పక్కా ప్రణాళికతోనే పల్లె బ్యాంకుల్లో కొలువు
Sakshi Education
దేశ ప్రగతికి పట్టుగొమ్మలుగా నిలుస్తున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రీజనల్ రూరల్ బ్యాంకులు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు అందిస్తున్నాయి.
ముఖ్యంగా చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అలాంటి రూరల్ బ్యాంకుల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకు వీలుగా తాజాగా ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 56 ఆర్‌ఆర్‌బీలలో ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. దీనిపై స్పెషల్ ఫోకస్...
అలహాబాద్ యూపీ గ్రామీణ్ బ్యాంకు, అస్సాం గ్రామీణ్ వికాస్ బ్యాంకు, బరోడా గుజరాత్ గ్రామీణ్ బ్యాంకు, జార్ఖండ్ గ్రామీణ్ బ్యాంకు, ప్రగతి కృష్ణ గ్రామీణ్ బ్యాంకు వంటి 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గ్రూప్-ఏ ఆఫీసర్స్ (స్కేల్ 1, 2, 3), గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీ పర్పస్) ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే వీలుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు.
అర్హతలు: 2015, జూలై 28 నాటికి డిగ్రీ పూర్తి కావాలి. వయసుకు 2015, జూలై 1ను పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.
ఆఫీస్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఆయా బ్యాంకులున్న ప్రాంతాన్ని బట్టి, నోటిఫికేషన్‌లో నిర్దేశించిన స్థానిక భాషలో ప్రావీణ్యత అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం అభిలషణీయం. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్ స్కేల్ 1: గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసీకల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యమిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంకు లేదా ఏదైనా ఆర్థిక సంస్థలో రెండేళ్ల ఆఫీసర్ అనుభవం ఉండాలి.
ఆఫీసర్ స్కేల్ 2 (స్పెషలిస్టు ఆఫీసర్లు): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/కంప్యూటర్‌సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచిల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ASp, PHP, C++, Java, VB, VC, OCP వంటి వాటిలో సర్టిఫికెట్ అభిలషణీయం. ఏడాది అనుభవం అవసరం.
ఆన్‌లైన్ పరీక్ష విధానం
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) (2 గంటలు):
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్), స్కేల్ - 3; 2 గంటలు:
ఆఫీసర్ స్కేల్-2 (స్పెషలిస్టు కేడర్)- 2.30 గంటలు:
ఎంపిక విధానం
తొలుత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశ కటాఫ్ సాధించిన వారికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నోడల్ రీజనల్ రూరల్ బ్యాంకు ఉమ్మడిగా ఇంటర్వ్యూలు (100 మార్కులకు) నిర్వహిస్తుంది. విజయం సాధించిన వారితో తుది జాబితా రూపొందిస్తారు. ప్రతిభ, అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్స్‌బట్టి ఏదో ఒక బ్యాంకుకు ఎంపిక చేస్తారు. పరీక్షలో సాధించిన స్కోర్ 2016, డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటవుతుంది.
ముఖ్య సమాచారం
పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
వెబ్‌సైట్: www.ibps.in
ప్రిపరేషన్ ప్రణాళిక
రీజనింగ్
అభ్యర్థుల మానసిక సంసిద్ధతను, లాజికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా రీజనింగ్‌లో ప్రశ్నలుంటాయి. కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్‌మెంట్ అండ్ కంక్లూజన్, వెర్బల్ రీజనింగ్,నంబర్ సిరీస్, అనాలజీ తదితర అంశాలపై దృష్టిసారించాలి. తార్కికంగా ఆలోచించే సామర్థ్యం ఉంటే ఈ విభాగంలోని ప్రశ్నలకు సులువుగా సమాధానాలివ్వొచ్చు.
న్యూమరికల్ ఎబిలిటీ
ప్రాథమిక కాలిక్యులేషన్ నైపుణ్యాలను పరిక్షీంచే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. సింప్లిఫికేషన్ (సూక్ష్మీకరణ) నుంచి కనీసం 15-20 ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి రోజూవారీ ప్రిపరేషన్ ప్రణాళికలో ఎక్కువ సమయాన్ని దీనికోసం కేటాయించాలి. వీటితోపాటు పర్సంటేజెస్, డెసిమల్స్, యావరేజెస్, కసాగు, గసాభా, రేషియో-ప్రపోర్షన్, లాభం-నష్టం, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ తదితర విభాగాలపైనా దృష్టిసారించాలి. అయిదు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక గణిత అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలి. వాటిని ఎక్కడ ఉపయోగించాలన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. షార్ట్‌కట్స్ ద్వారా ప్రశ్నలను సాధించడాన్ని ప్రాక్టీస్‌చేయడం ప్రధానం.
జనరల్ అవేర్‌నెస్
ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌పై అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలుంటాయి. ఈ సెక్షన్‌ను స్కోరింగ్ సెక్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు రోజూ వార్తాపత్రికలు చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా విధానాలు, ఆర్‌బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు-కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ నాలెడ్జ్ అంశాలను చదవాలి.
ఇంగ్లిష్ పరిజ్ఞానం
గ్రామర్, వొకాబ్యులరీ, వాక్యాల నిర్మాణం, సినానిమ్స్, యాంటానిమ్స్, కాంప్రెహెన్షన్ వంటి అంశాలపై ప్రశ్నలు అడగడం ద్వారా అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై ఉన్న పట్టును ప రీక్షిస్తారు. ఇంగ్లిష్‌పై పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు రోజూ ఇంగ్లిష్ పేపర్ చదవాలి. అందులోని వాక్యాలను పరిశీలించాలి. పద సంపదను పెంచుకోవడం ద్వారా సినానిమ్స్, యాంటానిమ్స్‌కు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.
కంప్యూటర్ పరిజ్ఞానం
అకడమిక్‌గా కంప్యూటర్ నేపథ్యం ఉన్నవారు ఈ విభాగంలోని ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించగలరు. నాన్ కంప్యూటర్ అకడమిక్ నేపథ్యం ఉన్నవారు కూడా ఈ విభాగంలోని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలివ్వడం పెద్ద కష్టమేం కాదు. వీరు మార్కెట్లోని ఏదైనా మంచి కంప్యూటర్ అవేర్‌నెస్ పుస్తకం ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. బేసిక్ కంప్యూటర్ పదజాలం, హార్‌డవేర్ అండ్ సాఫ్ట్‌వేర్ బేసిక్స్, కంప్యూటర్ ఉపయోగాలు, కంప్యూటర్ భాగాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
ప్రిపరేషన్ టిప్స్

- చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగానికి సీఏ, ఏడాది అనుభవం అవసరం. లా ఆఫీసర్‌కు కనీసం 50 శాతం మార్కులతో లా డీగ్రీ ఉండాలి. రెండేళ్లకు తక్కువ కాకుండా ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో అడ్వొకేట్/లా ఆఫీసర్‌గా అనుభవం ఉండాలి.
- ట్రెజరీ మేనేజర్‌కు సీఏ/ఎంబీఏ (ఫైనాన్స్)తో పాటు ఏడాది అనుభవం అవసరం. మార్కెటింగ్ ఆఫీసర్‌కు ఎంబీఏ (మార్కెటింగ్), ఏడాది అనుభవం ఉండాలి. అగ్రికల్చరల్ ఆఫీసర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చర్/హార్టికల్చర్/డెయిరీ/యానిమల్ హజ్బెండరీ/ఫారెస్ట్రీ/వెటర్నరీ సైన్స్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/పిసీకల్చర్ డిగ్రీ ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ పరీక్ష విధానం
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) (2 గంటలు):
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
రీజనింగ్ | 40 | 50 |
న్యూమరికల్ ఎబిలిటీ | 40 | 50 |
జనరల్ అవేర్‌నెస్ | 40 | 40 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్/ | 40 | 40 |
హిందీ లాంగ్వేజ్ | 40 | 40 |
కంప్యూటర్ లాంగ్వేజ్ | 40 | 20 |
మొత్తం | 200 | 200 |
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్), స్కేల్ - 3; 2 గంటలు:
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
రీజనింగ్ | 40 | 50 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ | 40 | 50 |
ఫైనాన్షియల్ అవేర్‌నెస్ | 40 | 40 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్/ | 40 | 40 |
హిందీ లాంగ్వేజ్ | 40 | 40 |
కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 20 |
మొత్తం | 200 | 200 |
ఆఫీసర్ స్కేల్-2 (స్పెషలిస్టు కేడర్)- 2.30 గంటలు:
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
రీజనింగ్ | 40 | 40 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ | 40 | 40 |
ఫైనాన్షియల్ అవేర్‌నెస్ | 40 | 40 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్/ | 40 | 20 |
హిందీ లాంగ్వేజ్ | 40 | 20 |
కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 20 |
ప్రోఫెషనల్ నాలెడ్జ్ | 40 | 40 |
మొత్తం | 240 | 200 |
- ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్‌లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రశ్నలు హిందీ/ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష తరహాలోనే స్కేల్ 1 ఆఫీసర్ పరీక్ష ఉంటుంది. అయితే న్యూమరికల్ ఎబిలిటీ బదులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని పేర్కొన్నారు. ఆఫీసర్ పేపర్‌లో ప్రశ్నల క్లిష్టత కూడా ఎక్కువగా ఉంటుంది. స్కేల్ -2 (జనరల్), స్కేల్-3 పరీక్షల విధానం ఒకేలా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ఎంపిక విధానం
తొలుత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశ కటాఫ్ సాధించిన వారికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నోడల్ రీజనల్ రూరల్ బ్యాంకు ఉమ్మడిగా ఇంటర్వ్యూలు (100 మార్కులకు) నిర్వహిస్తుంది. విజయం సాధించిన వారితో తుది జాబితా రూపొందిస్తారు. ప్రతిభ, అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్స్‌బట్టి ఏదో ఒక బ్యాంకుకు ఎంపిక చేస్తారు. పరీక్షలో సాధించిన స్కోర్ 2016, డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటవుతుంది.
ముఖ్య సమాచారం
- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులు రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఏదో ఒక ఆఫీసర్ కేడర్ పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: జూలై 8, 2015- జూలై 28, 2015.
- ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు: జూలై 8, 2015- జూలై 28, 2015.
- ఆన్‌లైన్ పరీక్ష: సెప్టెంబర్, 2015. ఫలితాల వెల్లడి: అక్టోబర్, 2015.
- ఫీజు: ఆఫీసర్ (స్కేల్1, 2, 3) ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.600. ఆఫీస్ అసిస్టెంట్-ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎక్స్‌ఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.600.
పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
వెబ్‌సైట్: www.ibps.in
ప్రిపరేషన్ ప్రణాళిక
రీజనింగ్
అభ్యర్థుల మానసిక సంసిద్ధతను, లాజికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా రీజనింగ్‌లో ప్రశ్నలుంటాయి. కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్‌మెంట్ అండ్ కంక్లూజన్, వెర్బల్ రీజనింగ్,నంబర్ సిరీస్, అనాలజీ తదితర అంశాలపై దృష్టిసారించాలి. తార్కికంగా ఆలోచించే సామర్థ్యం ఉంటే ఈ విభాగంలోని ప్రశ్నలకు సులువుగా సమాధానాలివ్వొచ్చు.
న్యూమరికల్ ఎబిలిటీ
ప్రాథమిక కాలిక్యులేషన్ నైపుణ్యాలను పరిక్షీంచే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. సింప్లిఫికేషన్ (సూక్ష్మీకరణ) నుంచి కనీసం 15-20 ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి రోజూవారీ ప్రిపరేషన్ ప్రణాళికలో ఎక్కువ సమయాన్ని దీనికోసం కేటాయించాలి. వీటితోపాటు పర్సంటేజెస్, డెసిమల్స్, యావరేజెస్, కసాగు, గసాభా, రేషియో-ప్రపోర్షన్, లాభం-నష్టం, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ తదితర విభాగాలపైనా దృష్టిసారించాలి. అయిదు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక గణిత అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలి. వాటిని ఎక్కడ ఉపయోగించాలన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. షార్ట్‌కట్స్ ద్వారా ప్రశ్నలను సాధించడాన్ని ప్రాక్టీస్‌చేయడం ప్రధానం.
జనరల్ అవేర్‌నెస్
ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌పై అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలుంటాయి. ఈ సెక్షన్‌ను స్కోరింగ్ సెక్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు రోజూ వార్తాపత్రికలు చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా విధానాలు, ఆర్‌బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు-కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ నాలెడ్జ్ అంశాలను చదవాలి.
ఇంగ్లిష్ పరిజ్ఞానం
గ్రామర్, వొకాబ్యులరీ, వాక్యాల నిర్మాణం, సినానిమ్స్, యాంటానిమ్స్, కాంప్రెహెన్షన్ వంటి అంశాలపై ప్రశ్నలు అడగడం ద్వారా అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై ఉన్న పట్టును ప రీక్షిస్తారు. ఇంగ్లిష్‌పై పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు రోజూ ఇంగ్లిష్ పేపర్ చదవాలి. అందులోని వాక్యాలను పరిశీలించాలి. పద సంపదను పెంచుకోవడం ద్వారా సినానిమ్స్, యాంటానిమ్స్‌కు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.
కంప్యూటర్ పరిజ్ఞానం
అకడమిక్‌గా కంప్యూటర్ నేపథ్యం ఉన్నవారు ఈ విభాగంలోని ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించగలరు. నాన్ కంప్యూటర్ అకడమిక్ నేపథ్యం ఉన్నవారు కూడా ఈ విభాగంలోని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలివ్వడం పెద్ద కష్టమేం కాదు. వీరు మార్కెట్లోని ఏదైనా మంచి కంప్యూటర్ అవేర్‌నెస్ పుస్తకం ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. బేసిక్ కంప్యూటర్ పదజాలం, హార్‌డవేర్ అండ్ సాఫ్ట్‌వేర్ బేసిక్స్, కంప్యూటర్ ఉపయోగాలు, కంప్యూటర్ భాగాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
ప్రిపరేషన్ టిప్స్
- పరీక్ష తేదీ వరకు ప్రిపరేషన్ ప్రణాళిక వేసుకుంటూ రోజూవారీ ప్రిపరేషన్ సాగించాలి. ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌ను సమీక్షించుకొని, తప్పులను సరిదిద్దుకోవాలి.
- రోజుకో మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
- సమయపాలనకు ప్రాధాన్యమివ్వాలి. ఎంత తక్కువ సమయంలో ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ఇస్తామనే దానిపైనే విజయావకాశాలు ఆ ధారపడి ఉంటాయని గుర్తుంచుకొని, ప్రాక్టీస్ చేయాలి.
- హార్డ్‌వర్క్‌కు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదనే విషయాన్ని గుర్తించి కష్టపడి సిలబస్‌లోని అన్ని అంశాలపైనా పట్టు సాధించేందుకు కృషి చేయాలి.
Published date : 26 Jun 2015 05:56PM