Skip to main content

ఎస్‌బీఐ పీవో కొలువు.. శ్రమిస్తే సులువు

బ్యాంకు కొలువుల ఔత్సాహికుల్లో ఉత్సాహం నింపే వార్త.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 2,200 పోస్టులతో భారీ నియామకాలకు తెరతీసింది. మూడంచెల ఎంపికలో మెయిన్ పరీక్షలో మార్పులు చేసింది. పోస్టుల వివరాలు, విజయానికి వ్యూహాలు..
మొత్తం ఖాళీలు: 2200
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 2016, ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏళ్లు.(రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
ఫీజు: ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ: రూ.100., జనరల్, ఓబీసీ: రూ. 600.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మే 4, 2016 - మే 24, 2016
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్) తేదీలు: జూలై 2, 3, 9, 10 తేదీల్లో
మెయిన్ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్): జూలై 31, 2016
వెబ్‌సైట్: www.sbi.co.in/careers, www.statebankofindia/careers

ఎంపిక విధానం:
మూడంచెల ఎంపిక విధానం ఉంటుంది. అవి..
ఫేజ్-1: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (100 మార్కులు)
ఫేజ్-2: మెయిన్ ఎగ్జామినేషన్ (200 మార్కులు). దీంతోపాటు ఇదే దశలో డిస్క్రిప్టివ్ టెస్ట్ (లెటర్ రైటింగ్, జనరల్ ఎస్సే) 50 మార్కులకు ఉంటుంది.
ఫేజ్-3: గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ - 50 మార్కులు.

ఫేజ్-2 లోని డిస్క్రిప్టివ్ టెస్ట్ మినహా ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్‌లు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. అంతేకాకుండా డిస్క్రిప్టివ్ టెస్ట్ సహా ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్‌లు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి.

తుది ఎంపిక
ప్రతి దశలో ప్రతి సెక్షన్‌లో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. ప్రిలిమ్స్ మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ కనీస అర్హత మార్కులు సాధిస్తేనే తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో మెయిన్ ఎగ్జామినేషన్‌లో పొందిన మార్కులకు 75 శాతం; చివరి దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది.

కళ్లు చెదిరే వేతనం: ఎస్‌బీఐ పీవోగా స్కేల్-1 హోదాలో ప్రవేశించిన అభ్యర్థుల మూల వేతనం నెలకు రూ.27,620 ఉంటుంది. దీంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, మెడికల్ అలవెన్స్ వంటివన్నీ కలిపి సంవత్సరానికి కనిష్టంగా రూ.7.55 లక్షలు, గరిష్టంగా రూ.12.93 లక్షలు లభిస్తుంది.

పరీక్షా విధానం
పిలిమినరీ ఎగ్జామినేషన్

విభాగం

ప్రశ్నలు

మార్కులు

ఇంగ్లిష్ లాంగ్వేజ్

30

30

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

35

35

రీజనింగ్ ఎబిలిటీ

35

35

మొత్తం

100

100

సమయం: ఒక గంట

మెయిన్ ఎగ్జామినేషన్

సెక్షన్

ప్రశ్నలు

మార్కులు

సమయం (ని॥లు)

రీజనింగ్ అండ్ కంప్యూటర్

45

60

60

ఆప్టిట్యూడ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌

35

60

45

జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్

40

40

35

ఇంగ్లిష్ లాంగ్వేజ్

35

40

40

మొత్తం

155

200

180 (ని॥లు)


గమనిక: మొత్తం మీద మెయిన్‌లో గతంతో పోల్చితే ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 155కు తగ్గించడం, సమయాన్ని రెండు గంటల నుంచి మూడు గంటలకు పెంచడం ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతుందనడానికి సంకేతం.

ప్రిపరేషన్ టిప్స్
  • రీజనింగ్‌కు సంబంధించి విశ్లేషణ సామర్థ్యం, తార్కిక జ్ఞానం పెంచుకునే విధంగా కృషి చేయాలి.
  • డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌కు కాలిక్యులేషన్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోసం బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.

మెయిన్ దృక్పథంతోనే సాగాలి
ఎస్‌బీఐ పీవో ఔత్సాహిక అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్ దృక్పథంతోనే ప్రిపరేషన్ సాగించాలి. ప్రిలిమినరీ, మెయిన్‌లలో కొన్ని విభాగాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. మెయిన్‌లో క్లిష్టత స్థాయి పెరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత నిర్వహించే డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో రాణించేందుకు ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు చదవడం, వాటి సారాంశాన్ని సొంత మాటల్లో రాసుకోవడం వంటి విధానాలు అమలు చేయాలి.
- ఎన్.వినయ్ కుమార్ రెడ్డి, చైర్మన్, ఐఏసీఈ, హైదరాబాద్.

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
ఎస్‌బీఐ పీవో పరీక్షలో విజయానికి అత్యంత కీలకమైన సాధనం ప్రాక్టీస్. ఏ విభాగమైనా ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి ఈ ప్రాక్టీస్ మరింత ఎక్కువగా ఉండాలి.
- వి.కమల్‌నాథ్, ఎస్‌బీఐ పీవో (ఓల్డ్ మలక్‌పేట బ్రాంచ్), ఎస్‌బీఐ పీవో-2015 విజేత.
Published date : 06 May 2016 12:33PM

Photo Stories