Skip to main content

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6.08 శాతం వృద్ధి

2004-05 స్థిర ధరల ప్రకారం.. 2012-13లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 2,35,930 కోట్లు. 2013-14లో రూ. 2,50,282 కోట్లకు పెరుగుతుందని.. అంటే 6.08 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా. తలసరి ఆదాయం రూ. 42,186 నుంచి రూ. 44,481కు.. అంటే 5.4 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా.

తలసరి అప్పు రూ. 22,395
ఉమ్మడి రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం వరకు రూ. 1,78,348 కోట్ల అప్పు ఉండగా.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,10,634 కోట్ల అప్పు ఉంటుందని ఆర్థికశాఖ లెక్క తేల్చింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పాదకతలో 21.13 శాతంగా ఉంది. రాష్ట్రం విడిపోయిన తరువాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 4.94 కోట్ల మంది జనాభా ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న రాష్ట్ర మొత్తం అప్పులో ఒక్కొక్కరి తలపై 22,395 రూపాయలు అప్పు ఉన్నట్లు తేలింది. ఇదిలావుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల ద్వారా మొత్తం రూ. 16,366 కోట్లు అప్పు చేయనుంది.

బహిరంగ మార్కెట్

10,532 కోట్లు

విదేశీ సంస్థలు

1,000 కోట్లు

కేంద్ర ప్రభుత్వం

978 కోట్లు

నాబార్డు తదితర రంగాల ద్వారా

2,994 కోట్లు,

డిపాజిట్ల బదిలీల ద్వారా

862

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటులు

8,000 కోట్లు



గత పది సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మిగుల్లో ఉండగా.. రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు రూ. 6,063 కోట్ల రెవెన్యూ లోటులోకి వెళ్లిపోయింది.

కేంద్ర పన్నులు, గ్రాంట్ల ద్వారా రూ.45 వేల కోట్లు!
కేంద్ర పన్నుల వాటా నుంచి, గ్రాంట్ల రూపంలో ఏకంగా రూ. 45,668 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేసింది. కేంద్ర పన్నుల వాటా నుంచి రూ. 16,837 కోట్లు, అలాగే గ్రాంట్ల రూపంలో రూ. 28,831 కోట్లు వస్తాయని బడ్జెట్ సందర్భంగా మంత్రి తెలిపారు. వార్షిక ప్రణాళికను భారీగా తగ్గించేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను కలిపినప్పటికీ వార్షిక ప్రణాళిక సైజును రూ. 26,673 కోట్లకే పరిమితం చేశారు.

వార్షిక ప్రణాళిక రూ. 26,673.17 కోట్లలో రంగాల వారీగా కేటాయింపులు..

వ్యవసాయ అనుబంధం

రూ.10,122.15 కోట్లు

సాగునీటికి

రూ.3210.49 కోట్లు

విద్యుత్‌కి

రూ.86.59 కోట్లు

సాంఘిక సేవలకు

రూ.10,659.50 కోట్లు

రవాణాకు

రూ.1,488.45 కోట్లు

ఇతర రంగాలకు

రూ.1,102.99 కోట్లు

Published date : 06 Sep 2014 04:51PM

Photo Stories