ఐఐటీలు, ఐఐఎంలలో విద్యార్థినుల నమోదు...
Sakshi Education
‘ప్రాథమిక స్థాయి నుంచి వృత్తి విద్య వరకు విద్యార్థినుల సంఖ్యను పెంచేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..
ఇప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా ఉన్నత చదువుల విషయంలో నమోదు ఆశాజనకంగా ఉండటం లేదు. సాంకేతిక విద్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది మరింత స్పష్టం’
-విద్యావేత్తల అభిప్రాయం
ఇది నిజమేనా అంటే..? ఐఐటీలు, ఐఐఎంలలో 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థినుల గణాంకాలే నిదర్శనం అనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో.. ఐఐటీలు, ఐఐఎంలలో విద్యార్థినుల నమోదు పరిస్థితిపై విశ్లేషణ.
ఇంజనీరింగ్‌పై ఆసక్తే కానీ..
ఓ వైపు ఉన్నత విద్య, ప్రధానంగా సాంకేతిక విద్య, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులపై అమ్మాయిల ఆసక్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏటా ఇంజనీరింగ్ కోర్సులు ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల్లో 30 శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు. కానీ.. ఇంజనీరింగ్ విద్యకు ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటీల్లో చేరే విద్యార్థినుల సంఖ్య ఆశాజనకంగా ఉండటం లేదు. మూడేళ్ల గణాంకాలే దీనికి నిదర్శనం. 2014లో ఐఐటీల్లో చేరిన మొత్తం విద్యార్థుల్లో అమ్మాయిల శాతం 8.8 కాగా.. 2015లో 9 శాతం నమోదైంది. 2016లో ఏకంగా ఒక శాతం తగ్గి 8 శాతంగా నమోదైంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్-2017లో 20.8 శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. 12 శాతం మంది మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని ఐఐటీల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఐటీల్లో అందుబాటులోని 10,988 ఇంజనీరింగ్ సీట్లకుగాను 1,319 మంది అమ్మాయిలు యాక్సప్టెన్స్ ఇచ్చినట్లు సమాచారం.
వచ్చే ఏడాది నుంచి 20 శాతం ప్రత్యేక సీట్లు...
ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్యను పెంచేందుకు ఐఐటీల జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం వచ్చే ఏడాది నుంచి ఐఐటీల్లో మొత్తం అందుబాటులో ఉన్న సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను సూపర్ న్యూమరీ సీట్లుగా అమ్మాయిలకే కేటాయించాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థినుల సంఖ్యను గణనీయంగా పెంచొచ్చని జేఏబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక సదుపాయాలు సైతం :
ఐఐటీల్లో చేరిన అమ్మాయిలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం ద్వారా ఇంకొందరు స్ఫూర్తిపొందేలా ఇప్పటికే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు ఐఐటీ-మండిలో మొదటి సంవత్సరం హాస్టల్, భోజన సదుపాయం ఉచితంగా అందించడంతో పాటు నెలకు రూ.వెయ్యి ఉపకార వేతనం ఇవ్వనున్నారు. ఇలాంటి విధానాన్ని అవలంబించడంపై మరికొన్ని ఐఐటీలూ దృష్టిసారిస్తున్నాయి.
అక్కడ మెరుగు ఎందుకంటే..
మేనేజ్‌మెంట్ విద్యను అందించడంలో పేరుగాంచిన ఐఐఎంల్లో చేరే విద్యార్థినుల సంఖ్య కాస్త మెరుగనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం ఏకంగా 26 శాతం పెరగడం విశేషం. ప్రస్తుతం ఐఐఎంలలో మొత్తం విద్యార్థుల్లో 30 శాతం మహిళలు ఉన్నట్లు అంచనా. ఐఐఎంలలోనే ఉత్తమమైనదిగా భావించే అహ్మదాబాద్‌లో 2017-19 పీజీ ప్రోగ్రామ్‌లో 38 శాతం మంది మహిళలు ప్రవేశం పొందారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 9 శాతం ఎక్కువ. ఇతర ప్రముఖ ఐఐఎంలు బెంగళూరు, కోల్‌కతా, కోజికోడ్‌లలో సైతం మహిళల సంఖ్య 25 నుంచి 30 శాతం మధ్యలో ఉంది. ఐఐఎంలు తమ ప్రవేశ ప్రక్రియలో అనుసరిస్తున్న జండర్ డైవర్సిటీ విధానం వల్ల ఇప్పుడిప్పుడే సానుకూల ఫలితాలు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
పీజీ స్థాయిలో చైతన్యం :
ఇంజనీరింగ్, సైన్స్‌లో బ్యాచిలర్ స్థాయి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థినుల్లో పీజీ చదవాలనే అభిలాష పెరుగుతోంది. పీజీ స్థాయిలో సైన్స్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ కోర్సులు అభ్యసించేందుకు వీరు ఆసక్తి చూపుతున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గేట్, జీప్యాట్, క్యాట్‌లలో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్యే ఇందుకు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు.
మారుతున్న కంపెనీల దృక్పథం :
పీజీ స్థాయిలో మహిళల సంఖ్య పెరగడానికి మరో ముఖ్య కారణం.. కెరీర్ కోణంలో నియామకాలపరంగా కంపెనీల దృక్పథంలోనూ క్రమేణా మార్పు వస్తుండటమే. ప్రస్తుతం పలు కార్పొరేట్ సంస్థలు సైతం జండర్ డైవర్సిటీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అర్హులైన మహిళలను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్, సర్వీస్ సెక్టార్‌లోని సంస్థల్లో మహిళలకు ఎంట్రీ లెవల్ నుంచి కీలక స్థాయి హోదాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థినిలు పీజీ స్థాయి కోర్సులు అభ్యసించేందుకు ఆసక్తి చూపడంలో కారణంగా నిలుస్తున్నాయి.
బ్యాచిలర్‌లో ప్రతికూలతలకు కారణం?
సామాజిక, ఆర్థిక పరిస్థితుల రీత్యానే విద్యార్థినులు బ్యాచిలర్ స్థాయిలో సైన్స్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ కోర్సుల పట్ల నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారనేది నిపుణుల విశ్లేషణ. ఈ విషయంలో తల్లిదండ్రుల్లోనూ కొంత ఆందోళన ఏర్పడటం మరో కారణంగా మారుతోంది. అంతేకాకుండా రిస్క్ లేని కెరీర్స్, అందుకు మార్గం వేసే కోర్సుల దిశగా అన్వేషణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ సెన్సైస్, సోషల్ వర్క్, మెడికల్ వంటివాటి వైపు ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు.
ఇన్‌స్టిట్యూట్‌లు, సీట్ల విస్తరణ పరిష్కారమేనా?
సైన్స్, టెక్నాలజీ కోర్సుల్లో విద్యార్థినుల భాగస్వామ్యం పెంచే దిశగా సూపర్ న్యూమరీ సీట్లు, ఇన్‌స్టిట్యూట్ల విస్తరణ సత్ఫలితాలనిస్తాయా? అంటే విద్యావేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని పెంచడానికి ముందుగా విద్యార్థినులు, తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు తీసుకురావాలని, ఆ మేరకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఫలితం వేళ్ల మీద లెక్కించేదిగా ఉంటుందే తప్ప.. విప్లవాత్మక మార్పు ఆశించలేం అని అంటున్నారు.
విద్యార్థినుల దృక్పథం ఇలా..
ఇంజనీరింగ్...

- రిస్క్‌తో కూడిన విభాగం
- కెరీర్‌పరంగా ఫీల్డ్ వర్క్ ఎక్కువ
- ఉద్యోగాల కోణంలోనూ స్వస్థలానికి దూరంగా నివసించాల్సిన పరిస్థితి
మేనేజ్‌మెంట్...
- ఆఫీస్ కార్యకలాపాల నిర్వహణ. ఫలితంగా ఫీల్డ్ వర్క్ తక్కువ
- అకడమిక్ అభ్యసనం కోణంలోనూ సానుకూల వాతావరణం
- కెరీర్‌పరంగా ఉన్నత స్థానాలకు త్వరగా చేరుకునే అవకాశం.
తల్లిదండ్రుల దృక్పథం మారాలి...
అమ్మాయిలకు ఉన్నత విద్య అందించే విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి. వారిని ప్రోత్సహిస్తే ఇప్పుడు ఎన్నో అవకాశాలు.. వాటిని అందుకునేందుకు మరెన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిభావంతులైనప్పటికీ కొత్త ప్రాంతాల్లో నెగ్గుకు రాలేరనో, సామాజిక భద్రత వంటి కారణాలతోనో పిల్లలను ఇంటికే పరిమితం చేయడం సరికాదు.
-ప్రొఫెసర్ కేవీ కృష్ణారావు, ఐఐటీ-ముంబై

Published date : 14 Sep 2017 01:48PM