Skip to main content

అంతరిక్షంపై ‘పీహెచ్‌డీ’

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఒకటి.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ).
కేంద్ర అంతరిక్షశాఖ పరిధిలోని ఈ సంస్థ.. స్పేస్‌కు సంబంధించి బీటెక్, ఎంటెక్ కోర్సుల్లోనే కాక..పతీ ఏడాది డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌ల్లోనూ ప్రవేశాలు కల్పిస్తోంది. ఇటీవల 2020 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వివరాలు...

అంతరిక్ష విద్యకు పెట్టింది పేరు:
దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కోర్సులను అందించే ప్రతిష్టాత్మక సంస్థగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి (ఐఐఎస్‌టీ) మంచి గుర్తింపు ఉంది. 2007లో ఐఐఎస్‌టీ ఏర్పాటైంది. ఈ సంస్థ ఇంటర్మీడియట్ తర్వాత అంతరిక్ష రంగానికి సంబంధించి అండర్‌గ్రాడ్యుయేషన్ నుంచి డాక్టోరల్ వరకూ.. పలు కోర్సులను అందిస్తోంది. ఆసియాలోనే పూర్తిస్థాయి అంతరిక్ష కోర్సులను అందించే సంస్థగా ఐఐఎస్‌టీ ప్రసిద్ధిగాంచింది. ఆయా ప్రోగ్రామ్స్ పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఇస్రోలో ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, వివిధ హోదాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తొంది.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్:
డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు కలిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) ఏడాదికి రెండుసార్లు డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది.

విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్.

అర్హతలు..
  • భారతీయ పౌరుడై ఉండాలి.
  • 11.11.2019 నాటికి వయసు 35 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
  • ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో 65శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓబీసీలకు 60 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీడీలకు 55 శాతం మార్కులు తప్పనిసరి. గేట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఇంజనీరింగ్/టెక్నాలజీలో పీజీ పూర్తిచేసుండాలి.
ఎంపిక ప్రక్రియ :
  • ఎంఈ, ఎంటెక్ అర్హత కలిగిన అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్య్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంఈ/ఎంటెక్ తర్వాత సీఎస్‌ఐఆర్/నెట్-జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్‌నెట్ లెక్చరర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలకు పిలిచి ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష కేంద్రాలు : తిరువనంతపురం, న్యూఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, హైదరాబాద్, చెన్నై.

దరఖాస్తు విధానం :
  • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఒకసారి దరఖాస్తు పూర్తిచేసిన తర్వాత ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు.
  • కాబట్టి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే జాగ్రత్తగా వ్యవహరించాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.700, అలాగే ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగులు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ముగింపు తేదీ: నవంబర్ 11, 2019
షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల వివరాలు: నవంబర్ 19
స్క్రీనింగ్ టెస్ట్: డిసెంబర్ 01, 2019
స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు: డిసెంబర్ 06, 2019
ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 16, 17, 2019
ప్రోవిజినల్ సెలక్షన్ లిస్ట్: డిసెంబర్ 23, 2019
రిపోర్టింగ్ తేదీ: జనవరి 01, 2020
తరగతుల ప్రారంభం: జనవరి 02, 2020
వెబ్‌సైట్: http://admission.iist.ac.in
Published date : 06 Nov 2019 02:13PM

Photo Stories