Skip to main content

అధునాతన సాంకేతిక నైపుణ్యాలు.. రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం ఇదే..

నీట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం విద్యార్థులకు ట్రెడిషనల్‌ కోర్సులతోపాటు టెక్నికల్‌ కోర్సులను అభ్యసించే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. ఏఐసీటీఈతో ఒప్పందం చేసుకున్న పలు ఎడ్‌టెక్‌ సంస్థలు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అంశాల్లో ఆన్‌లైన్‌ లెర్నింగ్, వర్చువల్‌ టీచింగ్‌ అవకాశాలను కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయా అంశాల బోధనలో పేరున్న సంస్థలతో ఏఐసీటీఈ ఒప్పందం చేసుకుంది.

అందుకోవడానికి మార్గం..
నీట్‌ పోర్టల్‌ ద్వారా.. విద్యార్థులు ఆన్‌లైన్‌ లెర్నింగ్, ఇతర నైపుణ్యాలు, సేవలు అందుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌ పోర్టల్‌ (https://neat.aicte-india.org)  తమ పేరు రిజిస్టర్‌ చేసుకొని.. లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తమకు ఆసక్తి గల కోర్సుల వివరాలను, వాటిని అందిస్తున్న ఎడ్‌ టెక్‌ సంస్థల సమాచారం వీక్షించే అవకాశం లభిస్తుంది. సదరు ఎడ్‌ టెక్‌ సంస్థలకు, వాటి కోర్సులకు జాబ్‌ మార్కెట్‌లో ఉన్న గుర్తింపు గురించి కూడా తెలుసుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులు మెరుగైన ఎడ్‌టెక్‌ సంస్థను ఎంచుకునే వీలుంటుంది.
 
Published date : 02 Mar 2021 03:26PM

Photo Stories