2021 మధ్య వరకు టెక్నాలజీ ఆధారిత బోధనకే అవకాశం ఎక్కువ..
Sakshi Education
కొవిడ్ వ్యాక్సిన్ 2021 మధ్య వరకు లేదా చివరి నాటికీ ప్రతి ఒక్కరికీ చేరకపోవచ్చు.
కాబట్టి విద్యా వ్యవస్థ అప్పటివరకూ యదాతథ స్థితికి తిరిగి రావడం కష్టమే. ఒకవేళ స్కూళ్లు, కాలేజీలు తెరిచి తరగతులు ప్రారంభించినా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గదుల్లో సామాజిక దూరం పాటిస్తూ కూర్చోవాలి. గతంలో ఒక గదిలో ఉండే విద్యార్థులను రెండు లేదా మూడు గదుల్లోకి సర్దాలి. చిన్నచిన్న గదుల్లో జరిగే బోధనను విశాలమైన ప్రాంగణాల్లోకి మార్చాలి. విద్యార్థులు వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. ప్రతి అవసరానికి చేతులు తగలకుండా.. క్యాంటీన్స్, ఆడిటోరియం, రెస్ట్‌రూమ్స్‌కు ఆటో సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మన దేశంలో తక్షణమే అమల్లోకి రావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది అంటున్నారు నిపుణులు.
డిజిటల్ విద్యారంగం..
మనదేశంలో డిజిటల్ ఎడ్యుకేషన్ విధానం కొంతకాలం క్రితమే ప్రారంభమైనప్పటికీ.. 2020 మొదటి నాలుగు నెలల వరకు కనీసం 15శాతం మందికి కూడా చేరువ కాలేదు. కొవిడ్–19తో పలు ప్రైవేట్ పాఠశాలలు, కళశాలలు డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యేక యాప్స్, వీడియో పాఠాల ద్వారా బోధన చేపట్టారు. సాఫ్ట్‌వేర్ సంస్థలు సైతం ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. కొవిడ్ ప్రబలిన ఆరు నెలల్లోనే డిజిటల్ ఎడ్యుకేషన్ రంగ మార్కెట్ 50 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో దాదాపు 26కోట్ల మంది విద్యార్థులు వివిధ స్థాయి కోర్సులు అభ్యసిస్తున్నారని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సంస్థలు, పోటీ పరీక్షల ప్రిపరేషన్‌తోపాటు మల్టీమీడియా, టెక్నాలజీ ఆధారిత క్లాసులు రూపొందించేందుకు ఎడ్యుటెక్ స్టార్టప్‌లు రంగంలోకి దిగాయి. దీని మూలంగా దేశంలో డిజిటల్ విద్యా రంగం వేగంగా వృద్ధి చెందుతోంది.
టెక్నాలజీ ఆధారిత బోధన..
కొవిడ్ బోధనా విధానాల్ని సమూలంగా మార్చేసిందనడంలో సందేహం లేదు. గతంలో 30 మంది విద్యార్థులకు ఒక సబ్జెక్టును ఒక టీచర్ బోధిస్తే.. ఇప్పుడు డిజిటల్ పాఠాలను పది మంది ఉపాధ్యాయులతో రూపొందించి 30మంది విద్యార్థులకు అందిస్తున్నారు. అంటే.. సగటున ముగ్గురు విద్యార్థులకు ఓ టీచర్‌తో ఆన్‌లైన్ బోధన జరుగుతోంది. ఉన్నత స్థాయిలో సైతం ఉపాధ్యాయులు/లెక్చరర్లు వెబినార్ పాఠాలను సిద్ధం చేసుకొని ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠాలను లోతుగా అధ్యయనం చేసి.. రికార్డు చేసి అందుబాటులోకి తెస్తున్నారు. విద్యార్థులకు స్మార్ట్ బోధన అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఒక విధంగా ఇది విద్యార్థులకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. సులభంగా అర్థమయ్యే రీతిలో చిత్రాలు, బొమ్మలు వంటి యానిమేషన్ ప్రక్రియల ద్వారా బోధన చేయడం వల్ల.. విద్యార్థులు మరింత స్మార్ట్‌గా అవగాహన చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇంకా చదవండి: part 3: డిజిటల్ తరగతుల కోసం తక్కువ కాలంలో.. విద్యార్థులు వీటి గురించి తెలుసుకోవాల్సిందే..

Published date : 18 Dec 2020 03:50PM