విద్యకు రూ. 10,956 కోట్లు
Sakshi Education
విద్యారంగానికి రూ. 10,956 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను కలుపుకొని ఈ మొత్తాన్ని ప్రతిపాదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయంగా రూ. 3,418 కోట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో బడ్జెట్‌లో విద్యా రంగానికి 10.88 శాతం నిధులు దక్కాయి.
(సర్వశిక్ష అభియాన్(రూ. 1,068 కోట్లు)తోపాటు మధ్యాహ్న భోజన పథకం, సాంకేతిక విద్యాభివృద్ధి, రూసా, ఉన్నత విద్య, ఆర్‌ఎంఎస్, మోడల్ స్కూల్స్‌కు మొత్తంగా రూ. 3,418.89 కోట్లు కేంద్రం నుంచి సాయంగా అందుతుంది. ఇవి కూడా బడ్జెట్ కేటాయింపుల్లో భాగమే.)
- కేజీ టు పీజీ పథకానికి ముందస్తు ఏర్పాట్ల కోసం రూ. 25 కోట్లు
- రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రూ. 10 కోట్లు
- సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న బాసరలోని ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి రూ. 119.63 కోట్లు
- కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే మోడల్ స్కూళ్ల అభివృద్ధికి రూ. 904.73 కోట్లు
- ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయ శిక్షణ కోసం రూ. 906.43 కోట్లు
- ఇంటర్మీడియట్ విద్యకు రూ. 426.45 కోట్లు
- గిరిజన ప్రాంతాల్లో హాస్టల్ వసతితో కూడిన 5 పాలిటెక్నిక్ కాలేజీలు, ఎస్సీలకు పాలిటెక్నిక్ భవనాల నిర్మాణానికి రూ. 7.49 కోట్లు
- కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం గనుల పాఠశాల నిర్వహణ కోసం రూ. 1.89 కోట్లు
- కరీంనగర్‌లో ఏర్పాటు చేసే కొత్త ఇంజనీరింగ్ కాలేజీ కోసం జేఎన్టీయూకు రూ. 3.75 కోట్లు
యూనివర్సిటీలకు ప్రభుత్వం రూ. 292.02 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. రాష్ట్ర విభజనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీపద్మావతి మహిళ విశ్వ విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకొమ్మని రాష్ట్ర అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో మాత్రం ఆ యూనివర్సిటీకి వేతనాలు, ఇతర గ్రాంట్ల కింద రూ. 10 కోట్లు కేటాయించారు.
- ద్రవిడ విశ్వ విద్యాలయానికి రూ. 3.22 కోట్లు
- మంథని జేఎన్‌టీయూ కాలేజీకి రూ. 170 కోట్లు
- సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ కాలేజీకి రూ. 50 కోట్లు
- ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 170.14 కోట్లు
- కాకతీయ యూనివర్సిటీకి రూ. 47.88 కోట్లు
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి రూ. 6.75 కోట్లు
- అంబేద్కర్ విశ్వ విద్యాలయానికి రూ. 5.74 కోట్లు
- తెలంగాణ వర్సిటీకి రూ. 20 కోట్లు
- మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రూ. 15 కోట్లు
- శాత వాహన యూనివర్సిటీకి రూ. 8 కోట్లు
- పాలమూరు యూనివర్సిటీకి రూ. 4.78 కోట్లు
- హైదరాబాద్ జేఎన్‌టీయూకు రూ. 39 కోట్లు
శాఖ | ప్రణాళిక | ప్రణాళికేతర | మొత్తం |
పాఠశాల విద్య | 3,510.56 | 5,824.56 | 9,335.12 |
ఉన్నత విద్య | 153.34 | 1,073.92 | 1,227.26 |
సాంకేతిక విద్య | 212.85 | 181.11 | 393.96 |
Published date : 06 Nov 2014 03:56PM