో 30 ప్రశ్నలు–30 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీపై 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 80 నిమిషాలు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. సెక్షనల్‌ కటాఫ్‌ కూడా ఉండదు.

విధులు..

  • బ్యాంకు ఆస్తులకు కాపలా ఉండటం లేదా జిరాక్స్‌ యంత్రాల వద్ద పనిచేయడం, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌(డీఎఫ్‌ఎమ్‌డీ) ఎంట్రీ గేట్‌ దగ్గర తనిఖీ చేయడం లేదా బ్యాంకు నిర్ణయం ప్రకారం ఏ పని అయినా చేయడానికి సిద్దంగా ఉండాలి.
  • సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు.. నైట్‌ షిప్టులతో సహా రొటేషన్‌ ప్రకారం అన్ని షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుంది.

వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ.27,678 వరకు పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం..

  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ : 12.02.2021
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ : https://www.rbi.org.in

ఇంకా చ‌ద‌వండి: part 1: ఆర్‌బీఐలో 241 సెక్యూరిటీ గార్డ్‌ కొలువులు.. అర్హత వివ‌రాలివే..

Published date : 28 Jan 2021 04:51PM

Photo Stories