Skip to main content

CBI Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1000 క్రెడిట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.85,920 జీతం..

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సీబీఐ) రెగ్యులర్‌ ప్రాతిపదికన జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌/స్కేల్‌–1(జేఎంజీఎస్‌) క్రెడిట్‌ ఆ­ఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1000 Credit Officer Posts in Central Bank of India Mumbai   Central Bank of India Credit Officer Recruitment 2025

మొత్తం పోస్టుల సంఖ్య: 1000.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి
(ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ 55 శాతం) ఉండాలి.
వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు  ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).
పే స్కేల్‌: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(30 ప్రశ్నలు–30 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(30 ప్రశ్నలు–30 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ(30 ప్రశ్నలు–30 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(రిలేటెడ్‌ టు బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ)(30 ప్రశ్నలు–30 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎస్సై పరీక్ష (రెండు ప్రశ్నలు–30 మార్కులు) ఉంటుంది. పరీక్ష ఇంగ్లిష్‌ హిందీ భాషల్లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 20.02.2025
వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in 

>> BOM Job Openings: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా జాబ్!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 08 Feb 2025 06:19PM

Photo Stories