బ్యాంక్ కొలువుకు మరో మార్గం..
Sakshi Education
బ్యాంకుల్లో ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే..? జాతీయ స్థాయిలో నిర్వహించే ఐబీపీఎస్ వంటి పోటీ పరీక్షలు.. వాటిలో విజయానికి.. కొలువు ఖరారు చేసుకోవడానికి విస్తృత ప్రణాళికలు.. విభిన్న వ్యూహాలు.. సాధారణంగా బ్యాంకుల్లో క్లరికల్ స్థాయి నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ వరకు ఉద్యోగ సాధనకు మార్గాలు. కానీ.. బ్యాంకింగ్ రంగంలో ట్రెండ్ మారుతోంది. ఫ్రెష్ టాలెంట్‌ను రిక్రూట్ చేసుకునేందుకు బ్యాంకులు కొత్త పంథా అనుసరిస్తున్నాయి. తమ అవసరాలకు సరితూగే విధంగా ప్రత్యేకంగా కోర్సులు ప్రవేశపెడు తున్నాయి. ఇందుకోసం అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కోర్సు పూర్తి చేస్తే సర్టిఫికెట్, సదరు బ్యాంకులో కొలువు ఖాయం. తొలుత ప్రైవేటు బ్యాంకులతో మొదలై.. ప్రభుత్వ రంగ బ్యాంకులకూ విస్తరిస్తున్న.. బ్యాంకింగ్ కెరీర్ గ్యారెంటీ కోర్సులపై విశ్లేషణ...
బ్యాంకింగ్.. శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం. అంతేస్థాయిలో మానవ వనరుల డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐ మినహా మిగతా అన్ని బ్యాంకులకు క్లరికల్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ (ఐబీపీఎస్) జాతీయస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ.. దాంతోపాటు, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాలకు.. సొంత ఎంపిక ప్రక్రియను అనుసరిస్తోంది.
ఉద్యోగుల ఎంపికలో ప్రత్యేక శ్రధ్ధ
ఇక.. ప్రైవేటు బ్యాంకులు.. యువ ప్రతిభా వంతులకు పెద్దపీట వేస్తున్నాయి. వివిధ రూపాల్లో ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి ఉద్యోగుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా యి. తమ బ్యాంకు అవసరాలకు సరితూగేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నాయి. క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకుని, పూర్తిస్థాయి బ్యాంకింగ్ పరిజ్ఞానం పొందిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకుం టున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్సులు రూపొందిస్తున్నాయి. వీటిని వివిధ విద్యా సంస్థలతో ఒప్పందం ద్వారా అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి బ్యాంకింగ్‌లో పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌తోపాటు.. మేనేజ్‌మెంట్ ట్రైనీ, ప్రొబేషనరీ ఆఫీసర్ హోదాలతో కొలువులు ఖరారవుతున్నాయి.
బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో కోర్సులు
ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకు.. ఇలా ప్రైవేటు బ్యాంకులు ఇప్పుడు బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా ఉన్న ఈ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ప్రవేశ పరీక్షల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జన రల్ నాలెడ్జ్, రీజనింగ్ ఎబిలిటీ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
పేర్లు వేర్వేరు.. లక్ష్యం ఒకటే
ఆయా బ్యాంకులు అందిస్తున్న ఈ కోర్సుల పేర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. అన్నింటి లక్ష్యం ఒకటే. అది.. పూర్తిస్థాయిలో విధుల్లోకి అడుగుపెట్టే నాటికి బ్యాంకింగ్ కార్యకలాపాలపై పరిపూర్ణ అవగాహన కల్పించడం. ఉదాహరణకు.. ఐసీఐసీ ఐ బ్యాంకు.. మణిపాల్ యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా అందిస్తున్న కోర్సు.. పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్. ఈ కోర్సు పూర్తి చేసినవారిని ఐసీఐసీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమిస్తారు. ఇదే విధంగా యాక్సిస్ బ్యాంకు ‘యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్’ పేరుతో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కోర్సును అందిస్తోంది. ఇవేకాకుండా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు సొంతంగా గ్రాడ్యుయేషన్ అర్హతగా రెండేళ్ల వ్యవధి ఉన్న గ్రాడ్యుయేట్ అనలిస్ట్ ప్రోగ్రామ్‌ను పలు విభాగాల్లో నిర్వహిస్తోంది.
క్లాస్ రూం + ప్రాక్టికల్ నాలెడ్జ్
బ్యాంకులు అందించే ఈ కోర్సులు సాధారణంగా ఏడాది వ్యవధిలో ఉంటున్నాయి. విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకునే రీతిలో కరిక్యులం అమలవుతోంది. బోధనలో భాగంగా ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, రిస్క్ అనాలిసిస్ వంటి కోర్ అంశాలతో పాటు.. బ్యాంకు సేవలు, విధివిధానాలపై అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో ఏడాది కోర్సులో తొమ్మిది నెలలు క్లాస్ రూం టీచింగ్ తర్వాత మూడు నెలలు సంబంధిత బ్యాంకులో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
అడ్మిషన్ రోజు నుంచే ఆదాయం
బ్యాంకులు అందిస్తున్న.. ఈ కోర్సుల్లో చేరిన వారికి క్లాస్‌రూంలో అడుగుపెట్టిన రోజు నుంచే ఆదాయం పొందే అవకాశం లభిస్తోంది. క్లాస్ రూం టీచింగ్, ఇంటర్న్‌షిప్ సమయంలో నిర్ణీత మొత్తాన్ని స్టైఫండ్ రూపంలో ఆయా సంస్థలు ఇస్తున్నాయి. ఈ మొత్తాలు ఆయా బ్యాంకుల విధివిధానాల మేరకు ఉంటున్నాయి. యాక్సిస్ బ్యాంకు క్లాస్ రూం టీచింగ్‌లో నెలకు రూ. 5 వేలు;ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 9 వేలు అందిస్తోంది.
ఫీజుల కోసం రుణ సదుపాయం
ఆయా కోర్సులకు నిర్దేశించిన ఫీజు, ఇతర అకడమిక్ ఖర్చులకు కావాల్సిన మొత్తానికి సదరు బ్యాంకులే రుణ సదుపాయం కూడా అందిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసుకుని బ్యాంకులో ‘కొలువు’దీరాక నిర్ణీత వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా కోర్సు పూర్తయ్యాక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మారటోరియం సదుపాయం (రీ పేమెంట్ హాలిడే)ను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి.
సర్వీస్ ఒప్పందం
కోర్సులు పూర్తి చేసుకుని సదరు బ్యాంకులో ఉద్యోగం సొంతం చేసుకున్న అభ్యర్థులు నిర్దేశించిన సంవత్సరాలు పనిచేస్తామని సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆయా బ్యాంకుల విధానాలపై ఆధారపడి ఉంటుంది. కోర్సులకు దరఖాస్తు చేసేముందే అభ్యర్థులు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం
సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాలు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఐబీపీఎస్ క్లరికల్, పీవో పరీక్షల స్కోర్, ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతాయి. కానీ ఇటీవల కొన్ని బ్యాంకులు ఐబీపీఎస్ విధానంతోపాటు.. తాము కూడా సొంతంగా కోర్సును నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికి కొలువులిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు.. మణిపాల్ గ్లోబల్ అకాడమీతో కలిసి సంయుక్తంగా ఏడాది వ్యవధిలో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్‌స కోర్సుకు రూపకల్పన చేశాయి. మొత్తం అభ్యర్థుల సంఖ్యలో ప్రభుత్వ విధానాల మేరకు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు టెక్నికల్ సిబ్బంది నియామకం కోసం కూడా అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ పేరుతో ఒక ప్రత్యేక కోర్సుకు శ్రీకారం చుట్టింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్, ఐటీ విభాగాల్లో జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్‌తో ప్రారంభ హోదా లభిస్తుంది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా తాజాగా మణిపాల్ గ్లోబల్ అకాడమీతో ఒప్పందం ద్వారా పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సుకు రూపకల్పన చేసింది.
ప్రవేశ పరీక్షలో రాణించాలంటే
బ్యాంకులు అందిస్తున్న కోర్సులు.. వాటిలో ప్రవేశానికి సంబంధించి ప్రతి బ్యాంకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో రాణించడం సులభమే. ఇప్పటికే ఐబీపీఎస్, ఎస్‌బీఐ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అదే ప్రిపరేషన్‌తో ఈ కోర్సుల ఎంట్రెన్స్‌లకూ హాజరుకావచ్చు. తాజాగా బ్యాచిలర్స్ డిగ్రీతో ఈ కోర్సులనే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ స్కిల్స్, అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్‌లపై పట్టు సాధిస్తే విజయం సాధించడం సులువే. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు సాధారణంగా డిసెంబర్ నుంచి జూలై వరకు ఆయా బ్యాంకుల అవసరాలకు అనుగుణంగా వెలువడతాయి. వివిధ జాతీయస్థాయి దినపత్రికలను చూస్తుండాలి.
అదనంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న జాబ్ గ్యారెంటీ కోర్సుల ప్రవేశ ప్రక్రియలో అభ్యర్థులు అదనంగా ఎదుర్కోవాల్సిన దశ గ్రూప్ డిస్కషన్. రాత పరీక్షలో విజయం సాధించిన వారికి బృంద చర్చలు ఉంటాయి. ఇందులోనూ రాణిస్తే మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. చివరకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
అకడమిక్ ట్రాక్ బాగుంటేనే
జాబ్ గ్యారెంటీ కోర్సులను అందిస్తున్న ఆయా బ్యాంకులు అభ్యర్థుల అర్హతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు అకడమిక్ రికార్డ్ బాగుంటేనే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాచిలర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. అంతేకాకుండా గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్దేశించి.. తాజా గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పిస్తున్నాయి.
బోస్టన్ నివేదిక పేర్కొన్న అంశాలు
బ్యాంకుల్లో సుశిక్షితులైన మానవ వనరుల సిబ్బంది ఆవశ్యకతపై ఇండియన్ బ్యాంకింగ్-2020 పేరిట బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రూపొందించిన నివేదిక.. బ్యాంకులు - అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్.. ఒప్పందాల ద్వారా ప్రత్యేకమైన కోర్సులు రూపొందించాలని పేర్కొంది. తద్వారా బ్యాంకుల్లో అవసరమైన నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనిసూచించింది. ముఖ్యంగా క్లరికల్, జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్-1 స్థాయి పోస్టుల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏలు, ఇతర పీజీ ప్రోగ్రామ్‌లు ఎంతో అవసరమని తెలిపింది.

ప్రయోజనాలు చేకూర్చే టై-అప్స్ ఇప్పుడు పలు బ్యాంకులు తమ అవసరాలకు సరితూగే విధంగా ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం ద్వారా కోర్సులు నిర్వహించడం.. అటు ఔత్సాహిక అభ్యర్థులకు, ఇటు పరిశ్రమ వర్గాలకు ప్రయోజనకరం. వీటి ద్వారా అభ్యర్థులకు ముందుగానే తాము కార్యక్షేత్రం లో నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన లభిస్తుంది. మరోవైపు బ్యాంకుల కోణంలో వినియోగదారులకు చక్కటి సేవలందించేం దుకు సుశిక్షితులైన సిబ్బంది దొరుకుతారు. ఎం. కమలాకర్‌రావు, డీజీఎం, ఆంధ్రాబ్యాంకు |
ఔత్సాహికులకు సరైన అవకాశం బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోరుకునే ఔత్సాహికులకు, అదేవిధంగా ఉన్నత విద్య అభిలాష ఉన్న వారికి అనుకూలమైనవి ఈ జాయింట్ వెంచర్ కోర్సులు. శరవేగంగా వృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగంలో ఏటా వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. అదే సమయంలో క్షేత్ర నైపుణ్యాలు కలిగిన సిబ్బంది ద్వారా వినియోగదారులకు మరింత సేవలందించా లనే ఉద్దేశంతోనే ఈ కోర్సుల రూపకల్పన జరుగుతోంది. అభ్యర్థులు జాబ్ ట్రెండ్‌నే దృష్టిలో పెట్టుకోకుండా తమ అభిరుచికి కూడా ప్రాధాన్యమిస్తే రెండూ నెరవేరే అవకాశం లభిస్తుంది. కె. శ్రీధర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్), టాలెంట్ స్ప్రింట్. |
ఆ మూడు అవసరాలు తీరేలా ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లో మానవ వనరుల అవసరం ఎంతో ఉంది. అదే సమయంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పెద్ద కసరత్తుగా మారింది. ఈ నేపథ్యం లో ఆవిష్కృతమవుతున్నవే బ్యాంకింగ్ కోర్సులు. వీటి ద్వారా బ్యాంకుల కోణం లో మ్యాన్ పవర్ డిమాండ్, సప్లయ్, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనే మూడు ప్రధాన లక్ష్యాలు నెరవేరుతాయి. ఔత్సాహిక విద్యార్థులు ఈ అవకాశాలను అంది పుచ్చుకుంటే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు. జి. వాసుదేవన్, సదరన్ హెడ్, కోటక్ మహీంద్ర బ్యాంక్ |
Published date : 08 Sep 2014 11:50AM