అంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16
Sakshi Education
- రూ.14,184.03 కోట్లతో వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్..
- ప్రణాళికా వ్యయం రూ.4,513.45 కోట్లు..
- ప్రణాళికేతర వ్యయం రూ.9,670.58 కోట్లు
- ప్రకాశం జిల్లాలో ఐసీడీపీ పథకం..
- అనంతలో గోరుచిక్కుడు శుద్ధి కేంద్రం
- ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా విజయవాడ
వ్యవసాయ రంగ సంక్షోభాన్ని అధిగమించే రైతుల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ కర్తవ్యమని చెబుతోంది చంద్రబాబు సర్కారు. దీనికి తాము రూ.14,184.03 కోట్లతో ప్రవేశపెట్టిన ప్రత్యేక బడ్జెటే సాక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌ను ఆయన మార్చి 13న రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. మొత్తం బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం (రూ.4,513.45 కోట్లు) కంటే ప్రణాళికేతర వ్యయమే (రూ.9,670.58 కోట్లు) ఎక్కువగా ఉంది.
సహకార, ప్రాథమిక వ్యవసాయ సంఘాల కంప్యూటరీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో రూ.7.88 కోట్లతో ప్రయోగాత్మకంగా ఐసీడీపీ పథకాన్ని, అనంతపురం జిల్లా దాదులూరు గ్రామంలో రూ.8 కోట్లతో గవార్‌గమ్ (గోరుచిక్కుడు) శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2015-16లో ప్రభుత్వం 21.62 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.
బడ్జెట్ సమగ్ర స్వరూపం
సహకార, ప్రాథమిక వ్యవసాయ సంఘాల కంప్యూటరీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో రూ.7.88 కోట్లతో ప్రయోగాత్మకంగా ఐసీడీపీ పథకాన్ని, అనంతపురం జిల్లా దాదులూరు గ్రామంలో రూ.8 కోట్లతో గవార్‌గమ్ (గోరుచిక్కుడు) శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2015-16లో ప్రభుత్వం 21.62 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.
బడ్జెట్ సమగ్ర స్వరూపం
మొత్తం బడ్జెట్ | - రూ,14,184.03 కోట్లు |
ప్రణాళికా వ్యయం | - 4,513.45 కోట్లు |
ప్రణాళికేతర వ్యయం | - 9,670.58 కోట్లు |
కేటాయింపు ప్రతిపాదనలు ఇలా...రూ.కోట్లలో
రైతుల ఉచిత విద్యుత్‌కు | - 3,000 |
రుణమాఫీకి | - 4,300 |
జాతీయ ఉపాధి హామీ | - 2,717.61 |
హై వోల్టేజీ పంపిణీ విధాన పథకం (ఇందులో జైకా రుణం 251.58 కోట్లు) | - 294.75 |
జన్యుమార్పిడి పంటలపై ల్యాబ్స్‌కు | - 13.89 |
గోరుచిక్కుడు శుద్ధి కర్మాగారానికి | - 3 |
పావలా వడ్డీ | - 10 |
వడ్డీలేని రుణాలు | - 172 |
వ్యవసాయ యంత్రీకరణ | - 141.63 |
ఉపగ్రహ వ్యవస్థతో పంటల నియంత్రణ | - 3 |
పంటల మార్పిడి కోసం(విత్తనాలు) | - 80 |
యంత్రాలపై ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలకు | - 141.63 |
వ్యవసాయ విస్తరణకు | - 81.21 |
చంద్రన్న రైతు క్షేత్రం, పొలం పిలుస్తోంది | - 10 |
వ్యవసాయ మౌలికసదుపాయాలకు | - 20 |
కరువు నివారణ చర్యలకు | - 30 |
పొలంబడి కార్యక్రమం | - 1.46 |
మార్క్‌ఫెడ్‌కు | - 60 |
జాతీయ వ్యవసాయ మిషన్‌కు | - 513.21 |
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి | - 367.73 |
ఉద్యానవన శాఖకు | - 210 |
సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు | - 100 |
బిందు, తుంపర సేద్యానికి | - 144.07 |
కూరగాయల స్టోరేజీకి | - 58.25 |
పామాయిల్ తోటల పెంపకానికి | - 28.90 |
పట్టు పరిశ్రమ విభాగానికి | - 93.61 |
వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి | - 53.01 |
పశుసంవర్ధక శాఖకు | - 672.73 |
పశు వైద్యశాలల ఆధునీకరణకు | - 50 |
పశు వసతి గృహాలకు | - 5 |
మత్స్యశాఖకు | - 223 |
పశువైద్య విశ్వవిద్యాలయానికి | - 124.48 |
కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలకు | - 10.20 |
పశుగ్రాసం అభివృద్ధికి | - 41.40 |
గిడ్డంగుల అభివృద్ధి, నిర్మాణం | - 56 |
రైతుబంధు పథకం కింద రుణాలు (2014-15లో ఇచ్చినవి) | - 17.83 |
ప్రకాశంలో ఐసీడీపీ పథకం | - 7.88 |
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు | - రూ.5 లక్షల పరిహారం |
ఇందులో బాధిత కుటుంబానికి | - రూ.3.5 లక్షలు |
అప్పిచ్చిన వ్యక్తికి | - రూ.1.5 లక్షలు |
వర్షపాతం, పంటలు..
సగటు వర్ష పాతం లోటు | - 36 శాతం |
ఖరీఫ్‌లో పంటలు వేసిన విస్తీర్ణం | - 39.80 లక్షల హెక్టార్లు |
దిగుబడుల అంచనా (2013తో పోల్చితే 4.7 శాతం తక్కువ) | - 111.43 లక్షల టన్నులు |
కరువు ప్రాంతాలు..
రాష్ట్రంలో మొత్తం మండలాలు (కొత్తవి కలిపి) | - 670 |
కరవు పీడిత జిల్లాలు | - 7 |
కరువు మండలాలు | - 238 |
సాయం అందించిన మండలాలు | - లేవు |
కారణం | - ఇంకా నివేదికల స్థాయిలోనే |
రుణమాఫీ...
మొత్తం ఖాతాలు | - 80.66 లక్షలు |
తొలిదశలో ఉపశమనం (కుటుంబాలైతే 23.22లక్షలు) | - 40.50 లక్షలు |
ఇప్పటివరకు జమ అయిన మొత్తం | రూ.4,689 కోట్లు |
రెండో దశలో ఖాతాలు (కసరత్తు కొలిక్కి రాలేదు, డబ్బు జమ కాలేదు) | 42.16 లక్షలు |
ఉద్యాన వన పంట రైతులకు (ఎకరానికి) | రూ.10 వేలు |
Published date : 15 Mar 2015 03:32PM