Skip to main content

Union Budget 2025 Zero income Tax Upto Rs 12 Lakh: బ్రేకింగ్‌ న్యూస్‌.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
Union Budget 2025 Zero income Tax Upto Rs 12 Lakh
Union Budget 2025 Zero income Tax Upto Rs 12 Lakh

పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుంది. వివిధ మినహాయింపులు, మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు.

ఇందులోని కీలక ఫీచర్లు ఇవే..

వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు.

Nirmala Sitharaman Speech Union Budget 2025 Live Updates

Budget Live Updates 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26లో విద్యారంగానికి ఇచ్చిన వ‌రాల జ‌ల్లులు ఇవే...! ఎక్కువ‌గా దీనికే...

ఉదాహరణకు, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంది. వేతన ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఇది వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఈ కొత్త విధానం వల్ల దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Feb 2025 10:18AM

Photo Stories