Skip to main content

ఐకార్ యూజీ-2019

ప్రస్తుతం దేశంలో వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నైపుణ్యాలున్న మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. వివిధ కోర్సులు పూర్తిచేయడం ద్వారాఅవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.తాజాగా వ్యవసాయ విద్య, పరిశోధనల సమన్వయం, నిర్వహణకు అత్యున్నత సంస్థగా ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్).. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ (ఏఐఈఈఏ)-యూజీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా నోటిఫికేషన్ వివరాలు...
సీట్ల వివరాలు..
ఐకార్-ఏఐఈఈఏ (యూజీ) ద్వారా దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని వ్యవసాయ, అనుబంధ (వెటర్నరీ కోర్సులు మినహా) విభాగాల్లోని బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఈఈఏ యూజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఝాన్సీలోని రాణీ లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కర్నాల్‌లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పూసాలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని 100 శాతం సీట్లను ఏఐఈఈఏ ద్వారా భర్తీ చేస్తారు.

పరీక్ష విధానం :
పరీక్ష విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ).
  • ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
ప్రశ్నల సంఖ్య: 150 (మూడు సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి).
మార్కులు: ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు.
నెగిటివ్ మార్కులు: తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
పరీక్ష సమయం: రెండున్నర గంటలు.
ప్రశ్నల కాఠిన్యత: ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది.
పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, హిందీ.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

కోర్సులు-అర్హతలు..
విద్యార్హతలు:
బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ :
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/ అగ్రికల్చర్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
బీఎస్సీ (ఆనర్స్) హర్టీకల్చర్ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/అగ్రికల్చర్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీఎఫ్‌ఎస్సీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్) : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ/అగ్రికల్చర్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ/అగ్రికల్చర్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
  • ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ (ఈ కోర్సులో ప్రవేశాలు నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డ్ గుర్తింపుపై ఆధారపడి ఉంటుంది). ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్,బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీఎస్సీ (ఆనర్స్) సెరీకల్చర్ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీటెక్ డెయిరీ టెక్నాలజీ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీటెక్ ఫుడ్ టెక్నాలజీ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీటెక్ బయోటెక్నాలజీ : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ/ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.

కనీస మార్కులు: అర్హత పరీక్షలో జనరల్, ఓబీసీ (ఎన్‌సీఎల్), యూపీఎస్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.
వయసు: 2019, ఆగస్టు 31 నాటికి కనీస వయసు 16 ఏళ్లు. కనీస వయసు విషయంలో ఎలాంటి సడలింపు వర్తించదు.

ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
ఏప్రిల్ 30, 2019.
పరీక్ష ఫీజు: జనరల్, అన్ రిజర్వ్‌డ్, ఓబీసీ (ఎన్‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.350.
హాల్ టిక్కెట్ల జారీ: 2019, జూన్ 5 నుంచి.
పరీక్ష తేదీ: జూలై 1, 2019.
కౌన్సెలింగ్: ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nta.ac.in, www.ntaicar.nic.in
Published date : 09 Apr 2019 05:44PM

Photo Stories