Skip to main content

ఆర్‌బీఐలో 241 సెక్యూరిటీ గార్డ్‌ కొలువులు.. అర్హత వివ‌రాలివే..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది.

ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • మొత్తం పోస్టుల సంఖ్య : 241
  • పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డ్‌(హైదరాబాద్‌–03, అహ్మదాబాద్‌–07, బెంగళూర్‌–12, భోపాల్‌–10, భువనేశ్వర్‌–08, చండీగఢ్‌–02, చెన్నై–22, గౌహతి–11, జైపూర్‌–10, జమ్మూ–04, కాన్పూర్‌–05, కోల్‌కతా–15, లక్నో–05, ముంబై–84, నాగ్‌పూర్‌–12, న్యూఢిల్లీ–17, పాట్నా–11, తిరువనంతపురం–03).
  • నియామకాల్లో భాగంగా అభ్యర్థుల తుది ఎంపిక సమయం వరకు పోస్టుల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించే అధికారం ఆర్‌బీఐకి ఉంది.

అర్హతలు..

  • పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతలను కలిగి ఉండాలి. రక్షణ దళాల్లో ఎక్స్‌సర్వీస్‌మెన్‌ సేవలను అందించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు.
  • వయసు: 01.01.2021 నాటికి 25–28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.

ఇంకా చ‌ద‌వండి: part 2: ఆర్‌బీఐలో ఈ ఉద్యోగానికి ఎంపికైతే రూ.27వేల వ‌ర‌కూ వేత‌నం..

Published date : 28 Jan 2021 04:50PM

Photo Stories