Skip to main content

ఆగస్టు 7న నిట్‌ల్లో ఎంసీఏ అడ్మిష‌న్స్‌కి నిమ్‌సెట్‌

దేశంలో ఐఐటీల తర్వాత అంతటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీలు)లు. వీటిల్లో మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సులో ప్రవేశాలకు ప్రతి ఏటా నిర్వహించే పరీక్ష ‘నిమ్‌సెట్‌’.

ఈ సెట్ స్కోరుతో ఎన్‌ఐటీలతోపాటు పలు విద్యాసంస్థల్లో ఎంసీఏలో ప్రవేశం పొందొచ్చు. ఈ ఏడాది నిమ్‌సెట్‌–2021ను రాయ్‌పూర్ ఎన్‌ఐటీ నిర్వహిస్తోంది. తాజాగా ఈ పరీక్షను ఆగస్టు 7న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. నిమ్‌సెట్‌తో ప్రవేశం కల్పించే నిట్‌లు.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

నిమ్‌సెట్‌ అంటే.. నిట్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌! నిమ్‌సెట్‌ ద్వారా పదకొండు నిట్‌లు ఎంసీఏ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నిట్‌ అగర్తాల, అలహాబాద్, భోపాల్, కాలికట్, జంషెడ్‌పూర్, కురక్షేత్ర, పాట్నా, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి, వరంగల్‌ల్లో దాదాపు 951 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ/బీఎస్సీ(హానర్స్‌)/బీసీఏ /బీబీఏ(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు నిమ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

పరీక్ష విధానం..

  • నిమ్‌సెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ప్రశ్న పత్రంలో 120 మల్టిపుల్‌ చాయిస్‌ ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి.
  • పరీక్షలో మ్యాథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 40 ప్రశ్నలు, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ నుంచి 10 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.
  • నిమ్‌సెట్‌ మొత్తం 120 ప్రశ్నలు–480 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
  • ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులుSలభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

సిలబస్‌–మ్యాథ్స్‌..

  • మొత్తం నాలుగు విభాగాల్లో మ్యాథమెటిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విభాగం నుంచే అధిక ప్రశ్నలు(50) ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే సిలబస్‌ కూడా విస్తృతంగానే ఉంటుంది.
  • త్రికోణమితి: హైట్స్‌ అండ్‌ డిస్టెన్స్‌, సొల్యూషన్స్‌ ఆఫ్‌ ట్రయాంగిల్స్, జనరల్‌ సొల్యూషన్స్‌ ఆఫ్‌ ట్రిగనోమెట్రిక్‌ ఈక్వేషన్స్‌, సింపుల్‌ ఐడెంటిటీస్, ట్రిగనోమెట్రిక్‌ ఈక్వేషన్స్‌–ప్రాపర్టీ ఆఫ్‌ ట్రయాంగిల్స్‌ అంశాలు ఉంటాయి.
  • కాలిక్యులస్‌: సింపుల్‌ ఎగ్జాంపుల్స్‌ ఆఫ్‌ మాగ్జి మా అండ్‌ మినిమా, డిఫరెన్స్‌ సేషన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌, డెఫినేట్‌ ఇంటిగ్రల్స్, లిమిట్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌, టాగ్నెట్స్‌ అండ్‌ నార్మల్స్, అప్లికేషన్స్‌ ఆఫ్‌ డెఫినెట్‌ ఇంటిగ్రల్స్‌ టు ఏరియాస్, కంటిన్యూస్‌ ఫంక్షన్‌, ఇంటిగ్రేషన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌, బై సబ్‌స్టిట్యూషన్‌ అండ్‌ బై పార్షియల్‌ ఫార్మేషన్‌.
  • వెక్టార్స్‌: స్కాలర్‌ అండ్‌ వెక్టార్‌ ప్రొడక్ట్స్, అండ్‌ దెయిర్‌ అప్లికేషన్స్‌ టు సింపుల్‌ జియోమెట్రికల్‌ ప్రాబ్లమ్స్‌ అండ్‌ మెకానిక్స్, పొజిషన్‌ వెక్టర్, అడిషన్‌ అండ్‌ సబ్‌ట్రాక్షన్‌ ఆఫ్‌ వెక్టార్స్‌.
  • ఆల్జీబ్రా: ఫండమెంటల్‌ ఆపరేషన్స్ ఇన్‌ ఆల్జీబ్రా, జియోమెట్రిక్‌ అండ్‌ హార్మోనిక్‌ ప్రోగ్రెషన్స్‌, ఎక్స్‌పాన్సియన్స్‌, లాగర్‌థెమ్స్, సైమల్టేనియస్‌ లైనర్‌/క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డిటర్మినెంట్స్‌ అండ్‌ మాట్రిక్స్, ఫాక్టరైజేషన్‌, ఇన్‌డీసెస్, అర్థమెటిక్‌.

ఊ సెట్‌ థియరీ: కాన్సెప్ట్‌ ఆఫ్‌ సెట్స్‌–యూనియన్‌, ఇంటర్‌సెషన్‌, కార్డినాలిటీ, ఎలిమెంటరీ కౌం టింగ్, పర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌.
ఊ కో ఆర్డినేట్‌ జామెట్రీ: ఈక్వేషన్స్‌ ఆఫ్‌ ఎ సర్కిల్, ఎలిప్స్, ఈక్వేషన్‌ ఆఫ్ లైన్‌, రెక్టాంగ్యులర్‌ కార్టేసన్‌ కోఆర్డినేట్స్, పారాబోలా, హైపర్‌బోలా, డిస్టెన్స్‌ ఫార్ములా, ఇంటర్‌సెక్షన్‌ ఆఫ్‌ లైన్స్‌, పెయిర్‌ ఆఫ్‌ స్ట్రెయిట్‌ లైన్స్‌.
ఊ ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌: బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ ప్రాబబిలిటీ థియరీ, యావరేజెస్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్‌, డిస్పెర్‌సియన్‌, డిపెండెంట్‌ అండ్‌ ఇండిపెండెంట్‌ ఈవెంట్స్,మెజర్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ టెండెన్సీస్‌ తదితర అంశాలుంటాయి.

అనలిటికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌..
ఈ విభాగం నుంచి మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా అభ్యర్థి విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు వస్తాయి.

జనరల్‌ ఇంగ్లిష్‌..
ఇది విద్యార్థి ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తెలుసుకునేందుకు ఉద్దేశించిన విభాగం. ఇందులో గ్రామర్, కాంప్రెహెన్షన్‌, వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్, టెక్నికల్‌ రైటింగ్, యాంటోనిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్‌ వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి.

కంప్యూటర్‌ అవేర్‌నెస్‌..
ఇది విద్యార్థి ప్రా«థమిక కంప్యూటర్‌ పరిజ్ఞానం పరీక్షించేదిగా ఉంటుంది. ఇందులో డేటా రిప్రజెంటేషన్‌, కంప్యూటర్‌ బేసిక్‌ విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో.. వెన్‌ డయాగ్రమ్స్, బైనరీ అండ్‌ హెక్సాడెసిమల్‌ రిప్రజెంటేషన్స్‌, సింపుల్‌ అర్థమెటిక్, కాంప్లిమెంట్‌ అర్థమెటిక్, రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ క్యారెక్టర్స్, ట్రూత్‌ టేబుల్స్, ఇంటీజర్స్‌ అండ్‌ ఫ్రాక్షన్స్‌, బూలెన్‌ ఆల్జీబ్రా, బైనరీ అర్థమెటిక్‌– ఎడిషన్‌, సబ్‌ట్రాక్షన్‌, మల్టిప్లికేషన్‌, డివిజన్, ఫ్లోటింగ్‌–పాయింట్‌ రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ నంబర్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనే రెండో విభాగం కంప్యూటర్‌ బేసిక్స్‌ నుంచి మరికొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా.. సీపీయూ(సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌), ఇన్‌పుట్‌/అవుట్‌పుట్‌ డివైజెస్, ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఏ కంప్యూటర్, బ్యాకప్‌ డివైజెస్, స్ట్రక్చర్‌ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్‌ సీపీయూ, కంప్యూటర్‌ మెమొరీ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.

పరీక్ష సరళి..
ఊ నిమ్‌సెట్‌ అనేది జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష. కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పరీక్షకు కొద్దిరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఇప్పటికే సిలబస్‌ చదవడం పూర్తిచేసి ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో ఎక్కువగా ప్రశ్నపాత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. దీనిద్వారా ఏ విభాగంలో వెనుకబడి ఉన్నారో ఒక అంచనాకు రావొచ్చు.
ఊ ఇప్పటికే సొంతంగా రాసుకున్న నోట్స్‌ను ప్రతిరోజూ చదవాలి. కొంత సమయాన్ని రివిజన్‌ కోసం కేటాయించుకోవాలి. దీనివల్ల ఏరోజుకారోజు సిలబస్‌ను ఒకటికి రెండుమూడుసార్లు చదివినట్టు అవుతుంది.

ఊ పరీక్ష ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 120 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. అంటే.. ఒక్కో ప్రశ్నకు నిమిషం వ్యవధి మాత్రమే ఉంటుంది. అందువల్ల మొదట బాగా తెలిసిన ప్రశ్నలకు(అర నిమిషంలోగా) జవాబులు గుర్తించాలి. ఇక్కడ మిగిలిన అదనపు సమయాన్ని కాస్త ప్రాక్టీస్‌ చేస్తే సమాధానాలు గుర్తించగలిగే వాటికి కేటాయించవచ్చు. చివరిగా పేపర్‌ పరిశీలనకు కనీసం 10 నిమిషాలు సమయం ఉండేలా చూసుకోవాలి. తద్వారా పరీక్షలో మంచి స్కోరు సాధించేందుకు వీలుంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nimcet.in
Published date : 29 Jul 2021 06:20PM