Skip to main content

ఇతర కేటాయింపులు

రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధికి రూ.2,683 కోట్లు
ప్రణాళిక వ్యయం కింద రూ.1,409 కోట్లు..
ప్రణాళికేతర వ్యయం కింద రూ. 1,274 కోట్లు
ఓడరేవుల అభివృద్ధికి రూ. 8.42 కోట్లు
రాష్ట్ర రహదారులు, రైల్వే వంతెనలు, రోడ్డు వంతెనలకు రూ. 1,359 కోట్లు
తిరుపతి విమానాశ్రయూనికి రూ.6.58 కోట్లు, రాజమండ్రి ఎరుుర్‌పోర్టుకు రూ. కోటి

ఆర్‌టీసీ ఆదుకోవాలని కోరినా పట్టించుకోలేదు!
ఆర్‌టీసీకి మొత్తం రూ. 4,734 కోట్లు అప్పు ఉందని, ఇందులో ఏపీకి సంబంధించి రూ. 2,625 కోట్లు, తెలంగాణకు రూ. 2,109 కోట్లు నష్టాలున్నట్లు యాజమాన్యం ఇరు రాష్ట్రాలకు నివేదించింది. ప్రజా రవాణా సంస్థను నిధులు కేటాయించి ఆదుకోకుంటే తీవ్ర సంక్షోభంలో పడుతుందని ఆ నివేదికలో స్పష్టంచేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకున్నట్లు లేదు. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తేలేదు. రవాణా శాఖకు సంబంధించి ప్రణాళికేతర వ్యయం కింద రూ. 116.85 కోట్లు కేటాయించారే తప్ప ఆర్‌టీసీ గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.
  • వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 సౌర విద్యుత్ పార్క్‌లను గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,925 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి రానుంది.
  • పారిశ్రామిక రంగానికి రూ. 615 కోట్లు కేటాయింపు.
  • ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన, జాతీయ స్థాయి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 5 శాతం వాటా సాధించడం లక్ష్యంతో ఐటీ శాఖకు రూ. 111 కోట్లు కేటాయించారు.
  • గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 6,094 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ. 4,260 కోట్లు కేటాయించాం. పట్టణాభివృద్ధికి రూ. 3,134 కోట్లు కేటాయించారు.
  • పౌర సరఫరాల శాఖకు రూ. 2,318 కోట్లు కేటాయింపు.
  • ఆధార్ నంబర్‌ను అన్ని పథకాలకూ అనుసంధానం చేయడం తప్పనిసరి చేయనున్నారు.
గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ఈ ఏడాది ప్రభుత్వం కేవలం 94 కోట్లకు మాత్రమే కేటాయించింది.
Published date : 06 Sep 2014 05:21PM

Photo Stories