బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ కొలువులు
Sakshi Education
మన దేశంలో బ్యాంకింగ్ రంగం గత రెండేళ్లుగా ఉద్యోగ నియామకాల పరంగా ముందంజలో నిలుస్తోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు వంటివాటితో బ్యాంకుకు వెళ్లకుండానే వినియోగదారులు తమ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. క్యాష్ డిపాజిట్ మెషీన్ (సీడీఎం), ఏటీఎంలు వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తున్నాయి. వీటన్నింటికీ టెక్నాలజీనే ఆధారం. ఇవన్నీ సక్రమంగా పని చేయాలంటే సంబంధిత సాంకేతిక నిపుణుల అవసరం తప్పనిసరి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో ఉండే టెక్నికల్ ఉద్యోగాల వివరాలు..
దేశంలో బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ ఆధారిత సేవలు 40 శాతంపైనే నమోదవుతున్నట్లు అంచనా. ప్రస్తుతం ఆయా బ్యాంకులు సాధారణ బ్యాంకింగ్ సేవలతోపాటు క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ (సాధారణ/ఆరోగ్య /ప్రమాద/వాహన), మ్యూచువల్ ఫండ్ల వెబ్‌సైట్స్, యాప్స్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులకు ఎదురయ్యే అన్ని రకాల సాంకేతిక సమస్యలు, సందేహాలకు నిపుణులు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. దీంతో వివిధ బ్యాంకుల్లో టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది.
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్స్
ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న టెక్నాలజీ ఆధారిత సేవల దృష్ట్యా ప్రతి బ్యాంకుకు నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తప్పనిసరి. బ్యాంకులు.. తమ ప్రధాన కేంద్రం నుంచి బ్రాంచ్ ఆఫీస్‌లకు కేంద్రీకృత విధానం (సెంట్రలైజ్డ్ సిస్టమ్)లో అంతర్గత వ్యవహారాలతోపాటు, కస్టమర్లకు అవసరమైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్ విధానంపైనే ఆధారపడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వర్లు, లాన్, ఇంట్రానెట్ అవసరం ఉంటుంది. వీటిని నిర్వహించేందుకు నెట్‌వర్క్ విభాగంలో నిపుణులు కావాలి. దీంతో డాట్ నెట్ నైపుణ్యాలున్న అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగం ఉపాధి వేదికగా నిలుస్తోంది. సీసీఎన్‌ఏ, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ తదితర ప్రత్యేక సర్టిఫికేషన్లను పూర్తిచేసుకుంటే అవకాశాలు మరింత మెరుగవుతాయి. నెట్‌వర్క్ నిపుణులతోపాటు దీనికి సంబంధించిన హార్డ్‌వేర్ ప్రొఫెషనల్స్‌కూ బ్యాంకింగ్ రంగంలో డిమాండ్ ఏర్పడుతోంది. నైపుణ్యాలున్న నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్స్‌కు ప్రారంభంలో నెలకు రూ.30 వేలకు పైగానే వేతనం అందుతోంది.
డేటా మేనేజ్‌మెంట్
బ్యాంకుల ఆధునికీకరణ నేపథ్యంలో డేటా అనలిటిక్స్ నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వినియోగదారులు కోరుకుంటున్న సేవలు, ప్రొడక్ట్ సమాచారాన్ని బ్యాంకులు సేకరించి విశ్లేషించేందుకు డేటా మేనేజ్‌మెంట్ విభాగం ఉపయోగపడుతుంది. ఈ విభాగంలో డేటా అనలిస్ట్స్, డేటా సైంటిస్ట్స్, బిగ్ డేటా మేనేజర్స్ తదితర నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. డేటా మేనేజ్‌మెంట్ విభాగంలో కెరీర్ కోరుకునే యువత సాస్, హడూప్ సర్టిఫికేషన్లు పొందితే మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. డేటాసైన్స్, బిగ్ డేటా, బిజినెస్ అనలిటిక్స్‌కు సంబంధించిన కోర్సులను పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. వీరికి నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వేతనం ఖాయం.
క్లౌడ్ ఎక్స్‌పర్ట్స్
బ్యాంకింగ్ రంగంలో ఆన్‌లైన్, టెక్నాలజీ ఆధారిత సేవల పరంగా విస్తృత అవకాశాలు కల్పిస్తున్న విభాగం.. క్లౌడ్ సర్వీసెస్. బ్యాంకులు తమ సర్వీసులను, ప్రొడక్ట్స్‌ను వినియోగదారులకు చేరువ చేయడానికి పలు ఆన్‌లైన్ టూల్స్‌పై ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా పలు మొబైల్ యాప్స్‌ను రూపొందిస్తున్నాయి. వీటిని కస్టమర్స్ నేరుగా డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకునేందుకు క్లౌడ్ టెక్నాలజీ అవసరం. హెచ్‌టీఎంఎల్, డాట్ నెట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై అవగాహన కలిగిన అభ్యర్థులు క్లౌడ్ విభాగం నైపుణ్యాలు సులువుగానే సొంతం చేసుకోవచ్చు. క్లౌడ్ సర్వీసెస్‌కు సంబంధించి ప్రత్యేకించి అకడమిక్ కోర్సులు లేవు. పలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థలే క్లౌడ్ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఉదాహరణకు.. హెచ్‌పీ క్లౌడ్ సర్టిఫికేషన్, ఐబీఎం సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఈ కోవకు చెందినవే. కోర్సులు పూర్తిచేసినవారికి క్లౌడ్ కన్సల్టెంట్, క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవలపర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
సైబర్ సెక్యూరిటీ
బ్యాంకుల ఆన్‌లైన్ కార్యకలాపాల పరంగా అత్యంత కీలకమైన విభాగం.. సైబర్ సెక్యూరిటీ. సదరు వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్ టూల్స్, సర్వీస్‌లు హ్యాకింగ్‌కు గురికాకుండా చూసే విభాగమే సైబర్ సెక్యూరిటీ. ఇటీవల హ్యాకింగ్ బెడద పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా పూర్తిగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం, కార్యకలాపాలు ఉండే బ్యాంకులు సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టిసారించడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. అంతేకాకుండా ఒక ఆన్‌లైన్ సర్వీస్‌ను లేదా ప్రొడక్ట్‌ను ప్రవేశపెట్టే ముందే దాని సెక్యూరిటీ స్థాయిని, హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలను పరీక్షించగలిగే నిపుణుల అవసరముంది. దీంతో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు పెరిగాయి. 2020 నాటికి అన్ని రంగాల్లో దాదాపు పది లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని అంచనా. ఇందులో బ్యాంకింగ్ రంగం వాటా 25 నుంచి 30 శాతం మేర ఉంటుంది. ఈ విభాగంలో నైపుణ్యాలున్నవారికి ఎంట్రీ లెవల్‌లో రూ.30 వేల వేతనంతో సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ హోదా లభిస్తుంది.
డిజిటల్ మార్కెటింగ్
బ్యాంకింగ్ రంగంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న మరో విభాగం.. డిజిటల్ మార్కెటింగ్. ఆన్‌లైన్ విధానంలో సేవలందిస్తున్న బ్యాంకులు ఆ వివరాలను వినియోగదారులకు చేరవేసేందుకు డిజిటల్ బాటపడుతున్నాయి. తాము ఇప్పటికే అందిస్తున్న సేవలు, కొత్తగా ప్రవేశపెట్టనున్న పథకాలు, వాటి ప్రత్యేకతలను తెలియజేస్తూ వినియోగదారులకు ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. ఈ క్రమంలో సంబంధిత సేవల సమాచారాన్ని ఆకర్షణీయంగా రూపొందించే కంటెంట్ డెవలపర్స్, డిజైనర్స్, వెబ్ డెవలప్‌మెంట్ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఆయా నైపుణ్యాలు సొంతం చేసుకున్న నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ప్రవేశ మార్గాలు..

- పభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రవేశించాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) నిర్వహించే స్పెషలిస్ట్ ఆఫీసర్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టెక్నాలజీ విభాగంలో మిడిల్ లెవల్, అప్పర్ మిడిల్ లెవల్ ఉద్యోగాల కోసం ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాంకులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేపడుతున్నాయి.
- ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా సొంత నియామక పరీక్షలను నిర్వహించడంతోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి.
- వీటితోపాటు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్, సదరు బ్యాంకుల వెబ్‌సైట్స్‌లో ప్రకటనలు ఇస్తున్నాయి.
Published date : 28 Jul 2016 04:08PM